తెలంగాణ విప్లవోద్యమ చరిత్రలో ఒక వెలుగురేఖ పల్లెమీది నారాయణ.

On
తెలంగాణ విప్లవోద్యమ చరిత్రలో ఒక వెలుగురేఖ పల్లెమీది నారాయణ.

.(రామ కిష్టయ్య సంగన భట్ల సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్...9440595494)


అవిభక్త కరీంనగర్ జిల్లాలో తొలి తరం నక్సలైట్ నాయకులలో ముఖ్యులైన పండుగ నారాయణ సార్ మే 15న ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు.
మూడు నెలలుగా కాలేయం అన్న వాహిక వద్ద ఏర్పడిన కంతితో,  జాండిస్ వ్యాధితో 
 జీర్ణవ్యవస్థ వ్యవస్థకు అడ్డు పడి ఆపరేషన్ చేయించుకుని, కోలుకుని, తిరిగి అస్వస్తులై , మే 15 వతేదీ గురువారం అర్ధరాత్రి తరువాత తుది శ్వాస విడిచారు. 

తెలంగాణ విప్లవోద్యమ చరిత్రలో ఒక వెలుగురేఖ పల్లెమీది నారాయణ.  జగిత్యాల జైత్రయాత్రను ముందుండి నడిపించిన సారథిగా, ప్రజా ఉద్యమాలకు సిద్ధాంతాన్ని అందించిన బోధకుడిగా, నక్సలైట్ ఉద్యమం తొలి రోజుల్లో కీలకమైన నాయకుడిగా ఆయన నిలిచారు. విద్యావంతుల్లో , పౌరహక్కుల ఉద్యమ నిర్మాతల్లో ఆయన చేసిన ఉద్యమాల జ్ఞాపకాలు చెరిగి పోనివి.

ఉత్తర తెలంగాణను భూస్వామ్య పెత్తందారీతనం నుండి విముక్తి చేయడానికి జరిగిన పోరాటంలో నారాయణ ఒక గొప్ప గురువుగా ప్రజల మన్ననలు పొందారు. ఉద్యమంలో, జైలు లోపల కూడా సిద్దాంత అధ్యయన తరగతులు నిర్వహించే వారు.
 ఉద్యమంలో ఉన్నా, జైలు గోడల మధ్య ఉన్నా ప్రజల చైతన్యం కోసం నిరంతరం తపించిన ఆయనను అందరూ ప్రేమగా "నారాయణ సార్" అని పిలుచు కున్నారు.
పల్లెమీది నారాయణ, కల్లూరు  నారాయణ అని కూడా పిలుస్తారు.

