జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్ట్ లో పాల్గొన్న విద్యార్థులను ప్రశంసించిన ఎస్.కె.ఎన్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపక బృందం.

On

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల ఏప్రిల్ 19 (ప్రజా మంటలు) : 

స్థానిక ఎస్.కె.ఎన్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీలో పాల్గొని వచ్చిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్. అరిగెల అశోక్, చారిత్రిక ఉపన్యాసకులు & జిజ్ఞాస ప్రాజెక్ట్ పర్యవేక్షకులు డా. వి. రాజేశం, జిజ్ఞాస కో ఆర్డినేటర్ డా. డి. ప్రకాష్ మరియు అధ్యాపక బృందం ప్రశంసించారు.

తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ కేవలం ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులకు మాత్రమే నిర్వహించే పోటీ కార్యక్రమం " జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్ట్ ". 

ఇందులో అన్ని కళాశాలల విద్యార్థులు కళాశాల స్థాయిలో పోటీ పడి కొందరు మాత్రమే రాష్ట్రస్థాయి పోటీకి ఎంపిక చేయబడినారు.

అలా ఎస్.కె.ఎన్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి చరిత్ర విభాగంలో అయిదుగురు విద్యార్థుల బృందం 

  1. జే. సందీప్.
  2. ఏ. రఘు.
  3. ఎం. ప్రణయ్.
  4. కే. ఉపేందర్.
  5. జే. ఉదయ్.

విద్యార్థులు " జిజ్ఞాస ప్రాజెక్ట్ " రాష్ట్రస్థాయి పోటీకు " ఏ కంపరేటివ్ స్టడీ ఆఫ్ కెరీర్ ఆస్పిరేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ బి.ఏ, బి.జెడ్.సి ఆఫ్  ఎస్.కె.ఎన్.ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ జగిత్యాల " అనే శీర్షిక తో ఎన్నికై ఏప్రిల్ 4వ తేదీన హైదరాబాద్ లో పాల్గొని వచ్చారు. 

 

 

Tags