సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా మా భాగవతి 21వ విశాల్ జాగరన్ వేడుకలు
*ఈరోజు వేడుకలు ప్రారంభం
సికింద్రాబాద్ మే 16 (ప్రజామంటలు):
సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా మా భాగవతి 21వ విశాల్ జాగరన్ వేడుకలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు బీఎన్.శ్రీనివాస్ తెలిపారు.శుక్రవారం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మా వైష్ణో దేవి జాగరన్ మండల్ ఆధ్వర్యములో ప్రతి ఏటా వైభవంగా వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏడాది కూడా ఈనెల 17న సాయంత్రం వేడుకలు ప్రారంభం కానునట్లు వెల్లడించారు. పార్టీలకు అతీతంగా హిందూ బంధువులు, సోదరులు భేదాభిప్రాయం లేకుండా జాగారాన్ వేడుకలో పాల్గొంటారని వెల్లడించారు. జమ్మూ నుండి కట్ర దేవాలయం లోని ప్రధాన అర్చకులు అఖండ జ్యోతి వెలిగించి అమ్మవారి పూజలు ప్రారంభిస్తారని ఉత్తర భారతదేశం సాంప్రదాయ పద్ధతిలో వేడుకలు జరగనున్నట్లుగా వెల్లడించారు. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ గాయకులు లక్ వీర్ సింగ్ లక్మ ఆధ్వర్యంలో అమ్మవారి కీర్తనలు పాడి భక్తులను భక్తి పారవశ్యంలో నడిపించనున్నట్లుగా పేర్కొన్నారు. ఈ ప్రత్యేక పూజ వేడుకల్లో సుమారు 7000 నుండి 10000 మంది భక్తులు హాజరవుతారని అంచనా అని తెలిపారు. అమ్మవారి దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు సదుపాయాలు కల్పించడం జరుగుతుందని వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ ప్రత్యేక పూజ కార్యక్రమానికి అనుమతులు ఇచ్చినందుకు కంటోన్మెంట్ బోర్డ్ సీఈవో మధుకర్ నాయక్ కు కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.నగరం లోని పలు ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని ప్రతేక పూజలు నిర్వహిస్తారనీ తెలిపారు ఈ సమావేశం లో చైర్మన్ సురేందర్ జోషి,వైస్ చైర్మన్ వినోద్ పొద్దార్,ప్రెసిడెంట్ కైలాష్ చాంద్ అగర్వాల్,వైస్ ప్రెసిడెంట్ సంజయ్ అగర్వాల్,సందీప్ సింగ్,కోశాధికారి సందీప్ జోషి, ప్రధాన కార్యదర్శి బీ.ఎన్.శ్రీనివాస్,కన్వీనర్ రాజేందర్ అగర్వాల్, లక్ష్మి నారాయణ అగర్వాల్,సంజయ్ కుమార్ గోయల్,సర్వాన్ గోయల్,సంతోషి గోషి,సెక్రెటరీ రాజేష్ గోయల్,డిప్యూటీ సెక్రెటరీ హరి ఓం పాల్గొన్నారు
––
–ఫొటో:
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి. -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి

దశాబ్దం తర్వాత నెరవేరుతున్న పేదల సొంతింటి కల

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి..

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు

గల్ఫ్ అడ్వైజరి బొర్డ్ కు చాంద్ పాషా విజ్ఞప్తి