1950లో కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలం సర్పరాజ్‌ పల్లెలో జన్మించిన పండుగ నారాయణ విద్యార్థి దశ నుండే చైతన్యంతో నిండారు. ఆ చైతన్యాన్ని ఆయన జీవితాంతం ఉద్యమంగా మలిచారు. తొలుత ఒక ప్రైవేటు పాఠశాలను నడిపిన ఆయన, 1968లో ప్రజల పక్షాన నిలిచారు. నక్సలైట్ ఉద్యమం తెలంగాణలో వ్యాపిస్తున్న సమయంలో ఆయన ఒక సిద్ధాంత కర్తగా, ప్రజలను చైతన్యపరిచే వాగ్ధాటి కలిగిన వక్తగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. జైలు జీవితం అనుభవించినప్పటికీ, అక్కడ కూడా మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచనలను బోధిస్తూ ఉద్యమానికి బలమైన పునాదులు వేశారు.
1978 జూలై 17న జరిగిన జగిత్యాల రైతు కూలీ మహాసభ, ఆ తర్వాత చరిత్రలో నిలిచిపోయిన జగిత్యాల జైత్రయాత్రకు ఆయన ముఖ్య సూత్రధారుల్లో ఒకరు. ఈ యాత్ర తెలంగాణ గ్రామీణ ప్రజల్లో భూస్వామ్య వ్యతిరేక పోరాట స్ఫూర్తిని రగిలించింది. విద్యార్థులు, యువకులు గ్రామాల్లో నిర్వహించిన చైతన్య కార్యక్రమాలతో రైతులు, కూలీలు పెద్ద సంఖ్యలో ఉద్యమంలో భాగస్వాములయ్యేలా చేసిన కృషిలో నారాయణ పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఆయన వేసిన వ్యూహాలు ఉద్యమాన్ని ప్రజల గుండెల్లోకి తీసుకువెళ్లాయి.
అయితే, కాలక్రమంలో పార్టీ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలపై నారాయణ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలతో కలిసి ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటాలు చేయాలన్న ఆయన ఆలోచనలకు విరుద్ధంగా పార్టీ గెరిల్లా పోరాటాలకు ప్రాధాన్యత ఇచ్చింది. రహస్య మార్గాల కంటే ప్రజలకు చేరువగా ఉండే పోరాట పద్ధతుల వైపు ఆయన మొగ్గు చూపారు. ఈ విభేదాల కారణంగానే 1982లో జైలు పాలై,1984లో జైలు నుండి విడుదలైన తర్వాత ఆయన పార్టీకి దూరమయ్యారు. పార్టీని వీడినా, కేసులు కొట్టేయ బడినా, భూస్వాముల పాత పగలు ఎక్కడ వెంటాడతాయోనని, కొంత కాలం రహస్య జీవితాన్నే ఎంచుకుని, కుటుంబంతో కలిసి, నారాయణ హైదరాబాద్ వెళ్ళి,  సిటీ బస్ కండక్టర్ గా కుశాయి గూడ బస్ డిపోలో మూడో నెంబర్ రూట్ పై పని చేసి రిటర్ అయ్యారు.

పార్టీని వీడినప్పటికీ, ఆయన ఆశయాలు మాత్రం మారలేదు. భూస్వాముల దోపిడీని ఆయన ఎప్పటికీ మరచిపోలేదు. కష్టాల చీకటి ఆయన జీవితంలో ఒక భాగమైపోయింది. హైదరాబాద్‌లో సిటీ బస్సు కండక్టర్‌గా పనిచేసి పదవీ విరమణ తర్వాత, పట్టణ వాతావరణం వీడి, తిరిగి జన్మ నిచ్చిన స్వగ్రామానికే తిరిగి వచ్చారు. ఉద్యమం రూపురేఖలు మారినా, ఆయన లక్ష్యం మాత్రం చెక్కుచెదరలేదు. గ్రామాల్లో సామాజిక మార్పు ఆయన హృదయంలో నిత్యం మెదులుతూనే ఉంది. తన ఆశయాలను గుర్తు చేసుకుంటూ ఆయన మిగిలిన జీవితాన్ని గడిపారు.

నేటి పీపుల్స్ వార్ మావోయిస్టు పార్టీకి తొలి బీజాలు వేసి చరిత్ర సృష్టించిన కార్య కర్తగా, నాయకుడిగా, మార్గదర్శిగా, 
నారాయణను విప్లవ చరిత్ర గుర్తుంచు కుంటుంది. నారాయణ ఆలోచనలు సాకారమైతే, ఆ పంథాలో 
 ఉద్యమాలు సాగితే  గ్రామ స్వరాజ్యం, స్థానిక పాలన , బహుజన సామాజిక అధికారం మార్పిడి ఎపుడో జరిగి వుండేదని ఆయన అభిమానులు ఇప్పటికీ భావిస్తుంటారు.

