కలెక్టర్లు మానవీయకోణంలో భూసమస్యలు పరిష్కరించాలి.. క్షేత్రస్థాయిలో పర్యటన చేయండి ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలి
.
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
జగిత్యాల మే 16 (ప్రజా మంటలు)
జగిత్యాల లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో రెవెన్యూ సదస్సులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పై మంత్రి సమీక్ష నిర్వహించారు.
భూ సమస్యల పరిష్కారం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పై కలెక్టర్లకు పలు ఆదేశాలు జారీ చేసారు.
హాజరైన ప్రభుత్వ విప్ లు అడ్లూరి లక్ష్మణకుమార్, ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్
కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు భూ సమస్యలను పరిష్కరించాలనీ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల్లో ప్రజల నుంచి వచ్చిన భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
శుక్రవారం రాత్రి జగిత్యాల కలెక్టరేట్లో పైలెట్ మండలాల్లో భూ భారతి చట్టం రెవెన్యూ సదస్సుల నిర్వహణ తీరు తెన్నులు.. భూ సమస్యల పరిష్కారం.. ఆయా జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పై మంత్రి శ్రీనివాస్ రెడ్డి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో
ప్రభుత్వ విప్ లు అడ్లూరి లక్ష్మణకుమార్, ఆది శ్రీనివాస్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి ఆయా జిల్లాల్లో పైలెట్ మండలాల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్లు మానవీయ కోణంలో భూ సమస్యలు పరిష్కరించాలని ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో భూ సమస్యల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
. ఉమ్మడిజిల్లా కలెక్టర్లు సమన్వయంతో కలిసి పనిచేస్తూ భూ సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. ప్రజలు రైతులు ఇబ్బందులు పడకుండా ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజల శ్రేయస్ కోసం నిరంతరం పాటుపడాలని సూచించారు. పెండింగ్లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో మంత్రి కలెక్టర్లకు సూచనలు సలహాలు అందజేశారు.నిర్లక్ష్యంగా వ్యవహరించే రెవెన్యూ అధికారులపై కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్లకు సూచించారు. అధికారులు బాధ్యతాయుతంగా విధంగా పనిచేసేలా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని పేర్కొన్నారు. ప్రజలు రైతుల సంక్షేమం కోసమే అధికారులు పనిచేయాలని సూచించారు. అలాగే కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు త్వరగా చేపట్టాలని పేర్కొన్నారు.ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ, పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లతా, పలు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి. -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి

దశాబ్దం తర్వాత నెరవేరుతున్న పేదల సొంతింటి కల

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి..

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు

గల్ఫ్ అడ్వైజరి బొర్డ్ కు చాంద్ పాషా విజ్ఞప్తి
