రేపే మూడవదశలో 94 సెట్లకు 12 రాష్ట్రాలలో పోలింగ్ 

On
రేపే మూడవదశలో 94 సెట్లకు 12 రాష్ట్రాలలో పోలింగ్ 

        రేపే మూడవదశలో 94 సెట్లకు 12 రాష్ట్రాలలో పోలింగ్ -      గుజరాత్ 26,               కర్ణాటకలో మిగతా సీట్లకు, ఉత్తరప్రదేశ్ లో 10,  ఛత్తీస్ గఢ్ 7,         మహారాష్ట్రలో 11 సెట్లకు పోలింగ్

హైదరాబాద్ మే 06 :

సాధారణ ఎన్నికల్లో భాగంగా మే 7 వ తేదీన జరిగే మూడవ దశ పోలింగ్ లో 12 రాష్ట్రాలలోని, 94 సీట్లకు సీట్లకు పోలింగ్ జరగనుంది. ఇందులో ఉత్తర ప్రదేశ్ లో జరిగే 10 సెట్ల పోలింగ్ భారతీయ జనతా పార్టీకి చాలా ముఖ్యమైనవి. అలాగే గుజరాత్ లోని అన్నీ 26, ఛత్తీస్ గఢ్ లోని మిగతా 7 సీట్లకు, కర్ణాటకలోని మిగతా 14 సీట్లకు,   మహారాష్ట్రలోని 11 సీట్లకు పోలింగ్ జరగనుంది. గత రెండు దశల పోలింగ్ సరళి బిజేపి పార్టీకి అనుకూలంగా లేదనే వార్తల నేపధ్యంలో, 3 వ దశ పోలింగ్ బిజేపికి ఎంతో ప్రతిష్టాత్మకం కానున్నాయి.

ఉత్తర ప్రదేశ్ లో పోలింగ్ జరగనున్న 10 సీట్లలో గత ఎన్నికల్లో(2019) 8 సీట్లు బిజేపి, 2 సీట్లు సమాజ వాది పార్టీ గెలిచింది. కానీ ఈ సారి రాజ్ పుట లు, ఠాకూర్ లు బిజేపి కి వ్యతిరేకంగా వోటువేయనున్నారనే వార్తల నేపథ్యంలో, ఇండియా కూటమి కూడా ఇక్కడి నుండి గట్టి పోటీ ఇస్తుంది. బిజేపి కి మొదటి రెండు దశలలో గట్టి పోటీ ఇచ్చిన బహుజన సమాజ పార్టీ, ఈ దశలో బిజేపికి అనుకూలంగా తన అభ్యర్థుల ప్రచారాన్ని తగ్గించి, పరోక్షంగా సహకరిస్తుందనే వారతేలు వస్తున్నాయి.  మాయవతికి ఉత్తరాధికారి అనుకొంటున్న ఆకాశ ఆనంద్ గత మూడునాలుగు రోజులుగా తన ప్రచార సభలను, ర్యాలీలను రద్దు చేసుకోవడం, 6 వ దశలో ఎన్నికలు జరగనున్న జౌన్ పూర్ లోక సభ నియోజక వర్గం లో గతంలో ప్రకటించిన బహుజన సమాజ పార్టీ అభ్యర్థి దనుంజయ సింగ్ భార్య శ్రీకళా రెడ్డి టిక్కట్టును మార్చి యాదవ్ కు ఇవ్వడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తుంది.

కర్ణాటకలో బిజేపి కూటమిలోని జెడిఎస్ పార్టీ నేత, మాజీ ప్రధాని హెచ్ ది దేవ గౌడ కొడుకు రెవన్న, అతని కొడుకు, హాసన్ లోకసభ నియోజకవర్గం నుండి పోటీ చేసిన ప్రజ్వల రెవన్న పై వచ్చిన లైంగిక కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో  జరుగుతున్న పోలింగ్ బిజేపికి పెద్ద తలనొప్పిగా మారాయి. ప్రజ్వల రెవన్న విదేశాలకు పారిపోవడానికి బిజేపి సహకరించిందని, అన్నీ తెలిసి ప్రధాని మోడి కూడా ఈ కుటుంభానికి సహకరిస్తున్నాడానే ఆరోపణలను ఎదుర్కొంటున్న బిజేపికి వోటర్లు ఎలా సమాధానమిస్తారో చూడాలి. గతశ డిశెంబల జరిగిన శాసన సభ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బిజేపి, 2019 ఎన్నికల్లో మొత్తం 26 లో, 25 సీట్లు గెలుచుకోంది.

