బీబీకే ఆధ్వర్యంలో క్రీడల నిర్వహణ అభినందనీయం
గొల్లపల్లి మే 19 (ప్రజా మంటలు):
బిబికే ( భీమ్ రాజ్ పల్లి బొమ్మెన కుమార్ ) ట్రస్ట్ అండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడల నిర్వహణ అభినందనీయమని గొల్లపల్లి ఎస్సై సతీష్ అన్నారు. మండలంలోని భీమ్ రాజ్ పల్లి గ్రామంలో గత ఐదు రోజుల నిర్వహిస్తున్న బి బి కే క్రికెట్ టోర్నమెంట్ లో విజయం సాధించిన విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.
8 జట్లు పాల్గొనగా భీమ్ రాజ్ పల్లి జట్టు విన్నర్ గా నిలిచింది. చివరి నిమిషంలో ఒక్క బంతిలో ఆరు పరుగులు తీసి జట్టును గెలిపించిన ఎనగందుల రూపేష్ ను ఎస్సై ప్రత్యేకంగా అభినందించారు. అలాగే దట్నూరు జట్టు రన్నర్ గా నిలిచింది. ఇరుజట్ల కెప్టెన్లు కంది మహేష్, నిశాంత్, మిగతా టీం ప్లేయర్లకు ఎస్ఐ సతీష్ చేతుల మీదుగా టోపీలను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన భీమ్ రాజు పల్లి గ్రామంలో బి బి కే ట్రస్ట్ పేరిట సామాజిక సేవలు, యువతను ప్రోత్సహించేందుకు క్రీడా పోటీలు నిర్వహించడం ట్రస్ట్ ఫౌండర్ బొమ్మన కుమార్ అభినందిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నాడు ఆటలు పాటలు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేదని నేడు సెల్ ఫోన్, డ్రగ్స్ మాయలో పడి యువత పోటీలకు దూరంగా ఉంటున్నారు అన్నారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో యువతను ప్రోత్సహించేందుకు సామాజిక సేవలతో పాటు , క్రీడా పోటీలు నిర్వహించడం శుభ పరిణామం అన్నారు. ఇలాంటి క్రీడలను యువత సద్వినియోగం చేసుకున్నట్లయితే గ్రామీణ యువతకు క్రీడలు మానసిక శారీరకంగా దోహదం చేస్తాయన్నారు. యువత ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని జిల్లా,రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించాలన్నారు. మారుమూల పల్లెల నుంచి ఎందరో క్రీడాకారులు రాణించారన్నారు. డ్రగ్స్ మాయలో పడి బతుకులు నాశనం చేసుకోకుండా భవిష్యత్తులో ఎదగాలన్నారు.
బి బి కే ట్రస్ట్ అండ్ ఫౌండర్ బొమ్మన కుమార్ మాట్లాడుతూ గ్రామీణ యువతను క్రీడల్లో ప్రోత్సహించడానికి బి బి కే ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. ట్రస్టు సేవలు ముందుకు తీసుకువెళ్ళడానికి సహకరిస్తున్న గ్రామ ప్రజలకు, యువతకు ధన్యవాదాలు తెలిపారు.లీడ్ ఇండియా సామాన్వయ కర్త తాడూరి శ్రీనివాస, వంశీ కృష్ణ, తిరుపతి రావు, కాంగ్రెస్ నాయకులు కిష్టం పేట రమేష్ రెడ్డి, ములకాల శ్రీనివాస్, మద్దూరి నవీన్, నర్సింహా రెడ్డి, రాజలింగ్, సింగారపు దొంగన్న, లచ్చయ్య, కంది సత్తయ్య, రఘపతి తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి. -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి

దశాబ్దం తర్వాత నెరవేరుతున్న పేదల సొంతింటి కల

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి..

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు

గల్ఫ్ అడ్వైజరి బొర్డ్ కు చాంద్ పాషా విజ్ఞప్తి