నారాయణ కేవలం చరిత్రలోని ఒక పేజీ మాత్రమే కాదు, ఉద్యమాల స్ఫూర్తి. ఆయన చూపిన మార్గం నేటికీ గ్రామాల్లోని ప్రజలకు, రైతులకు, యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. నేటి మావోయిస్టు ఉద్యమానికి, పీపుల్స్ వార్‌కు ఆయన నాటిన విప్లవ బీజాలే మూలం. జగిత్యాల జైత్రయాత్ర చరిత్రలో నిలిచి ఉన్నంత కాలం, పల్లెమీది నారాయణ పేరు తరతరాలకూ గుర్తుండి పోతుంది.
ఆయన పేరు అమరవీరుల జాబితాలో కనిపించక పోయినా, ఆయన జీవితం ఒక గొప్ప శిల్పం. మానవత్వం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ఒక నిరంతర ప్రయాణం. తెలంగాణ చరిత్రలో ఉద్యమం అంటే ఏమిటో తన జీవితం ద్వారా చూపించిన ఒక గొప్ప వ్యక్తి ఆయన.
పల్లెమీది నారాయణ సార్ ఒక యుగపురుషుడు అంటే అతిశయోక్తి కాదేమో...

Tags

More News...

Local News 

వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదే -మాతా శిశు కేంద్ర సూపరింటెండెంట్ సుమన్ రావు      

వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదే -మాతా శిశు కేంద్ర సూపరింటెండెంట్ సుమన్ రావు           -సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో జాతీయ వైద్య దినోత్సవం వేడుకలు           జగిత్యాల జులై 01 (ప్రజా మంటలు): వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదేనని,ప్రాణాలు పణంగా పెట్టి రోగులకు సేవలంధిస్తున్నామని మాతా శిశు కేంద్ర జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ సుమన్ మోహన్ రావు  అన్నారు. మంగళవారం  జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్ర సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆస్పత్రిలో...
Read More...
State News 

సిగాచి పరిశ్రమలో గాయపడిమావారిని ఆస్పత్రిలో  పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

సిగాచి పరిశ్రమలో గాయపడిమావారిని ఆస్పత్రిలో  పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత పటాన్చెరువు జూలై 01 (ప్రజా మంటలు): సిగాచి పరిశ్రమలో గాయపడి పటాన్ చెరు ధ్రువ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. బాధితుల తో, అక్కడి డాక్టర్లతో ఆమె మాట్లాడరు. ప్రభుత్వ అలసత్వం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదం దురదృష్టకరం. పరిశ్రమలలో సేఫ్టీపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలను...
Read More...
Local News 

ఎంపీ రఘునందన్ రావును పరామర్శించిన బీజేపీ స్టేట్ చీఫ్ 

ఎంపీ రఘునందన్ రావును పరామర్శించిన బీజేపీ స్టేట్ చీఫ్  సికింద్రాబాద్  జూలై01 (ప్రజామంటలు): :  మోకాలి శస్త్ర చికిత్స చేయించుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మెదక్ పార్లమెంటు సభ్యులు  రఘునందన్ రావు ను బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావు పరామర్శించారు. మంగళవారం సాయంత్రం  ఆయన పలువురు బీజేపీ నాయకులతో కలిసి సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి వెళ్ల  ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.  ఆయన...
Read More...
Local News 

కన్నులపండువగా మహాకాళి అమ్మవారి ఘటము ఊరేగింపు

కన్నులపండువగా మహాకాళి అమ్మవారి ఘటము ఊరేగింపు సికింద్రాబాద్ జూలై 01 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవస్థానంలో ఆషాడ బోనాల వేడుకలు కన్నుల పండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం ఉదయం అమ్మవారి ఆలయం నుంచి మేళా తాళాలు, పోతరాజుల విన్యాసాలతో అమ్మవారి ఘటము కళాసిగూడ ప్రాంతానికి తీసుకువెళ్ళారు. అక్కడ స్థానిక మహిళలు అమ్మవారికి ఓడిబియ్యం, కుంకుమ,పసుపులు...
Read More...
Local News  State News 

పాశమైలారం ప్రమాద ఘటనపై ఎన్హెచ్ఆర్సీ లో పిటీషన్

పాశమైలారం ప్రమాద ఘటనపై ఎన్హెచ్ఆర్సీ లో పిటీషన్ సికింద్రాబాద్, జూలై 01 (ప్రజామంటలు) : పాశమైలారం ప్రమాద ఘటన పై కేసు నమోదు చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్ - సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యం చిదంబరం షణ్ముఖానాథన్, గుంతక ధనలక్ష్మి, అమిత్ రాజ్ సిన్హా, సర్వేశ్వర్ రెడ్డి, వివేక్ కుమార్, ఓరుగంటి సుబ్బిరామి రెడ్డి, రవీంద్ర ప్రసాద్ సిన్హా, బిందు వినోదాన్...
Read More...
Local News 

ఆపదలో ఉన్న వారిని కాపాడే గొప్ప వృత్తి - గాంధీలో  ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్..

