గోపులాపూర్ జంట హత్య కేసులో నిందితుల అరెస్ట్.

- జగిత్యాల డిఎస్పి రఘు చందర్ ప్రెస్ మీట్.

On
గోపులాపూర్ జంట హత్య కేసులో నిందితుల అరెస్ట్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

 

జగిత్యాల జిల్లా ప్రతినిధి, మే 20(ప్రజా మంటలు):

మే 16,24 గురువారం అర్ధరాత్రి గోపులాపూర్ గ్రామానికి చెందిన బుర్ర నవీన్, జగిత్యాలకు చెందిన అతని స్నేహితులు జికూరి పవన్, మొగిలిపాల రాజేందర్, బొమ్మల వెంకటేష్, నాచుపల్లి గంగరాజం @ మనోజ్, చింతల శేషు, చొప్పరి అజయ్ అనే ఆరుగురు అదే గ్రామానికి చెందిన దీటి శ్రీనివాస్, అతని బాబాయ్ కొడుకు దీటి మహేష్ లను ఇంటి కొనుగోలు విషయంలో పాత గొడవలు మనసులో పెట్టుకొని ఇనుప పైపులు, కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేయగా శ్రీనివాస్ అక్కడే చనిపోయాడు.

తీవ్రంగా గాయపడిన మహేష్ ను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.

దీనిపై బుగ్గారం పోలీస్ స్టేషన్లో శ్రీనివాస్ అక్క అటికేటి మమత ఫిర్యాదు మేరకు బుగ్గారం యస్ ఐ ఎం శ్రీధర్ రెడ్డి కేసు నమోదు చేయడం జరిగింది.

కేసు దర్యాప్తు లో భాగంగా గోపులాపూర్ గ్రామంలో దీటి తార, ఆమె కుమారుడు శ్రీనివాస్ లు 2018 సంవత్సరంలో తార తన బంధువు నాగుల అంజయ్య, అతని కుమారుడు రాజేష్ వద్ద ఇప్పుడు వాళ్లు ఉంటున్న ఇంటిని కొన్నారు.కానీ ఇదే ఇంటిని 2017 సంవత్సరంలో అంజయ్య తమకు అమ్మాడని తార ఇంటి పక్కనే ఉన్నటువంటి బుర్ర లక్ష్మి, ఆమె కొడుకులు నాగరాజు, నవీన్ లు కోర్టును ఆశ్రయించడం జరిగింది.

2023 లో కోర్టు ఆ సివిల్ కేసును కొట్టివేసింది.అప్పటి నుండి ఆ రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయి. మే 12,2024 రోజు జగిత్యాల లో ఉంటున్న బుర్ర లక్ష్మి, నాగరాజు, వెంకటమ్మ, పూజ, నవీన్ లు ఎల్లమ్మ పట్నాల గురించి గోపులాపూర్ గ్రామంలోని తమ ఇంటికి వచ్చి ఉంటున్నారు.

మే 16,2024 రోజు రాత్రి వారి ఇంటి పక్కన ఉన్న దీటి తార, కొడుకు శ్రీనివాస్, దీటి మహేష్ లు దారిలో మంచం వేసుకొని తమకు అడ్డంగా పెట్టారని గొడవ జరిగింది.

అట్టి గొడవ అనంతరం బుర్ర నవీన్ తమ ఇంటి పక్కన ఉన్న దీటి శ్రీనివాస్, అతనికి సహకరిస్తున్న దేటి మహేష్ లను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకొని అదే రోజు రాత్రి తమ స్నేహితులైన జికూరి పవన్, మొగిలిపాల రాజేందర్, బొమ్మల వెంకటేష్, నాచుపల్లి గంగరాజం @ మనోజ్, చింతల శేషు, చొప్పరి అజయ్ లను జగిత్యాల నుండి పిలిపించుకొని వారికి తమ గొడవ విషయం చెప్పి ఎలాగైనా శ్రీనివాసును, మహేష్ ను చంపాలని ఉద్దేశంతో వారు ఇంటి వద్ద ఉన్నది చూసి పై వారందరూ ఆ ఇంటికి వెళ్లి ఇనుప రాడ్లు కర్రలతో దాడి చేసి విచక్షణారహితంగా కొట్టి చుట్టుపక్కల వారు రాగా అక్కడి నుండి తమ వాహనాల్లో పారిపోయారు.

దీటి శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందగా, మహేష్ వరంగల్ ఎంజీఎం లో చికిత్స పొందుతూ చనిపోయాడు.

సోమవారం బుగ్గారం ఎక్స్ రోడ్ లో వాహనాల తనిఖి చేస్తుండగా పై నిందితులు తమ వాహనాలలో వెళుతుండగా పట్టుకొని వారి వద్ద నుండి హత్యకు ఉపయోగించిన ఇనుప పైపులు, కర్రలు, ఒక కారు,02 మోటార్ సైకిళ్లు,07 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇట్టి గొడవకు కారణమైన బుర్ర లక్ష్మి, నాగరాజు, వెంకటమ్మ, పూజ లపై కూడా చట్టరీత్య చర్యలు తీసుకోబడతాయి అని డీఎస్పీ రఘు చందర్ తెలియజేశారు.

ఈ ప్రెస్ మీట్ ధర్మపురి సర్కిల్ ఆఫీస్ లో నిర్వహించగా ధర్మపురి సీఐ ఏ రాం నరసింహారెడ్డి,బుగ్గారం, ధర్మపురి, వెల్గటూరు, గొల్లపల్లి యస్ ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags