మాదిగ హక్కుల దండోరా జగిత్యాల జిల్లా కన్వీనర్‌గా మంతెన స్వామి మాదిగ నియామకం
జగిత్యాల, మే 19 (ప్రజా మంటలు)
మాదిగ హక్కుల దండోరా (ఎంహెచ్‌డీ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో, మాదిగల సంక్షేమం, హక్కుల సాధన లక్ష్యంగా జరుగుతున్న ఉద్యమాన్ని మరింత పటిష్ఠం చేయడమే లక్ష్యంగా జిల్లా కమిటీల పునర్నిర్మాణ ప్రక్రియ వేగవంతం అయింది. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా కన్వీనర్‌గా ఎండపల్లి మండలం రాజరాంపల్లె గ్రామానికి చెందిన మంతెన స్వామి మాదిగ ని నియమించడమైనట్లు రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ మాదిగ ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మాదిగ హక్కుల దండోరా” ఉద్యమాన్ని గ్రామ స్థాయిలోనుండి రాష్ట్ర స్థాయికి విస్తరించి, మాదిగల హక్కుల సాధనలో సంఘటితంగా ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు .దీని కోసం ప్రతీ జిల్లాలో, మండలాల్లో, నియోజకవర్గాల్లో సమర్ధవంతమైన నాయకత్వం ఉండాలని, అందులో భాగంగానే జగిత్యాల జిల్లా కన్వీనర్‌గా మంతెన స్వామి మాదిగ ని నియమించామని” తెలిపారు. ఉద్యమ నిబద్ధత, జాతి పట్ల ఉన్న కట్టుబాటు, సుదీర్ఘ అనుభవం నేపథ్యంలో ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలియజేశారు.
మాదిగ హక్కుల సాధనలో సంఘటిత కృషికి పిలుపు
ఈ సందర్భంగా రాష్ట్ర నాయకత్వం పిలుపునిస్తూ, మాదిగల సమస్యలను పరిష్కరించాలంటే అన్ని గ్రామాలు, మండలాలు, జిల్లాల నుంచి ఒకటైన శక్తిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. అన్ని స్థాయిల నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తేనే ఉద్యమ విజయవంతమవుతుందని అభిప్రాయపడ్డారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి. -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి

దశాబ్దం తర్వాత నెరవేరుతున్న పేదల సొంతింటి కల

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి..

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు

గల్ఫ్ అడ్వైజరి బొర్డ్ కు చాంద్ పాషా విజ్ఞప్తి
