ఆర్ ఎస్ ఎస్ నిరాసక్తత బిజేపిలో పెంచిన ఆందోళన - ఫలించని మోడి హిందూ హిందూ ధృవీకరణ మంత్రం
ఆర్ ఎస్ ఎస్ నిరాసక్తత బిజేపిలో పెంచిన ఆందోళన
-పదేళ్ళ అభివృద్ధిని చెప్పుకోలేని బిజేపి నాయకత్వం ?
-రెండవ దశలలో తగ్గిన ఓటింగ్
తగ్గిన వోట్ల వల్ల ఎవరికి లాభం ?
-బిజేపి ప్రభావిత ప్రాంతాలలో తక్కువ శాతం పోలింగ్
-నిరాసక్తతగా బిజేపి కార్యకర్తలు
-ఫలించని మోడి హిందూ హిందూ ధృవీకరణ మంత్రం
బిజేపి అధినాయకత్వం తీరుపై ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తల తిరుగుబాటు
రాజస్తాన్, బీహార్, ఉత్తర ప్రదేశ్ లలో గుబులు పెంచిన ప్రజలు
(సిహెచ్ వి ప్రభాకర్ రావు)
18 వ లోకసభకు జరుగుతున్న ఎన్నికల్లో 190 లోక సభ స్థానాలలో పోలింగ్ పూర్తయింది. గతంలో ఎంతో బలంగా ఉండి, అధిక స్థానాలు గెలుచుకొన్న రాజస్తాన్, బీహార్, ఉత్తర ప్రదేశ్ లో జరిగిన రెండు దశల పోలింగ్ లో ఓటింగ్ శాతం గత ఎన్నికల కంటే తక్కువగా నమోదు కావడం, ముఖ్యంగా బిజేపి గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలలో బిజేపి కార్యకర్తలు, ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు అంతగా ఉత్సాహం చూపడం లేదనే వార్తలు బిజేపి అధినాయకత్వాన్ని ఆండాలనకు గురిచేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఎన్నికల్లో, బిజేపి మాతృ సంస్థ అయిన ఆర్ ఎస్ ఎస్ యాంటీ ముట్టనట్లుగా ఉందనే వార్తలు హిందీ రాష్ట్రాలలోని బిజేపి నాయకత్వాన్ని తొలచివేస్తుంది.
రెండు దశల పోలింగ్ తరువాత, మళ్ళీ అధికారంలోకి రావాలనుకొంటున్న బిజేపి డబుల్ ఇంజన్ నాయకత్వానికి, ఆర్ ఎస్ ఎస్ కు మధ్యలో అంతరం పెరగిందనే వార్తల నేపథ్యంలో పూర్తి విశ్లేషణ
తగ్గిన పోలింగ్ శాతం తో బిజేపి అధికారంలోకి రావడం కష్టమేనా ?
ఎన్నికల క్షేత్రంలో ఆర్ ఎస్ ఎస్ కనబడమలేదనే వార్తలు ఎంతవరకు నిజం ?
ఎందుకు ఆర్ ఎస్ ఎస్ ముఖ్య నాయకులు ఎందుకు తెర వెనుకకు వెళ్లారు ?
(సిహెచ్ వి ప్రభాకర్ రావు)
ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నికల బరిలోకి దిగిన డబుల్ ఇంజన్ సర్కార్ రెండు దశల పోలింగ్ పూర్తి కావడంతో, ప్రస్తుత క్షేత్ర స్థాయి నుండి వస్తున్న వార్తలు బిజేపి అధినాయకత్వంలో ఆందోళన పెంచుతుందనే పచారం జరుగుతుంది. ఏమాత్రం బలంలేని, సరియైన నాయకత్వం, ఐక్యత లేని ప్రతిపక్షాన్ని సులువుగా ఓడించి, నెహ్రూ తరువాత మళ్ళీ మూడవసారి నరేంద్ర మోడి ప్రధాని అవుతాడాని అనుకున్న బిజేపి నాయకత్వానికి ఇప్పటి పరిస్థితులు అంతుపట్టడం లేదని, వివిధ కారణాల వల్ల పార్టీ కింది స్థాయి కార్యకర్తలలో అంతగా ఉత్సాహం కనబడక పోవడంతోనే పోలింగ్ శాతం తగ్గిందనే ప్రచారం జరుగుతుంది.
మొదటి దశ పోలింగ్ రోజు మొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోడి, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కేంద్ర కార్యాలయం ఉన్న నాగపూర్ లో రాత్రి పూట బస చేసి, పార్టీ నాయకులను కాదని, ఆర్ ఎస్ ఎస్ నాయకులను కలిసినట్లు, దాని తరువాతనే, రాజస్థాన్ లో మళ్ళీ హిందూ – ముస్లింల అంశాన్ని ప్రస్తావించినట్లు చెప్పుకొంటున్నారు. నిజానికి నాగపూర్ లో ఎం జరిగిందో ఎవరికి తెలియదు. రాజ్ భవన్ లో బస చేసిన ప్రధాని మోడి, కొంత మంది ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలను మాత్రమే కలిసినట్లు, చివరికి స్థానిక అభ్యర్థి, పార్టీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ ;ఆంటీ వారిని కూడా కలవ లేదనే తెలుస్తుంది.
