అణగారిన వర్గాలు ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే-

- జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్.

On
అణగారిన వర్గాలు ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే-

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

 

జగిత్యాల ఏప్రిల్ 11( ప్రజా మంటలు )

జిల్లా పరిషత్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంతసురేష్

ఈ సందర్భంగా జెడ్పీ చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ....

కులం పేరుతో తరతరాలుగా,అన్నిరకాలుగా అణచివేతకుగురెైన బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి,వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు...

అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం పెట్టాలనే ఆలోచన కవితక్క రావడం గొప్ప విషయం...

కవితక్క అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహ ఏర్పాటుకై చేసిన పొరటంపై ఇప్పటి పాలకులు స్పందించకపోవడం చాల బాధాకరం అని అన్నారు...ప్రభుత్వం స్పందించి బీసీల్లోని 112 కులాల హక్కుల కొరకు అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహ ఏర్పాటు చేసేంత వరకు కవితక్క చేస్తున్న ఉద్యమంలో బీసీలమంతా ఏకమై వారి వెంటే నడుస్తామన్నారు...

నాడు కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ సాధించుకున్నం.ఉద్యమనాయకురాలు కవితక్క సారధ్యంలో అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహ ఏర్పాటుకు బీసీల హక్కుల సాధన కై పోరాటం చేస్తున్న కవితక్క కి మద్దతుగా ఐకమత్యంగా పోరాటం చేసి బీసీ హక్కులను సాధిస్తాం అన్నారు.

భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం,పేద, అణగారిన,అంటరాని ప్రజల హక్కుల కోసం పోరాడిన మహాత్మాజ్యోతిరావు పూలే ఆశయాలను ఆచరణ నందు ఉంచాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రఘువరణ్ మరియు జిల్లా పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు...

Tags