బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభకు జగిత్యాల నియోజకవర్గం సర్వం సిద్ధం
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల ఏప్రిల్ 25(ప్రజా మంటలు)
జిల్లా
బి ఆర్ యస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరియు మాజీ జడ్పీ ఛైర్పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
జమ్ము కాశ్మీర్ ఉగ్ర దాడుల్లో మరణించిన వారికి రెండు నిముషాలు మౌనం పాటించి నివాళులు అర్పించడం జరిగినది.
కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ
ఈ నెల 27 నాడు చలో వరంగల్ బి ఆర్ యస్ రజతోత్సవ సభ విజయవంతం కోసం జగిత్యాల జిల్లాలో అన్ని
నియోజకవర్గల్లో ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామని.. ప్రజలు, బి ఆర్ యస్ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారని జగిత్యాల జిల్లా నుండి 20,000 (ఇరువై వేలు) మంది తరలి వెళ్తున్నామని..బస్సులు, కార్లు వాహనాలు సరిపోవడం లేదు..సర్దుబాటు చేసుకుంటున్నామని... కేసీఆర్ గారిని చూడటానికి ప్రజలు ఉత్సాహo కనబరుస్తున్నారని.. 15 నెలల దుర్మార్గపు పాలన.. ప్రపంచంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు.. ఏ శాఖ మంత్రి కూడా దానికి న్యాయం చేయడం లేదని, పోలీస్ వారు నిమిత్త మాతృలేనని, ప్రజలు, రైతులు ఈ ప్రభుత్వం ఫై విసిగి పోయారని ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తున్నారని, 27 నాడు బి ఆర్ యస్ జెండా ఆవిష్కరించి తరలి వెళ్లాలని దిశ నిర్దేశం చేశారు..
దావ వసంత సురేష్ మాట్లాడుతూ...
25 వసంతాలు పూర్తి చేసుకొని 27 నాడు బి ఆర్ యస్ రజతోత్సవ సభ కోసం ప్రజలందరూ ఇంటి పార్టీ గా భావించి గులాబీ జెండా గుండెల్లో నింపుకున్నారని ప్రజలంతా
బి ఆర్ యస్ రజతోత్సవ సభ కు రావడానికి మరియు బీడీ కార్మికులు స్వచ్చందగా దారి ఖర్చుల కోసం విరాళం ఇవ్వడం చూస్తూ ఉంటే కేసీఆర్ పై ఎంతో అభిమానం చూపిస్తున్నారని, గ్రామ స్థాయి నుండి పట్టణం, మండలం, జగిత్యాల నియోజకవర్గంలో కుల సంఘాలను, వాకార్స్ అసోసియేషన్ కలిశామని,జగిత్యాల అభివృద్ధి ప్రదాత కల్వకుంట్ల కవితక్క మొన్న జగిత్యాల విచ్చేసి నియోజకవర్గం ప్రజలకు నాయకులకు దిశా నిర్దేశం చేశారు.వారి ఆదేశానుసారం
జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు ఆధ్వర్యంలో
ఎమ్మెల్సీ యల్ రమణ ,మాజీ మంత్రి రాజేశం గౌడ్ ,
బి ఆర్ యస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు శ్రేణులతో సమన్వయo చేసుకుంటూ సభ విజయవంతం కోసం జగిత్యాల నియోజకవర్గం నుండి 5000మంది తరలి వెళ్తున్నామని పేర్కొన్నారు..
అనంతరం పట్టణ మరియు మండల అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులతో సమావేశమై రజోత్సవ సభ గురించి సమీక్షించి ప్రతి ఒక్కరూ సమన్వయంతో కలిసి సభను విజయవంతం చేయాలని బస్సులో బయలుదేరుటకు అన్ని సర్వం సిద్ధం చేసుకుని ఉండాలని అన్నారు. బస్సు ఎక్కే కార్యకర్తలు తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకునే దాకా బస్ కోఆర్డినేటర్లు సమన్వయం చేసుకొని సభను విజయవంతం చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్ జగిత్యాల రూరల్ సారంగాపూర్ రాయికల్ మండల అధ్యక్షులు ఆనంద్ రావు తెలు రాజు బర్కాం మల్లేష్ రాయికల్ కో ఆర్డినేటర్ శ్రీధర్ పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి మాజీ జడ్పీటీసీ మహేష్ మాజీ ఎంపీపీ సాయి రెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు ఉప అధ్యక్షులు వొళ్ళేం మల్లేశం నాయకులు దామోదర్ రావు సమిండ్ల శ్రీను శీలం ప్రవీణ్ వెంకటేశ్వర్ రావు రాజేష్ సందయ్య హరీష్ ప్రతాప్ సన్నిత్ రావు మధు జగిత్యాల కోరుట్ల నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీసాయి సప్తాహం ముగింపువేడుకలు

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి

నేడు అధికారభాష హిందీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు

కిమ్స్-సన్షైన్ హాస్పిటల్స్, బేగంపేటలో కేవలం 3 నెలల్లో 50 రోబోటిక్ సర్జరీలు

ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి

ఆరోగ్యవంతులైన బాలికలే దేశ భవిత

మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్

కొండగట్టు 30.వ.గిరిప్రదక్షిణ ఆదివారం మద్యం, మాంసం మానేద్దాం'

కేజీవీలతో ట్రాక్టర్లు తారు రోడ్డుపై తిరిగితే కేసులు నమోదు - ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

షిరిడి సాయి మందిరంలో ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు

జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘ్ అధ్యక్షునిగా చీటీ శ్రీనివాస్ రావు
