వేసవి సెలవుల దృష్ట్యా సహ పాఠ్యప్రణాళికలపై చిన్నారుల దృష్టి
జగిత్యాల మే 18 (ప్రజా మంటలు)
విద్యార్థులకు వేసవి సెలవులు రావడంతో పుస్తకాలకు స్వస్తి చెప్పి ఆటలకు శ్రీకారం చుడుతారు అయితే వేసవి సెలవుల దృష్ట్యా చాలావరకు తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువుకు సంబంధించిన విషయమే కాకుండా సహ పాఠ్యప్రణాళికలుగా స్విమ్మింగ్ లేదా డాన్సింగ్ కరాటే ,కంప్యూటర్ క్లాస్సెస్ తదితర విషయాలపై విద్యార్థులకు జ్ఞానం సమపార్జనకై తల్లిదండ్రులు మొగ్గుచూపుతున్నారు.
దీనిలో భాగంగా అమ్మాయిలు. అబ్బాయిలు అనే తేడా లేకుండా తమ పిల్లలకు ఆత్మస్థైర్యం రావడానికి పలువురు తల్లిదండ్రులు కరాటే తరగతులకు పంపుతున్నారు. దీంతో తమ పిల్లల్లో క్రమశిక్షణ పెరగడమే కాకుండా ఎండ వేడికి ఆరుబయట తిరగకుండా ఒక నిర్దిష్టమైన పనిలో ఉన్నట్లయితే ఆరోగ్య దృష్ట్యా కూడా ఉపయోగం ఉంటుందని భావనతో తమ చిన్నారులను కరాటే స్విమ్మింగ్ డాన్సింగ్ కంప్యూటర్ క్లాసెస్ పేరిట వారిలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపగలుగుతున్నారు.
సెలవులు తక్కువ సమయం ఉన్నప్పటికీ ఉన్న సమయాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసి తమ తమ పిల్లలను ఆయా శిక్షణ కేంద్రాలకు తీసుకువెళ్లి తిరిగి ఇంటికి తీసుకొస్తున్నారు. నిత్యం పుస్తకాలతో కుస్తీ పడుతూ హోంవర్క్ లతో శారీరకంగా అలిసిపోయిన చిన్నారులకు ఈ కొత్త రంగాలు వారిలో ఒక నూతన ఉత్తేజం కలుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అంతేకాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలు పిల్లల్లో పెంచడానికి పురాణ, ఇతిహాస, కథలు ,పద్యాలు శ్లోకాలు, సంస్కృతిక రంగాల వైపు పిల్లలను దృష్టి మరల్చడానికి ఆయా సంస్థలు నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రాలకు తల్లిదండ్రులు తమ పిల్లలను పంపడానికి సుముకత చూపుతున్నారు. దీంతో నానాటికి అంతరించిపోతున్న మన సంస్కృతీ సాంప్రదాయాలు తిరిగి పునర్వైభవం రావడానికి ఎంతగానో దోహదపడతాయని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
టెక్నాలజీ రంగంలో రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం

క్యూఆర్ కోడ్ & సిటీజన్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు రెండవ స్థానం, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు ఆరవ స్థానం.

మావోయిస్టు ఉద్యమంలో ఒక కీలక అధ్యాయం - నంబాల

మేడిపల్లి మండల కేంద్రంలో 2025 26 సం" నుండి నూతనంగా ఇంటర్ జూనియర్ కళాశాల ప్రారంభం

క్రికెట్ సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా చూడాలి.

కాంగ్రెస్ పార్టీలో ఇన్నిసార్లు ఓడిపోయిన వ్యక్తి ఒక్క జీవన్ రెడ్డి మాత్రమే ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

కాళేశ్వరం కమిషన్ నోటీసులు కాదు, కాంగ్రెస్ రాజకీయ కమీషన్ నోటీసులు - దావ వసంత సురేష్, జగిత్యాల జిల్లా తొలి ప్రజా పరిషత్ ఛైర్పర్సన్.

జగిత్యాలలో వయోవృద్ధులకు డే కేర్ కేంద్రం మంజూరు .

సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో తూనికలు,కొలతల దినోత్సవం.

ధనికుల దానం - సామాన్యులపై పెను భారం? ఫ్రీజర్ బాక్స్‌లపై ₹1000 వసూలు – ప్రజల్లో ఆగ్రహావేశాలు

ధర్మపురిలో హనుమాన్ జయంతికి ఏర్పాట్లు ముమ్మరం
