సీనియర్ సిటీజేన్లకు ప్రభుత్వం అండగా ఉంటుంది - రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
జగిత్యాల మే 17 (ప్రజా మంటలు):
సీనియర్ సిటీజేన్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు .శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో భూభారతి సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన రెవెన్యూశాఖ మంత్రి ని సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా ప్రతినిధులు కలిసి పుష్పగుచ్ఛం అందించి,పట్టు శాలువా కప్పి,తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ సమస్యల పరిష్కారము కోసం వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ తమ రాష్ట్ర అధ్యక్షుడు పి.నర్సింహా రావు ఆధ్వర్యంలో కోరుతున్న సమస్యలను విన్నవించారు.సీనియర్ సిటీజేన్స్ కు ప్రత్యేకముగా ప్రభుత్వ శాఖ ఏర్పాటు చేయాలని,సీనియర్ సిటీజేన్స్ సమావేశ భవనం కోసం హైదరాబాద్ లో 2 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించి ,భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని, అలాగే అన్ని జిల్లాకేంద్రాల్లో తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ భవనాల కోసం ప్రభుత్వ స్థలం,నిర్మాణం ల కోసం నిధులు మంజూరు చేయించాలని, ఆర్టీసీ బస్సుల్లో 60 ఏళ్ళు దాటిన వృద్ధులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని,అన్ని ప్రభుత్వ,ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచిత వైద్యసేవలు అందించాలని,వృద్దాశ్రమాలలు లేని జిల్లాల్లో ప్రభుత్వం తరపున వృద్దాశ్రమాలు ఏర్పాటు చేయాలనే,తదితర సమస్యలను విన్నవించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,జిల్లా గౌరవ సలహాదారు రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ కందుకూరి కృష్ణా రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,కోశాధికారి వెల్ముల ప్రకాష్ రావు,ఉపాధ్యక్షులు పి.సి.హన్మంత రెడ్డి,ఎం.డి.యాకూబ్,ఆర్గనైజింగ్ కార్యదర్శులు పి.ఆశోక్ రావు,కే.సత్యనారాయణ,జగిత్యాల డివిజన్ అధ్యక్షుడు బి.రాజేశ్వర్,కోరుట్ల డివిజన్ అధ్యక్షుడు పబ్బా శివానందం,మెట్ పల్లి డివిజన్ అధ్యక్షుడు వొజ్జెల బుచ్చిరెడ్డి,జగిత్యాల రూరల్ మండలం అధ్యక్షుడు నక్క ఇంద్రయ్య,తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జైత్రయాత్ర ఉద్యమ నేత పి. నారాయణకు నివాళి

ఫామ్ సాగుపై అధికారులతో సమీక్ష నిర్వహించిన అదనపు కలెక్టర్

మౌలిక సదుపాయాల కల్పనకై మంత్రి శ్రీనివాస్ రెడ్డిని కలిసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు

హైపర్ టెన్షన్ డే అవగాహన కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

శ్వాస కోశ వ్యాధుల్లో కనీసం 60 శాతం పైనే కోవిడ్ కేసులు నమోదు

భూభారతి చట్టం.. రైతుల చుట్టం.. 18 రాష్ట్రాల్లో భూభారతి పై అధ్యయనం చేశాం

సీనియర్ సిటీజేన్లకు ప్రభుత్వం అండగా ఉంటుంది - రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి

మంత్రి పొంగులేటిని మర్యాద పూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం

ప్రతి ఒక్కరికీ "చుట్టంలా ఉండే చట్టం' భూ భారతి చట్టం*

మంత్రి పొంగులేటిని మర్యాద పూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్

గాంధీ ఆస్పత్రి ఆవరణలో గుర్తుతెలిసిన డెడ్ బాడీ

బన్సీలాల్ పేట టిడిపి డివిజన్ అధ్యక్షుడిగా సందీప్
