శ్వాస కోశ వ్యాధుల్లో కనీసం 60 శాతం పైనే కోవిడ్ కేసులు నమోదు
ఇమ్యునిటీ పవర్ పెంచుకోవడమే కరోనాకు అసలు మందు..
*గాంధీ క్రిటికల్ కేర్ మెడిసిన్ హెచ్ఓడీ ప్రొఫెసర్ కిరన్ మాదాల
సికింద్రాబాద్ మే 17 (ప్రజామంటలు):
గత రెండు దశలల్లో అందరిని గడగడలాడించిన కోవిడ్ భూతం ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మళ్ళీ వ్యాపిస్తుందన్న వార్తలు కలవరపరుస్తున్నాయి. ఈ నేపద్యంలో గాంధీ ఆసుపత్రి క్రిటికల్ కేర్ మెడిసిన్ హెచ్ఓడీ ప్రొఫెసర్ డా.కిరన్ మాదాల కరోనా వ్యాప్తి, కొత్త వేరియంట్లు,నివారణ చర్యలు, ముందస్తు జాగ్రత్తలపై మాట్లాడారు. కోవిడ్–19 ఒకటి, రెండవ దశల్లో ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిన తర్వాత పలు వేరియంట్లతో దాని వ్యాప్తి కొనసాగుతునే ఉందన్నారు. 2021 లో డెల్టా, 2022 లో ఒమిక్రాన్ వేరియంట్ల తర్వాత కరోనా వైరస్ ప్రభావం బాగా తగ్గిందన్నారు. ఆ తర్వాత కోవిడ్ కేసులు నమోదు అయినప్పటికీ ప్రారంభదశలో ఉన్నంత వైరస్ ప్రభావం తర్వాత లేదన్నారు. ఇంటర్నేషనల్ కనెక్టివిటీ బాగా ఉన్నటువంటి హాంకాంగ్, సింగపూర్ దేశాల్లో ఇప్పుడు కరోనా కేసులు నమోదు అవుతున్నాయనే వార్తలు వస్తున్నాయని, కాని మనదేశంలో ఇంకా కోవిడ్ కేసులు పెరగలేదన్నారు. గతంలో జేఎన్–వన్, ఎక్స్ బీబీ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయన్నారు. ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ జాతి కి సంబందించిన వేరియంట్ లు తిరిగి వ్యాప్తి చెందుతున్నాయని వైద్య నిపుణలు బావిస్తున్నారుని, కాని దీనిని ప్రపంప ఆరోగ్య సంస్థ ఇంకా నిర్దారించలేదన్నారు. ఇప్పుడు హాంకాంగ్, సింగపూర్ దేశాల్లో పెరుగుతున్న కేసులపై ఆందోళన అవసరం లేదన్నారు. ప్రజల్లో రెండు రకాల ఇమ్యూనిటీ ఉంటుందని, గతంలో మనం తీసుకున్న వ్యాక్సిన్ల తో వచ్చిన ఇమ్యూనిటీ బాడీలో నుంచి వెళ్ళిపోయినప్పటికీ సెల్ మెడియటేడ్ ఇమ్యూనిటీ ఎప్పటికీ మన బాడీలో ఉంటుందన్నారు. అయిన్పటికీ మన దేశంలో సాదారణంగా ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుందన్నారు. కోవిడ్ కేసులు, శ్వాస సంబంధిత సమస్యల్లో కోవిడ్ శాతంపై ఎప్పటికప్పుడు ఐసీఎమ్ఆర్ డేటా మెంటన్ చేస్తోందన్నారు. తాజాగా ఐసీఎంఆర్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం శ్వాసకోశ సంబంధిత ఇన్ ఫెక్షన్లలో కోవిడ్ కేసులు కనీసం 60 శాతం పైన ఉంటున్నాయని తెలిపారు. ఏ వ్యాధి, ఏ వైరస్ అయినప్పటికీ చికిత్స కన్నా నివారణ చాలా ముఖ్యమన్నారు. పోస్టు కోవిడ్ సమయంలో మనం వాడిన స్టెరాయిడ్స్ కారణంగా తర్వాత ఇమ్యూనిటీ తగ్గి బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అయ్యాయన్నారు. కాని బ్లాక్ ఫంగస్ అనేది వేవ్ కాదన్నారు. ప్రజలు శుభ్రంగా ఉంటూ, మాస్కులు ధరిస్తే వైరస్ ల ప్రభావాన్ని తగ్గించవచ్చని డాక్టర్ కిరన్ మాదాల పేర్కొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి. -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి

దశాబ్దం తర్వాత నెరవేరుతున్న పేదల సొంతింటి కల

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి..

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు

గల్ఫ్ అడ్వైజరి బొర్డ్ కు చాంద్ పాషా విజ్ఞప్తి
