ఘనంగా శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణ వేడుకలు.

On
ఘనంగా శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణ వేడుకలు.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల మే 20( ప్రజా మంటలు)

జగిత్యాల పట్టణంలోని బ్రాహ్మణ వీధి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం సాయంత్రం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేణుగోపాలస్వామి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఉదయం 9 గంటల నుండి సామూహిక నవగ్రహ ఆరాధన, హోమము, ధ్వజారోహణము నిర్వహించారు.

సాయంత్రం 8 గంటలకు స్వామివారి కళ్యాణం నిర్వహించారు ప్రత్యేక వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులను ఉంచి కళ్యాణం కొనసాగించారు.

ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణతో పాటు ఆశీర్వచనము కళ్యాణ అక్షితలు అందజేశారు.

కళ్యాణ అనంతరం నంబి వేణుగోపాల ఆచార్య బ్రహ్మోత్సవ వేడుకల ప్రాశస్త్యాన్ని తెలియజేశారు.

Tags