ఘనంగా మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి (ఎంబీబీఎస్) శ్రీ శారదా చంద్రమౌళీశ్వర రుద్రసేవ పరిషత్ 18 వ వార్షికోత్సవ వేడుకలు.

On
ఘనంగా మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి (ఎంబీబీఎస్) శ్రీ శారదా చంద్రమౌళీశ్వర రుద్రసేవ పరిషత్ 18 వ వార్షికోత్సవ వేడుకలు.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113). 

జమ్మూ మే 19 (ప్రజా మంటలు) : 

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఎంబిబిఎస్ శ్రీ శారద చంద్రమౌళీశ్వర రుద్రసేవ పరిషత్ 18వ వార్షికోత్సవ వేడుకలు జమ్ములోని వైష్ణవి దేవి క్షేత్రంలో ఈనెల 17న శ్రీ గణపతి మహాలక్ష్మి సుదర్శన రుద్ర సహిత శత చండీ యాగం తో వార్షికోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి.

కాగా ఆదివారం ఉదయం స్థాపిత దేవత పూజ, చండీ పారాయణములు, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, కుంకుమార్చన, నవగ్రహ, దుర్గా, లక్ష్మీ, సరస్వతి, సుదర్శన ,రుద్ర హోమములు నిర్వహించారు. సాయంత్రం ప్రదోషకాల పూజ, రాజోపచారములు, నామ సంకీర్తన, తీర్థప్రసాద వితరణ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణలోని సంఘ బాధ్యులు, సభ్యులు, వివిధ జిల్లాల నుండి కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags