సత్యసాయి సేవ సమితి - జగిత్యాల ఆధ్వర్యంలో చలివేంద్రం.

On
సత్యసాయి సేవ సమితి - జగిత్యాల ఆధ్వర్యంలో చలివేంద్రం.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)

 జగిత్యాల ఏప్రిల్ 7( ప్రజా మంటలు )

సాయినాథుని దివ్య అనుగ్రహ ఆశీస్సులతో భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల ఆధ్వర్యంలో

07-04-2024, ఆదివారం నాడు ఉదయం 9.00 గంటలకు స్థానిక కొత్త బస్టాండ్ యందు "చలివేంద్రం(ఉచిత మినరల్ వాటర్ పంపిణీ)" ప్రారంభించుకోవడం జరిగింది.

ఇట్టి చలివేంద్రాన్ని *సత్యసాయి సంస్థ కన్వీనర్ శ్రీ బట్టు రాజేందర్* ప్రారంభించడం జరిగింది.

తదనంతరం సేవాదళ్ సభ్యులచే ప్రయాణీకులకు మరియు RTC స్టాఫ్ కి *చల్లని మినరల్ వాటర్* అందించారు. సత్యసాయి సంస్థ ద్వారా సామాన్య ప్రజల దాహాన్ని తీర్చే ఇంతటి చక్కని సేవా కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని, ఈ కార్యక్రమ నిర్వాహకులైన సత్యసాయి సంస్థ సభ్యులను RTC డిపో మేనేజర్ సునీత గారు మరియు స్టాఫ్ అందరూ అభినందనలు తెలియ చేయడం జరిగింది.

సత్యసాయి సంస్థ కన్వీనర్ బట్టు రాజేందర్ మాట్లాడుతూ...... భక్తులందరి సహకారంతో ఈ రోజు నుండి 2 నెలల పాటు ఈ వేసవి కాలానికి ప్రతిరోజు ఉచితంగా మినరల్ వాటర్ అందించడం జరుగుతుందని, ప్రయాణికులు మరియు ఇతరులు మినరల్ వాటర్ బాటిల్ ఒక్కొక్కటి 20 రూపాయలు పెట్టి బయట కొనుక్కొనే బదులు ఈ ఉచిత సేవను వినియోగించుకొని వారి దాహార్తి ని తీర్చుకోవాలని తెలిపారు.

అలాగే ఈ వేసవిలో వివిధ దీన

జన సేవలు నిర్వహిస్తామని ముఖ్యంగా మండే ఎండలో చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న వారికి పెద్ద గొడుగులు , చిన్న గొడుగులు , చెప్పులు , తల టోపీలు , బట్టర్ మిల్క్ వంటి తదితర వాటి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇట్టి అన్ని సేవలకు సహకరిస్తున్న భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

ఇట్టి సేవలో సత్యసాయి సంస్థ తరపున కన్వీనర్ బట్టు రాజేందర్, కొత్త ప్రతాప్ , రాచకొండ విద్యాధర్, కొత్త వేణుగోపాల్ ,తాటిపర్తి దశరథ రెడ్డి , ఠాకూర్ నారాయణ్ సింగ్ , వంగల లక్ష్మినారాయణ, మామిడాల చంద్రయ్య , బొడ్ల రామ్మోహన్ మరియు మహిళా సభ్యులు మరియు RTC స్టాఫ్ కూడా పాల్గొనడం జరిగింది.

Tags