వచ్చే సంవత్సరం వంద సంవత్సరాలు పూర్తి చేసుకొనున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, ఎంతో ఘనంగా టన శతావార్షికోత్సవాలను నిర్వహిస్తునట్లు మోద చెప్పుకొన్నా, ఇటీవలి కాలంలో, సర్ సంఘ చాలక మోహన్ భాగవత్, అలాంటి ఆలోచనలు ఏమి లేవని, శతావార్షికోత్సవాలు జరుపోకవ్వడం లేదని ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పదేళ్ళ బిజేపి పాలనలో ఆర్ ఎస్ ఎస్ మూల సూత్రాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని, కొంత మంది పెట్టుబడిదారుల చేతిలో బిజేపి బందీ అయిందనే భావం ఆర్ ఎస్ ఎస్ అధినాయకత్వంలో నాటుకొనడాని అనుకొంటున్నారు. పార్టీ సిద్దాంతలకు, ఆచరణకు ఆమడ దూరంలో ఉండే కాంగ్రెస్ నాయకులను పార్టీలో చేచుకొని, దశాబ్దాలపాటు తమ జీవితాలను పార్టీకి అంకితం చేసిన కార్యకర్తలనుపట్టించుకోకుండా, నాయకులను మోడి- అమిత్ షా లు తమ స్వంత ఏజండాతో పార్టీని నడుపుతున్నారని ఆర్ ఎస్ ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.
అధికారం ఎవరిదైనా, ఆర్ ఎస్ ఎస్ తన లక్ష్యాన్ని చేరుకోవడానికి, తనడంటూ ప్రత్యేక మార్గం ఎంచుకోంటుందని అందులోని పెద్దలు చెపుతుంటారు. అందుకే 1977 వరకు పరోక్షంగా ఆర్ ఎస్ ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు అందించిందని, కాంగ్రెస్ పార్టీ కి ఎన్నికల్లో సహకరించిందని చెప్పుకొంటారు. ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు, నాయకులు గత పదేళ్ళ అధికారంలో ఎలాంటి లబ్ది పొందకపోవడమే కాకుండా, ఇన్నాళ్ళూ ఎవరైతే తమను ఇబ్బందుల పాలు చేశారో వారినే తెచ్చి, ప్రభుత్వంలో కూచోబెట్టడం కూడా కింది స్థాయి కార్యకర్తలలో నిరుత్సాహం పెనహిందాని, అందుకే ఎసయారీ ఎన్నికల్లో పూర్తిగా ఏమి పట్టనట్లు ఉన్నారని పార్టీలోని ఒక వర్గం చెప్పుకొంటుంది.
తగ్గిన వోట్ల వల్ల ఎవరికి లాభం ?
సాధారణంగా, ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత ఉంటే ఓటింగ్ శాతం పెరుగుతుందని, పెరిగిన వోట్లన్నీ ప్రతిపక్షాలవే అనే ఒక ప్రహకారం ఉండి. కానీ 2004, 2014 లలో కూడా ఓటింగ్ శాతం గతం కంటే తక్కువగానే నమోదైంది. అప్పుడు అధికారంలో ఉన్న బిజేపి (2004), కాంగ్రెస్ -యు పి ఏ (2014) లలో అధికారం కోల్పోయాయి. ప్రభుత్వాన్ని సమర్థించే సాంప్రదాయ వోటర్లు నిర్లిప్తతో ఓటింగ్ కు దూరం కావడం, ప్రతిపక్షాలకు రావలసిన వోట్లు రావడంతో ప్రభుత్వాలు కూలిపోయి, కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.
మళ్ళీ ఈ సారి కూడా తక్కువ ఓటింగ్ నమోదు కావడం కూడా గత అనుభవాలను పునరావృతం చేస్తుందేమో అనే అనుమానం కూడా లేకపోలేదు. మొదటిదశ అనుభవంతో మోడి-షా లు ఎంత గట్టిగా కార్యకర్తలను ప్రోత్సహించినా, బెదిరించినా పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. హిందీ రాష్ట్రాలలో కోల్పోయిన సీట్లను నాల్గవ దశలో జరగబోయే తేఊగు రాష్ట్రాలలో కొంత మేర భారతి చేసుకోవాలని భావిస్తున్న బిజేపి ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి.
More News...
<%- node_title %>
<%- node_title %>
పెన్షనర్లకు ప్రభుత్వ హామీలను నెరవేర్చాలి. -టీ.పీ.సి.ఏ.రాష్ర్ట కార్యదర్శి హరి అశోక్ కుమార్.
