ఘనంగా అంబేడ్కర్ 134 జయంతి ఉత్సవాలు
పలువురుకి దళిత రత్న అవార్డుల ప్రధానం
సికింద్రాబాద్ మే 19 (ప్రజామంటలు):
2025 డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహనీయుల 134 వ జయంతి ఉత్సవాలను రాష్ట్ర మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ ఇటుక రాజు మాదిగ ఆధ్వర్యంలో సోమవారం కంటోన్మెంట్ బాలం రాయి లోని క్లాసిక్ గార్డెన్ ఫంక్షన్ లో ఘనంగా నిర్వహించారు. సనత్ నగర్ నియోజకవర్గం మాదిగ హక్కుల పార్టీల సంఘాల ఐక్యత జేఏసీ సారథ్యంలో ఎంపిక చేసిన వారికి చైర్మన్ ఇటుక రాజు చేతుల మీదుగా దళిత రత్న అవార్డులను ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ ఇటుక రాజు మాట్లాడుతూ... నిస్వార్ధంగా సమాజానికి తమ బాధ్యతగా దళిత జాతికి సేవలందిస్తున్న వారికి ఈ దళిత రత్న అవార్డు ప్రధానంతో సమాజం పట్ల మెరుగైన సేవలు అందించడంలో ఇంకా బాధ్యత పెరుగుతుందని ఆయన అన్నారు అవార్డు అందుకున్న వారిలో మాజీ కార్పొరేటర్ సీనియర్ నాయకుడు ఏసూరి మహేష్, ఎం. రాంబాబు, రేవుల శంకర్, ఆడవెల్లి కుమార్, పల్లె సుధాకర్, పూజారి స్వామి, ఈ. నర్సింగ్ రావు, సుంకపాక రాజు , రిటైర్డ్ సిఆర్పిఎఫ్ జవాన్ బొడ్డు పరుశురాం, సుంచు యాదగిరి, కుమ్మరి రాజు, రాసళ్ళ సెల్వరాజ్, జే. నర్సింగ్ రావు (ఫోటోగ్రాఫర్), కారంగుల నరేష్ (ఆర్.టి.ఐ), ఎర్ర బాబురావు, కే. నిరంజన్, పి. మోహన్ కృష్ణ లను ఘనంగా సన్మానించి అవార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా అవార్డులు అందుకున్న వారు ఉత్సవాల చైర్మన్ ఇటుక రాజుకు, వైస్ చైర్మన్ కనకరాజుకు, మాదిగ జేఏసీ నాయకులు పుల్లూరి మహేందర్, డప్పుల వేణుగోపాల్, బొడ్డు మహేష్, కొంగరి సతీష్, కుమ్మరి శంకర్, పి. చంద్రశేఖర్ (బబ్బర్)లకు కృతజ్ఞతలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి. -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి

దశాబ్దం తర్వాత నెరవేరుతున్న పేదల సొంతింటి కల

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి..

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు

గల్ఫ్ అడ్వైజరి బొర్డ్ కు చాంద్ పాషా విజ్ఞప్తి