గుజరాత్ లోని 26 సీట్లకు ఒకే దశలో జరుగుతున్న పోలింగ్ కూడా బిజేపికి దాదా పుట్టిస్తుంది. గత ఎన్నిక(2019)ల్లో  26 కు 26 సీట్లు గెలుచుకొన్న బిజేపికి ఈ సారి కేంద్ర మంత్రి పురుషోత్తమ రూపాలి రూపంలో స్వపక్షంలోనే విపక్షంలా, ఆయన పొరపాటున రాజ్ పుత్ లపై చేసిన వ్యాకహాయలు గుజరాత్ లోనే కాకుండా రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లలో కూడా ప్రకంపపనాలు సృష్టించాయి. గతంలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేయడంతో, 156 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొన్న బిజేపి, ఈ సారి ఇండియా కూటమిలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కలిసి పోటీ చేయడం, సూరత్ లోకసభ స్థానంలో అడికారులతో కుమ్ముకకై, కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించడం, పార్టీలోని వ్యతిరేకతలతో కలిసి ప్రజలలో కొంత వ్యతిరేకత కూడగట్టుకొందని అనుకొంటున్నారు. గత ఎన్నికల్లో అన్నీ స్థానాలు గెలుచుకొన్న బిజేపి, ఈ సారి కనీసం 4, 5 స్థానాలలో ఒడిపోవచ్చని భావిస్తున్నారు.

మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాల్లో 11 స్థానాలకు 3 వ దశలో మంగళవారం పోలింగ్ జరగనుంది. ఇందులో, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, శారధ్ పవార్ కు దూరమైన మేనల్లుడు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్‌తో పోటీ పడుతున్న బారామతిలో భారీ పోరు సాగుతోంది. 

మూడో దశలో బారామతి, రాయగఢ్, ఉస్మానాబాద్, లాతూర్, షోలాపూర్, మాధా, సాంగ్లీ, సతారా, రత్నగిరి-సింధుదుర్గ్, కొల్హాపూర్, హత్కనంగలేలో పోలింగ్ జరగనుంది. కొల్హాపూర్‌లో కాంగ్రెస్‌కు చెందిన రాజవంశీయులు షాహూ ఛత్రపతి మరియు సతారాలో బిజెపికి చెందిన ఉదయన్‌రాజే భోసలే, రత్నగిరి-సింధుదుర్గ్‌లో కేంద్ర మంత్రి నారాయణ్ రాణే ప్రముఖ పోటీదారులు. వీరందరి భవితవ్యం ఈ దశలో తెలిపోనుంది.

బీహార్ లోని 5 స్థానాలకు కూడా ఈ దశలోనే పోలింగ్ జరుగుతుంది. ఇందులో జెడి యు 3, బిజేపి ఒకటి, ఎల్ జే పి ఒక స్థానంలో పోటీ పడగా, ఆర్జేడి 3, వి ఐ పి , సిపిఐ ఎం ఒక్కో స్థానంలో పోటీ చేస్తున్నాయి.

ఛత్తీస్ ఘఢ్ లో మిగిలిన 7 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. అదివాసిల ప్రభావం ఉన్న ఈ సీట్లలో బిజేపి తన ప్రభావాన్ని నిలుపుకోవడానికి నిరంతరం కృషి చేస్తుంది. మొత్తానికి గత ఎన్నికల్లో అత్యాదిక స్థానాలు గెలుచుకొన్న బిజేపి, ఈ సారి ఈ 94 సీట్లలో ఎన్నిటిని నిలబెట్టుకొంటుందో చూడాలి.

  

 

Tags