భూభారతి చట్టం.. రైతుల చుట్టం.. 18 రాష్ట్రాల్లో భూభారతి పై అధ్యయనం చేశాం

On
భూభారతి చట్టం.. రైతుల చుట్టం.. 18 రాష్ట్రాల్లో భూభారతి పై అధ్యయనం చేశాం

..
బుగ్గారం మే 17 (ప్రజా మంటలు)

ప్రజలు మేధావులతో చర్చించాకే 
చట్టంగా రూపొందించాం..

బుగ్గారం రెవెన్యూ సదస్సులో రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 

బుగ్గారంలో భూభారతి పైలెట్ ప్రాజెక్టు కింద రెవెన్యూ సదస్సు ప్రారంభం

ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ హాజరు..

రైతులకు భూహక్కు పత్రాలు పంపిణీ చేసిన మంత్రి, విప్, కలెక్టర్

భూభారతి చట్టం రైతుల చుట్టమని, రైతులు, ప్రజల భూ సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని, పేదలకు న్యాయం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలతో లక్షలాదిమంది ప్రజలు, మేధావుల అభిప్రాయాలు సేకరించి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు.

శనివారం జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో భూభారతి పైలెట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సును మంత్రి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రితోపాటు ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ భూభారతి చట్టం దేశంలోని రోల్ మోడల్ గా నిలుస్తుందని, 18 రాష్ట్రాలలో భూ చట్టాలపై అధ్యయనం చేశామని, అక్కడ భూ సమస్యలకు సంబంధించి ఏమేం చర్యలు చేపట్టారు తెలుసుకున్నామన్నారు. లక్షలాది మంది ప్రజలు, మేధావుల అభిప్రాయాలు ఆకాంక్షల మేరకు భూభారతి చట్టాన్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. పేదవారికి న్యాయం జరగాలని, భూమి ఉన్న ఆసాములకు ఇబ్బందులు కలగవద్దని ఉద్దేశంతోనే అద్భుతమైన చట్టాన్ని తెచ్చామని తెలిపారు.

రాష్ట్రంలో మళ్లీ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, అందులో భాగంగానే జూన్ రెండు నుంచి రాష్ట్రంలోని పదివేల పైగా రెవెన్యూ గ్రామాలకు రెవెన్యూ అధికారులకు కేటాయిస్తామని చెప్పారు. గతంలో కేసీఆర్ నాలుగు గోడల మధ్య నలుగురు వ్యక్తులు కలిసి ధరణి అనే చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలను తిప్పలు పెట్టారని పేర్కొన్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టిన రెవెన్యూ గ్రామ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

వివిధ భూ సమస్యలకు సంబంధించి 13వేల దరఖాస్తులు వచ్చాయని, వీటిని సత్వరమే పరిష్కరించేందుకు దృష్టి పెట్టామని పేర్కొన్నారు. ప్రతి భూ సమస్యకు పరిష్కారం లభించే విధంగా భూభారతి చట్టాన్ని రూపొందించామని, తాసిల్దార్ స్థాయి నుంచి సిసిఎల్ఏ వరకు అధికారాలను వికేంద్రీకరించి రైతులకు మేలు జరిగేలా చూస్తున్నామన్నారు. భూ సమస్యలకు సంబంధించి ఆపిల్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.

ఈ నెల ఆఖరి వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ  నిర్మాణం చేపట్టేందుకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి పూర్తి చేస్తామని, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు అందించి తీరుతామని ఈ కార్యక్రమము ఐదేళ్ల వరకు కొనసాగుతుందని, ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేరుస్తామన్నారు. ఈ నెలాఖరు వరకు ప్రతి నియోజకవర్గానికి 3500 రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. రాబోయే నాలుగు సంవత్సరాల కాలంలో 20 లక్షల ఇండ్లు కట్టించి ఇస్తామని, పేదల సొంతింటి కల నెరవేరుస్తామన్నారు. 