జగిత్యాల డిసెంబర్ 19 (ప్రజా మంటలు):
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పెన్షనర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు.శుక్రవారం టీ.పి.సి.ఏ.ఆధ్వర్యంలో జాతీయ పెన్షనర్ల వారోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా అసోసియేషన్ కార్యాలయంలో పెన్షన్ నిబంధనలు-ప్రయోజనాలు అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
అనంతరం 2024... హర్షవర్ధన్ కుటుంబాన్ని పరామర్శించిన రాజేశం గౌడ్
కోరుట్ల డిసెంబర్ 19|(ప్రజా మంటలు):
కోరుట్లకు చెందిన విద్యార్థి హర్షవర్ధన్ క్యాన్సర్తో మృతి చెందడంపై తెలంగాణ తొలి ఆర్థిక సంఘం చైర్మన్ జి. రాజేశం గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, మేడిపల్లి మాజీ జెడ్పీటీసీ అడ్డగట్ల లలితలతో కలిసి... అధికారుల సమన్వయం తో గ్రామపంచాయతీ ఎన్నికలు విజయవంతం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల డిసెంబర్ 19 (ప్రజా మంటలు)మూడు దశల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా, విజయవంతంగా ముగియడం పట్ల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న అన్ని శాఖల అధికారులు, అన్ని స్థాయిల అధికారులను మరియు సిబ్బందిని అభినందించారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన... ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలుపై ప్రజల సంతృప్తి_ గ్రామపంచాయతీ ఎన్నికల తీర్పు నిదర్శనం
జగిత్యాల డిసెంబర్ 19 (ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల కాలంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలుపరుస్తున్న తీరుకు, గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు నిదర్శనమని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో శుక్రవారం మధ్యాహ్నం ఏర్పాటు... భార్యను హత్య చేసిన కేసులో భర్తకు జీవిత ఖైదు, ₹4,000 జరిమానా కీలక తీర్పును వెలువరించిన . జిల్లా సెషన్స్ జడ్జి రత్న పద్మావతి
జగిత్యాల డిసెంబర్ 19 (ప్రజా మంటలు)నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకోలేరు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొల్లం రాజేశ్వరి అనే మహిళ కు స్టంభంపల్లి గ్రామానికి చెందిన బొల్లం జగదీష్ను 2016 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, బొల్లం... కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు తాత్కాలికంగా రద్దు
న్యూఢిల్లీ డిసెంబర్ 19| (ప్రజా మంటలు):
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ ఏడాది అవార్డుల ప్రకటనకు ముందే అవార్డు జాబితా ఒక ఆంగ్ల పత్రికకు లీక్ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
గురువారం(18 డిసెంబర్ ),మధ్యాహ్నం జరగాల్సిన సాహిత్య అకాడమీ మీడియా సమావేశాన్ని... ఆర్యుపిపి జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా వేల్పుల స్వామి యాదవ్, ప్రధాన కార్యదర్శిగా ఎనగందుల రాజేంద్రప్రసాద్
జగిత్యాల డిసెంబర్ 19 (|ప్రజా మంటలు):
రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ రాష్ట్రం (ఆర్యుపిపిటీఎస్) ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు శానమోని నర్సిములు, రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి సత్తిరాజు శశికుమార్ యాదవ్ తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా గౌరవ అధ్యక్షుడిగా అల్లకట్టు సత్యనారాయణను... అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన వేతనం నిరాకరణపై టీజీహెచ్ఆర్సీ సీరియస్
హైదరాబాద్ డిసెంబర్ 19 (ప్రజా మంటలు):
రాష్ట్రవ్యాప్తంగా మండల విద్యా కార్యాలయాల్లో (MEO కార్యాలయాలు) మెసెంజర్లు (ఆఫీస్ సబార్డినేట్లు)గా అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు సమాన వేతనం నిరాకరించడంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
డా. జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన జరిగిన విచారణలో, 20 సంవత్సరాలకు పైగా... మణుగూరు–భద్రాచలం జనం బాటలో గిరిజనుల పక్షాన కల్వకుంట్ల కవిత పోరాటం
భద్రాద్రి కొత్తగూడెం డిసెంబర్ 19 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చేపట్టిన జనం బాట కార్యక్రమంలో గిరిజనులు, ఆదివాసీలు, సింగరేణి కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు.
మణుగూరు ఓసీ–2 గనిని సందర్శించిన కవిత, కార్మికులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం క్యాంటీన్లో కార్మికులతో కలిసి... ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు కొనసాగించాలి
హైదరాబాద్, డిసెంబర్ 18 (ప్రజా మంటలు):
ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలని, లేదంటే ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ మంత్రి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి హెచ్చరించారు.
మహాత్మా గాంధీ పేరును ఉపాధి హామీ పథకం నుంచి... 