కొండగట్టు అంజన్న జయంతి ఉత్సవాల గోడ ప్రతిని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్.

On
కొండగట్టు అంజన్న జయంతి ఉత్సవాల గోడ ప్రతిని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113).

 

జగిత్యాల మే 21 (ప్రజా మంటలు) : 

తేదీ. 30-05-2024 నుండి తేదీ. 01-06-2024 వరకు కొండగట్టు వేంచేసి యున్న శ్రీ ఆంజనేయ స్వామి వారి జయంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా క్షేత్ర సంప్రదాయ సారముగా హోమ, పూజ, అర్చనాది సేవలతో పాటు ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడునని తెలిపారు.

ఈ సందర్భంగా జయంతోత్సవము ఆహ్వాన ప్రతులను, పోస్టర్ ను కలెక్టర్ సోమవారం రోజున తన ఛాంబర్ లో ఆవిష్కరించారు.

శ్రీ హనుమాన్ జయంతి రోజు వారి కార్యక్రమ వివరాలు:

  • 29-05-2024 ( బుధవారం) సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు యగశాల శుద్ది, పుణ్యాహవచనం, అఖండ దీపస్థాపన. 
  • 30-05-2024 (గురువారం) ఉదయం 6 గంటలకు యగశాల శుద్ది, పుణ్యాహవచనం, అంకురార్పణ, అఖండ దీపస్థాపన, స్వస్తి వాచనము, రక్షాబంధనము, ఋత్విక్ వరణము, అరుణి మధనము, దేవతాహ్వానము, అగ్ని ప్రతిష్ట హవనము, అభిషేకములు, ధ్వజారోహణము, నవగ్రహ స్థాపన, పారాయణాలు నైవేధ్యము, తీర్థ ప్రసాద వినియోగము. సాయంత్రం 5 గంటలకు హోమము, మహా నైవేధ్యము, మంత్ర పుష్పము, తీర్థ ప్రసాద వినియోగము, సాంస్కృతిక భక్తి కార్యక్రమాలు.
  • 31-05-2024 (శుక్రవారం) ఉదయం 9 గంటలకు హోమము, నవగ్రహ ఆరాధన, సుందరకాండ పారాయణము, అభిషేకము, సహస్రనామార్చన, మహానివేదన, మంత్రపుష్పము, తీర్థ ప్రసాద వినియోగము. సాయంత్రం 5 గంటలకు కుంకుమార్చన సహస్రనామార్చన (పుష్పాలతో), పారాయణాలు, హోమము, మహానివేదన, తీర్థ ప్రసాద వినియోగము మరియు సాంస్కృతిక కార్యక్రమాలు.
  • 01-06-2024 (శనివారం) ఉదయం 3 గంటలకు తిరుమంజనము మరియు ద్రావిడ ప్రబంధ పారాయణములు
  • ఉదయం 9 గంటలకు హవనము, శ్రీస్వామి వారికి పంచామృత క్షీరాభిషేకం, సహస్రనాగవల్లి అర్చన
  • ఉదయం 10 గంటలకు తులసి అర్చన హోమము
  • మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు పూర్ణాహుతి, స్నపన తిరుమంజనము, ఊయల సేవ, మంత్ర పుష్పము, మహానివేదన, తీర్థ ప్రసాద వినియోగము, సామూహిక భజన.
  • సాయంత్రం 5 గంటలకు ఆరాధన
  • సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం
  • సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు అమ్మవారి కుంకుమార్చన, ఓడిబియ్యము.
  • సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు సహస్ర దీపాలంకరణ
  • సాయంత్రం 9 గంటలకు గరుడ వాహన సేవ
  • సాయంత్రం 3 గంటల 30 నిమిషాలకు కంకణోద్వాసన, మంత్రపుష్పము, మహదశీర్వాదము, సామూహిక భజన, తీర్థ ప్రసాద వినియోగం. 

భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) దివాకర, కలెక్టరేట్ ఏ. ఓ. హన్మంత రావు, కొండగట్టు ఆలయ ఈ. ఓ. చంద్ర శేఖర్, డిప్యూటీ ఈ . ఓ అంజయ్య పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

National  State News 

ఇదొక మనసును కలచివేసే, ఆలోచింపజేసే విషాదం.

ఇదొక మనసును కలచివేసే, ఆలోచింపజేసే విషాదం. అజిత్ పవర్ విమాన ప్రమాద దృశ్యాలు
Read More...

విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం

విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం ముంబయి, జనవరి 28  (ప్రజా మంటలు): మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (66) ప్రయాణిస్తున్న విమానం బుధవారం ఉదయం పుణే జిల్లా బారామతి సమీపంలో కుప్పకూలి, ఆయనతో పాటు మరో నలుగురు దుర్మరణం చెందారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం ముంబయి నుంచి బారామతికి వెళ్తుండగా ఈ...
Read More...