ధరణిలో ఉన్న లోపాల వల్ల భూ సమస్యలు పరిష్కారం కాలేకపోయాయని, గత ప్రభుత్వ హాయంలో ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు పది లక్షల భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులు కంప్యూటర్లోనే ఉంచింది తప్పా పరిష్కారం చూపలేకపోయిందన్నారు.  భూభారతి చట్టంలో ట్రిబ్యూనల్స్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని, భూమికి సరిహద్దులు ఏర్పాటు చేసుకోవడంతో పాటు భూ పంచాయతీలు రాకుండా చట్టంలో పలు అంశాలను పొందుపరీచామని పేర్కొన్నారు. స్వచ్ఛందంగా భూమిని సర్వే చేసుకునే రైతులకు సంబంధించి 

భవిష్యత్తులో భూ సమస్యలు రాకుండా కూడా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. జూన్ 2 నుంచి తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని ఇందులో భాగంగా 10956 రెవెన్యూ గ్రామాలకు రెవెన్యూ అధికారులను కేటాయిస్తామని తెలిపారు. డిసెంబర్ 31 కి భూమి అమ్మకాలు..కొనుగోలు సంబంధించి పక్కాగా లెక్కలు తీసేలా భూభారతి చట్టంలో రూపొందించామని తెలిపారు. భూభారతి చట్టం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని, ప్రజలు మెప్పు పొందే చట్టమని, అద్భుతమైన భూభారతి పథకాన్ని రైతులంతా చక్కగా వినియోగించుకోవాలని తెలిపారు. రెవెన్యూ అధికారులు రైతులను ఇబ్బందులు పెట్టకుండా భూ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ధర్మపురి లో ఆర్డీవో కార్యాలయం, సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం ప్రకటించే జాబితాలో ధర్మపురి పేరే మొదటగా ఉంటుందని తెలిపారు. ఇందిరమ్మ పాలన అంటేనే పేదల కష్టాలు తీరుస్తుందన్నారు. అదేవిధంగా ఎండపల్లి బీర్పూర్ మండలాలకు సొంత కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రెవెన్యూ అధికారులు రైతులను ప్రేమగా బాధ్యతాయుతంగా అక్కున చేర్చుకొని సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. 

భూ సమస్యలు పరిష్కరించేందుకే భూభారతి చట్టం..
రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ప్రభుత్వ విప్ 
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ 

రైతులు ఇబ్బందులు పడకుండా వారి భూ సమస్యలు పరిష్కరించేందుకే ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పకడ్బందీగా భూభారతి చట్టాన్ని అమలు చేస్తున్నారని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణకుమార్ పేర్కొన్నారు. గత బిఆర్ఎస్ పాలకులు తెచ్చిన ధరణి వల్ల రైతుల అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. . గత బిఆర్ఎస్ పాలకులు  నాడు అధికారంలో ఉండగా బిఆర్ఎస్ పాలకులు ధర్మపురి అభివృద్ధి చేస్తామని వాగ్దానం చేసి పట్టించుకోలేదని పేర్కొన్నారు. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజల అండదండలతోనే ఎమ్మెల్యేగా విజయం సాధించానని తెలిపారు. నియోజకవర్గాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం పాటుపడుతున్నారని పేర్కొన్నారు.


జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్.. మాట్లాడుతూ 

గతంలో ఎన్నడూ చూడని విధంగా కనివిని ఎరుగని రీతిలో పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా పని చేస్తున్నదని, ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు అహర్నిశలు కష్టపడుతున్నారని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొన్నారు. 1975 సంవత్సరంలో నాడు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ఇందిరమ్మ ఇండ్లు నేటికీ గ్రామాల్లో చెక్కుచెదరకుండా ఉన్నాయన్నారు .


జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ 

రైతులు ప్రజలకు సంబంధించిన భూ సమస్యలు పరిష్కరించడమే ప్రధాన ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. బుగ్గారం గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకున్నామని, భూ సమస్యలకు సంబంధించి 844 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇందులో అత్యధికంగా సాదాబైనామాకు సంబంధించిన దరఖాస్తులు ఎక్కువగా ఉన్నాయనీ, భూ సమస్యలను అన్నింటిని సత్వరమే పరిష్కరిస్తామన్నారు.

గ్రామాల వారిగా రెవెన్యూ రికార్డులు భూ రికార్డులు భద్రంగా ఉండేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులకు భూభారతి చట్టం ఎంతో మేలు చేస్తుందని సమస్యల పరిష్కారానికి చక్కగా వినియోగించుకోవాలని సూచించారు. 
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ పలువురు రైతులకు భూమి హక్కు పత్రాలను అందించారు. అంతకుముందు మంత్రి శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి శేష వస్త్రం, గజమాలతో ఘనంగా సన్మానించారు

Tags
Join WhatsApp

More News...

