ధనికుల దానం - సామాన్యులపై పెను భారం? ఫ్రీజర్ బాక్స్‌లపై ₹1000 వసూలు – ప్రజల్లో ఆగ్రహావేశాలు
“ఒక్క రోజు ఫ్రీజర్
అవసరమైంది... కానీ దానికోసం వారం రోజుల ఖర్చు పోయింది!”
సేవా భావన మాటలా? ఫ్రీజర్ బాక్స్‌లపై రూ.1000 వసూలు - ప్రజల ఆవేదన
భీమదేవరపల్లి, మే 20 (ప్రజామంటలు):
ఒక సీనియర్ రిపోర్టర్, మండలంలోని ముత్తారం గ్రామానికి చెందిన ఓ పేద, మధ్య తరగతి కుటుంబ పెద్ద మృతితో ఆ కుటుంబంలో తలకిందులైన దినాలు. మధ్యతరగతి జీవితంలో ఓ రోజు కూడా దినసరి ప్రణాళిక కదిలిపోతే కుటుంబం గడవడం కష్టమే. అలాంటిది, ఒక్క రోజు కోసం తీసుకున్న ఫ్రీజర్ బాక్స్‌కు రూ.1000 వసూలు చేయడం ఆ కుటుంబాలను ఆర్థికంగా బలహీనపరిచింది. “మనసుతో ఇచ్చిన దానం కదా అది... మరి ఇప్పుడు ఇలా వసూలు చేయడం ఎందుకు?” అని ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
ఈ ఘటన ముల్కనూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఇదొక్కటే కాదు మండలంలో ఎన్నో కుటుంబాలు అనుభవిస్తున్న తీరు ఇది. ముందుగా ముల్కనూరులో జెడ్పిహెచ్ఎస్ 1988-89 బ్యాచ్, ఎదులాపురం సోదరులు, సుద్దాల కుటుంబీకులు వారితో పాటు ఇంకొందరు వంటి అనేక దాతలు గ్రామ అభివృద్ధి కోసం ఫ్రీజర్ బాక్స్‌లను అందించారు. కానీ ఇప్పుడు ఆ ఫ్రీజర్‌లు దాతల ఆశయాలకు విరుద్ధంగా వాణిజ్య ధోరణితో ఉపయోగపడుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
“మరణం అన్నదే సమానమయితే, సేవల విషయంలో మాత్రం ధనికులకు వేరే, పేదలకు వేరేలా ఎందుకు?” అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పేదలకు కనీస ఖర్చులు మోయడానికే కష్టపడాల్సిన పరిస్థితుల్లో, ఫ్రీజర్ బాక్స్ కోసం భారీగా వసూలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది.
“ఇది సేవా ధోరణిగా ఉండాలి. దాతలు కోరినదే అదే. లేకపోతే వాళ్ల దాతృత్వాన్ని అవమానపరచినట్టే,” అంటూ గ్రామ పెద్దలు, యువత ఒకే స్వరంతో కోరుతున్నారు.
కరాకండిగా వెయ్యి రూపాయలు ఇవ్వాల్సిందే – మెయింటెనెన్స్ ఫీజులతో మెంటల్ ఎక్కుతున్న మధ్యతరగతి కుటుంబీకులు
ప్రస్తుతం ఫ్రీజర్ బాక్స్‌ను ఉపయోగించాలంటే ముందే రూ.1000 ను నగదు రూపంలో చెల్లించాలి. “ఇది మెయింటెనెన్స్ పేరుతో చేస్తున్న వసూలే కానీ, అసలు సేవా లక్ష్యానికి ఇది అన్యాయం,” అని బాధిత కుటుంబాలు పేర్కొంటున్నాయి.
“ఈ ఖర్చుతో పాటు మిగిలిన అంత్యక్రియల ఖర్చులు కలిపితే, పేదవాడికి ఇది పెను భారంగా మారుతోంది,” అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఫ్రీజర్ బాక్స్ కు వెయ్యి రూపాయలు, ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఖర్చులు అదనం. దూరపు గ్రామాలైతే ఇంకా ఎక్కువ ఫీజు. ఈ పరిస్థితిని పున:సమీక్షించి, వాస్తవ ఖర్చు మేరకే వసూలు చేయాలన్నది ప్రజల ఆకాంక్ష.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి. -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి

దశాబ్దం తర్వాత నెరవేరుతున్న పేదల సొంతింటి కల

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి..

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు

గల్ఫ్ అడ్వైజరి బొర్డ్ కు చాంద్ పాషా విజ్ఞప్తి