దక్షిణభారత స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో రెండవ స్థానం సాధించిన ఉపాధ్యాయుని అభినందించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ 

దక్షిణభారత స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో రెండవ స్థానం సాధించిన ఉపాధ్యాయుని అభినందించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్  జగిత్యాల జనవరి 27 ( ప్రజా మంటలు)సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈనెల 23 వరకు నిర్వహించిన దక్షిణ భారత స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో జగిత్యాల జిల్లా రాయికల్ మండల కుమ్మరి పెల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న కడకుంట్ల అభయ్ రాజ్ తయారుచేసిన సూపర్ సైన్స్ కిట్ ఉపాధ్యాయ బోధనోపకరణాల విభాగంలో ప్రదర్శనకు ద్వితీయ బహుమతి...
Read More...
National  International  

భారత్ – యూరోపియన్ యూనియన్ వాణిజ్య ఒప్పందంపై సంతకం

భారత్ – యూరోపియన్ యూనియన్ వాణిజ్య ఒప్పందంపై సంతకం న్యూఢిల్లీ, జనవరి 27 (ప్రజా మంటలు): భారతదేశం – యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) చర్చలు విజయవంతంగా ముగిసి, ఒప్పందంపై అధికారికంగా సంతకం చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ ఒప్పందాన్ని ప్రపంచ వ్యాప్తంగా **“అన్ని ఒప్పందాలకు తల్లి”**గా పిలుస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు. ఇది భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య ఆర్థిక...
Read More...
Local News  State News 

సంచర జాతుల వారికి ఆహారం పంపిణీ

సంచర జాతుల వారికి ఆహారం పంపిణీ సికింద్రాబాద్,  జనవరి 27 ( ప్రజా మంటలు):  77వ గణతంత్ర దినోత్సవాన్ని స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబెడ్కర్‌కు నివాళులు అర్పించారు. నగరంలో రోడ్ల పక్కన జీవనం సాగిస్తున్న సంచార జాతుల కుటుంబాలను గుర్తించి వారికి ఆహారం అందించారు. దేశాభివృద్ధికి విద్యే ప్రధాన పునాది...
Read More...
Local News 

జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం : ఎమ్మెల్యే సంజయ్

జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం : ఎమ్మెల్యే సంజయ్ జగిత్యాల, జనవరి 27 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణ అభివృద్ధి ధ్యేయంగా బీఆర్ఎస్‌లో గెలిచి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోనే అత్యధికంగా జగిత్యాలకు రూ.62.5 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. గత అధికారుల నిర్లక్ష్యంతో మాస్టర్ ప్లాన్ లేక ఇష్టారీతిన నిర్మాణాలు జరిగాయని విమర్శించారు. అభివృద్ధికి అడ్డంకులు...
Read More...
Local News  State News 

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల హైదరాబాద్, జనవరి 27 (ప్రజా మంటలు): తెలంగాణలోని 7 నగరపాలక సంస్థలు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదీ ప్రకటించారు. నేటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ముఖ్య తేదీలు నామినేషన్లు: జనవరి 28 నుంచి 30 వరకు పరిశీలన: జనవరి 31 ఉపసంహరణ గడువు: ఫిబ్రవరి 3...
Read More...
State News 

బీసీ కులగణన అవసరం -  జనగణనపై జాగృతి రౌండ్ టేబుల్

బీసీ కులగణన అవసరం -  జనగణనపై జాగృతి రౌండ్ టేబుల్ హైదరాబాద్, జనవరి 27 (ప్రజా మంటలు):: ఈ నెల 29న కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణన నేపథ్యంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు నవీన్ ఆచారి తెలిపారు. బీసీలకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోందని, దేశవ్యాప్తంగా పకడ్బందీ కులగణన జరగాలని డిమాండ్ చేశారు. ఒకే కులానికి భిన్న పేర్లు, వలస కులాల సమస్యలపై...
Read More...
State News 

గుంపుమేస్త్రికి ప్రధాన గూఢచారి సంతోష్ రావు : జాగృతి నేత కవిత తీవ్ర ఆరోపణలు

గుంపుమేస్త్రికి ప్రధాన గూఢచారి సంతోష్ రావు : జాగృతి నేత కవిత తీవ్ర ఆరోపణలు హైదరాబాద్, జనవరి 27 (ప్రజా మంటలు): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల నుంచి దూరం చేయడానికి ప్రధాన కారణం సంతోష్ రావేనని జాగృతి నేత తీవ్ర ఆరోపణలు చేశారు. గుంపుమేస్త్రికి ప్రధాన గూఢచారిగా వ్యవహరిస్తూ కేసీఆర్ వ్యక్తిగత విషయాల వరకూ సమాచారాన్ని చేరవేసిన వ్యక్తి సంతోష్ రావేనని విమర్శించారు. కేసీఆర్ ఫార్మ్...
Read More...
National  State News 

చెన్నైలో గ్లోబల్ ఉమెన్స్ సమ్మిట్ :సీఎం ఎం.కె. స్టాలిన్ చేతుల మీదుగా ప్రారంభం

చెన్నైలో గ్లోబల్ ఉమెన్స్ సమ్మిట్ :సీఎం ఎం.కె. స్టాలిన్ చేతుల మీదుగా ప్రారంభం చెన్నై, జనవరి 27: తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఉమెన్స్ సమ్మిట్ మంగళవారం, బుధవారం (జనవరి 27, 28) తేదీల్లో చెన్నైలోని నందంబాక్కం ట్రేడ్ సెంటర్ లో జరుగుతోంది. ఈ సదస్సును ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని తమిళనాడు ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వెల్లడించింది....
Read More...
National  Filmi News  International  

ఆస్కార్ అవార్డు లకు 10 సినిమాలు పోటీ

ఆస్కార్ అవార్డు లకు 10 సినిమాలు పోటీ –వర్తమానం సంగమంగా మారిన సినిమా వేడుక ప్రపంచ సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న 98వ అకాడమీ అవార్డ్స్ (Oscars 2026) ఈసారి కేవలం అవార్డుల వేడుకగా మాత్రమే కాకుండా —👉 సమాజం, రాజకీయాలు, చరిత్ర, మానవ విలువలపై చర్చకు వేదికగా మారింది. 🏆 బెస్ట్ పిక్చర్ విభాగం ఎందుకు ప్రత్యేకం? ఈ...
Read More...
Today's Cartoon 

Today's Cartoon

Today's Cartoon
Read More...