Local News 

ఆరవ రోజు కొనసాగుతున్న విష్ణు పురాణం

ఆరవ రోజు కొనసాగుతున్న విష్ణు పురాణం జగిత్యాల మే 23(ప్రజా మంటలు)  జిల్లా కేoద్రం కృష్ణా నగర్ లోని ఉమా శంకర్ గార్డెన్స్ లో, ప్రముఖ పౌరాణిక, వేద, పండితులు, మంచిర్యాల వాస్తవ్యులు, బహ్మ శ్రీ బుర్రా భాస్కర శర్మ చే, ఎంతో వైభవంగా ,జరుగుతున్న విష్ణు పురాణం శనివారం 6వ రోజు కు చేరింది. సామూహిక శ్రీ విష్ణు     స హస్ర...
Read More...
Local News 

క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి జ్ఞాపికలు, అందజేసిన అదనపు కలెక్టర్ బి రాజా గౌడ్

క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి జ్ఞాపికలు, అందజేసిన అదనపు కలెక్టర్ బి రాజా గౌడ్ జగిత్యాల మే 23(ప్రజా మంటలు)జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించిన “99 రోజుల యాక్షన్ ప్లాన్ – ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” ముగింపు కార్యక్రమం జిల్లా యువజన మరియు క్రీడల శాఖ స్వామి వివేకానంద ఇండోర్ మినీ స్టేడియంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య...
Read More...
Local News  State News 

తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణ‌యాలు - 23.05.2026

తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణ‌యాలు - 23.05.2026 (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). హైదరాబాద్ 23 మే (ప్రజా మంటలు) :  తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణ‌యాలు మరియు హైలైట్స్.  1. రాష్ట్రంలో రెండో విడ‌త ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 2 ల‌క్ష‌ల 50 వేల మంది పేద కుటుంబాల ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణానికి...
Read More...
Local News  Crime 

గొల్లపల్లి మండల కేంద్రంలో ట్రెయిన్డ్ డాగ్స్ నారకోటిక్ నిషేధిత గంజాయి మధిక ద్రవ్యాల  ప్రత్యేక తనిఖీలు 

గొల్లపల్లి మండల కేంద్రంలో ట్రెయిన్డ్ డాగ్స్ నారకోటిక్ నిషేధిత గంజాయి మధిక ద్రవ్యాల  ప్రత్యేక తనిఖీలు  గొల్లపల్లి మే 22 (ప్రజా  మంటలు): జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  ఆదేశాల మేరకు, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి  ధర్మపురి సర్కిల్ రామ్ నరసింహ రెడ్డి  ఆధ్వర్యంలో  ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి పోలీస్ సిబ్బంది ట్రెయిన్డ్ డాగ్ స్క్వాడ్ తో గంజాయి నిషేధిత మాదక ద్రవ్యాల కోసం విస్తృత తనిఖీలు చేపట్టారు. మాదక...
Read More...
Local News 

ఘనంగా ప్రారంభమైన శ్రీమద్ భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞం

ఘనంగా ప్రారంభమైన శ్రీమద్ భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞం   జగిత్యాల మే 21 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని గీత భవన్ లో పండిత శిరోమణి బ్రహ్మశ్రీ ఖండవల్లి ఆదిత్య శర్మ చే శ్రీమద్భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞము గురువారం ప్రారంభమైంది. ఉదయము 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి సాయంత్రం 3_30 నుండి 6_30 వరకు కొనసాగుచున్నది. ఈనెల 27వ...
Read More...
Local News  Crime 

ధర్మపురి పట్టణ లో ట్రెయిన్డ్ డాగ్స్  సహాయంతో నారకోటిక్ నిషేధిత గంజాయి మధిక ద్రవ్యాల  ప్రత్యేక తనిఖీలు 

ధర్మపురి పట్టణ లో ట్రెయిన్డ్ డాగ్స్  సహాయంతో నారకోటిక్ నిషేధిత గంజాయి మధిక ద్రవ్యాల  ప్రత్యేక తనిఖీలు  గొల్లపల్లి మే 21 (ప్రజా  మంటలు) జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  ఆదేశాల మేరకు, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి సూచనలతో, ధర్మపురి సర్కిల్ రామ్ నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో  ఎస్సై  మహేష్ పోలీస్ సిబ్బంది ట్రెయిన్డ్ డాగ్ స్క్వాడ్ సహాయంతో గంజాయి నిషేధిత మాదక ద్రవ్యాల కోసం విస్తృత తనిఖీలు చేపట్టారు. జగిత్యాల జిల్లా...
Read More...
State News 

