క్యూఆర్ కోడ్ & సిటీజన్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు రెండవ స్థానం, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు ఆరవ స్థానం.
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల మే 21(ప్రజా మంటలు)
మొదటి పది స్థానాలో జిల్లా కు రెండు స్థానాలు*
*రాష్ట్ర డిజిపి శ్రీ జితేందర్ చేతులమీదుగా ప్రశంసా పత్రాలను అందుకున్న పోలీసు అధికారులు.*
ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పి అశోక్ కుమార్
ప్రజలకు, బాధితులకు మెరుగైన సేవలను అందించేందుకు పోలీస్ శాఖ గురించి, స్టేషన్లలోని సిబ్బంది గురించి ప్రజలేమనుకుంటున్నారు? పోలీస్ స్టేషన్లలో ప్రజలకు సరైన ఆదరణ, సేవలు లభిస్తున్నాయా, ఫిర్యాదుదారులతో సిబ్బంది ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు? అనే విషయాలు తెలుసుకోవడం కోసం ఓ క్యూఆర్ కోడ్‌ను రూపొందించారు.
క్యూఆర్ కోడ్ & సి ఎఫ్ సి ద్వారా పోలీసు సేవలపై ప్రజల నుండి వచ్చిన మొత్తం అభిప్రాయాల ఆధారంగా రాష్ట్ర స్థాయిలో 10 పోలీస్ స్టేషన్ లు ఎంపిక కాగా జగిత్యాల జిల్లా నుoడి ఉత్తమ ప్రతిభ కనబరిచిన మేడిపల్లి ఎస్.ఐ శ్యామ్ రాజ్(రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానం),ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ (రాష్ట్ర స్థాయిలో ఆరవ స్థానం ) వచ్చి ఉత్తమ పోలీస్ స్టేషన్లుగా ఎంపిక కావడం జరిగింది. హైదరాబాదులోని డీజీపీ కార్యాలయం నందు పోలీస్ అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేయడం జరిగింది.
జిల్లా పోలీసు శాఖకు చెందిన ఇద్ధరు పోలీసు అధికారులు తమ కృషి, నిష్ట, మరియు సమర్ధతతో రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చి ప్రశంసా పత్రాలు అందుకున్న అధికారులను జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను అని అన్నారు."
More News...
<%- node_title %>
<%- node_title %>
టెక్నాలజీ రంగంలో రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం

క్యూఆర్ కోడ్ & సిటీజన్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు రెండవ స్థానం, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు ఆరవ స్థానం.

మావోయిస్టు ఉద్యమంలో ఒక కీలక అధ్యాయం - నంబాల

మేడిపల్లి మండల కేంద్రంలో 2025 26 సం" నుండి నూతనంగా ఇంటర్ జూనియర్ కళాశాల ప్రారంభం

క్రికెట్ సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా చూడాలి.

కాంగ్రెస్ పార్టీలో ఇన్నిసార్లు ఓడిపోయిన వ్యక్తి ఒక్క జీవన్ రెడ్డి మాత్రమే ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

కాళేశ్వరం కమిషన్ నోటీసులు కాదు, కాంగ్రెస్ రాజకీయ కమీషన్ నోటీసులు - దావ వసంత సురేష్, జగిత్యాల జిల్లా తొలి ప్రజా పరిషత్ ఛైర్పర్సన్.

జగిత్యాలలో వయోవృద్ధులకు డే కేర్ కేంద్రం మంజూరు .

సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో తూనికలు,కొలతల దినోత్సవం.

ధనికుల దానం - సామాన్యులపై పెను భారం? ఫ్రీజర్ బాక్స్‌లపై ₹1000 వసూలు – ప్రజల్లో ఆగ్రహావేశాలు

ధర్మపురిలో హనుమాన్ జయంతికి ఏర్పాట్లు ముమ్మరం
