గాంధీ అలుమ్నీ, మాజీ ప్రెసిడెంట్ ప్రతాప్‌రెడ్డి మృతి
సికింద్రాబాద్ మే 18 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ అలుమ్నీ అసోషియేషన్ మాజీ ప్రెసిడెంట్, సీనియర్ డాక్టర్ ప్రతాప్‌రెడ్డి మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇండో అమెరికన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూసారు. గాంధీ మెడికల్ కాలేజీ 1967 బ్యాచ్‌కు చెందిన ప్రతాప్‌రెడ్డి స్టూడెంట్ యూనియన్ లీడర్‌గా పలు పదవులు నిర్వహించారు. అనంతరం గాంధీ అలుమ్నీ అసోషియేషన్ అధ్యక్షునిగా, ఇండియన్ మెడికల్ అసోషియేషన్ (ఐఎంఏ) తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్‌గా సమర్ధవంతమైన సేవలు అందించారు. గాంధీ అలుమ్నీ హెరిటేజ్ భవనంలో సోమవారం ఉదయం గాంధీ వైద్యుల సందర్శనార్ధం ప్రతాప్‌రెడ్డి పార్ధివదేహాన్ని ఉంచిన అనంతరం వైద్యవిద్యార్థుల పరిశోధనల నిమిత్తం గాంధీ మెడికల్ కాలేజీ అనాటమీ విభాగానికి ఆయన భౌతికకాయాన్ని అప్పగించనున్నట్లు గాంధీ అలుమ్నీ అసోషియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జీఆర్ లింగమూర్తి తెలిపారు. ప్రతాప్ రెడ్డి మృతి పట్ల గాంధీ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ వైద్యులు,అధికారులు దిగ్ర్బాంతి వ్యక్తం చేసి, ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి. -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి

దశాబ్దం తర్వాత నెరవేరుతున్న పేదల సొంతింటి కల

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి..

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు

గల్ఫ్ అడ్వైజరి బొర్డ్ కు చాంద్ పాషా విజ్ఞప్తి