కుత్బుల్లాపూర్‌లో తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ: ప్రభుత్వానికి కల్వకుంట్ల కవిత అల్టిమేటం

కుత్బుల్లాపూర్‌లో తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ: ప్రభుత్వానికి కల్వకుంట్ల కవిత అల్టిమేటం కుత్బుల్లాపూర్, హైదరాబాద్ | మే 21 (ప్రజా మంటలు): తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం తెలంగాణ రక్షణ సేన పార్టీ ఏర్పాటైందని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పలు రాజకీయ, సామాజిక అంశాలపై ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించారు. జూన్ 2లోగా హామీలు...
Read More...
Local News 

అనుమానాస్పద వ్యక్తులకు లాడ్జ్  గదులు ఇవ్వొద్దు, గుర్తింపు పత్రాలు తప్పనిసరి: టౌన్  ఇన్‌స్పెక్టర్  కరుణాకర్

అనుమానాస్పద వ్యక్తులకు లాడ్జ్  గదులు ఇవ్వొద్దు, గుర్తింపు పత్రాలు తప్పనిసరి: టౌన్  ఇన్‌స్పెక్టర్  కరుణాకర్ జగిత్యాల మే 20(ప్రజా మంటలు) చుక్క గంగారెడ్డి ప్రతినిధి   పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ మరియు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని పట్టణ  పోలీస్ స్టేషన్  పరిదిలోని  లాడ్జ్ యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నిర్వాహకులు తప్పనిసరిగా పాటించవలసిన భద్రత నిబంధనలు మరియు మార్గదర్శకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ,...
Read More...
State News 

పదేళ్లలో పాలమూరు ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా… ఇప్పుడు పాదయాత్ర డ్రామాలా?

పదేళ్లలో పాలమూరు ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా… ఇప్పుడు పాదయాత్ర డ్రామాలా? :హైదరాబాద్, మే 19 (ప్రజా మంటలు): పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలంటూ వచ్చే నెలలో బీఆర్ఎస్ చేపట్టనున్న పాదయాత్రపై తెలంగాణ రక్షణ సేన నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయకుండా ఇప్పుడు పాదయాత్ర పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.బంజారాహిల్స్‌లో జరిగిన మీడియా సమావేశంలో...
Read More...
Local News 

ఎన్నికల వాగ్దానాలు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్కు బీసీ నాయకులు వినతి

ఎన్నికల వాగ్దానాలు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్కు బీసీ నాయకులు వినతి    జగిత్యాల మే 7(ప్రజా మంటలు)జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయం లో అదనపు కలెక్టర్ జి. రాజగౌడ్ కి వినతి పత్రం అందజేసిన బీసీ నాయకులు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వాగ్దానములో ఇచ్చిన హామీ ప్రకారము 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి. పెండింగ్ స్కాలర్ షిప్లను విడుదల చేయాలి. బీసీ రాష్ట్ర కార్యదర్శి...
Read More...
Local News  Crime 

సైబర్ నేరాల డ్రగ్స్ వినియోగంపై పోలీస్ కళా బృందం అవగాహన సదస్సు 

సైబర్ నేరాల డ్రగ్స్ వినియోగంపై పోలీస్ కళా బృందం అవగాహన సదస్సు  గొల్లపల్లి మే 18 (ప్రజా మంటలు):      జగిత్యాల జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్  ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో సోమవారం ఎండపల్లి మండలంలోని చర్లపల్లి గ్రామంలో  అవగాహన కార్యక్రమం నిర్వహించారు . ఈ సందర్భంగా వెల్గటూర్ ఎస్ఐ,ఉదయ్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో రోజు రోజుకు పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం, సైబర్ నేరాలు,...
Read More...
Local News 

TG EAPCET – 2026 ఫలితాలలో జ్యోతి పూర్వ విద్యార్థుల ఘన విజయం

TG EAPCET – 2026 ఫలితాలలో జ్యోతి పూర్వ విద్యార్థుల ఘన విజయం జగిత్యాల మే 17 (ప్రజా మంటలు)ఆదివారం విడుదల అయిన TG EAPCET – 2026 ఫలితాలలో JYOTHI HIGH SCHOOL IIT ACADEMY పూర్వ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచి సంస్థ ఖ్యాతిని మరింత పెంచారు. అత్యుత్తమ ర్యాంకులు సాధించి విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను సంస్థ...
Read More...