ఆపదలో ఉన్న వారిని కాపాడే గొప్ప వృత్తి - గాంధీలో  ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్.. సికింద్రాబాద్, జూలై 01 ( ప్రజామంటలు) : డాక్టర్స్ డే సందర్భంగా భారత రత్న డాక్టర్ బీ.సీ రాయ్ ని  స్మరిస్తూ గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి,ఇతర వైద్యులు ఆయన చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ... వైద్య వృత్తి అత్యంత పవిత్రమైనదని, వైద్యులు గా ఉండడం అత్యంత అదృష్టం గా...
Read More...
State News 

పవర్ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా దోమన్ యాదవ్

పవర్ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా దోమన్ యాదవ్ సికింద్రాబాద్, జూలై 01 (ప్రజామంటలు)::పవర్ గ్రిడ్ సదరన్ రీజన్ ట్రాన్స్ మిషన్ సిస్టమ్–1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా దోమన్ యాదవ్ మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. దోమన్ యాదవ్ పాట్నా యూనివర్శిటీ నుంచి ఎలక్ర్టానిక్ ఆండ్ కమ్యూనికేషన్స్ గ్రాడ్యుయేట్, ఎండీఐ గుర్గావ్ నుంచి బిజినెస్ మేనేజ్ మెంట్ లో పీజీ డిప్లోమా పొందారు....
Read More...
Local News 

చుట్టాల బస్తీ యూపీహెచ్సీలో  ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్

చుట్టాల బస్తీ యూపీహెచ్సీలో  ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ సికింద్రాబాద్, జూలై 01 (ప్రజామంటలు) : జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా మంగళవారం సికింద్రాబాద్ లోని చుట్టాల బస్తీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC) ఆసుపత్రిలో వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని,ఆపదలో ఉన్న వారి...
Read More...
Local News 

శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు అందరిపై ఉండాలి మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత

శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు అందరిపై ఉండాలి మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత జగిత్యాల జులై 1( ప్రజా మంటలు) శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు అందరిపై ఉండాలి మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత అన్నారు   జగిత్యాల పట్టణంలో మంగళవారం జరిగిన శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవంలో నాయకులతో కలిసి పాల్గొన్న జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...
Read More...
Local News 

ఈ ఏడాది ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం    హపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

ఈ ఏడాది ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం    హపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు  సికింద్రాబాద్, జూలై01 (ప్రజామంటలు): బల్కంపేట ఎల్లమ్మ జమదగ్నిల కళ్యాణోత్సవం ఈ ఏడాది ఘనంగా నిర్వహించామని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ డాక్టర్ కోట నీలిమ తెలిపారు. అమ్మవారికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరుపున...
Read More...
Local News 

తల్లిదండ్రులు జన్మనిస్తే... వైద్యులు పునర్జన్మ నిస్తారు...!

తల్లిదండ్రులు జన్మనిస్తే... వైద్యులు పునర్జన్మ నిస్తారు...! మాజీ మున్సిపల్ చైర్మన్ లయన్ మోర హన్మాండ్లు గొల్లపల్లి (రాయికల్) జులై 01 (ప్రజా మంటలు): తల్లిదండ్రులు జన్మనిస్తే... వైద్యులు పునర్జన్మ నిస్తారని మాజీ మున్సిపల్ చైర్మన్ లయన్ మోర హన్మాండ్లు అన్నారు.మంగళవారం జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాయికల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శశికాంత్ రెడ్డి,డాక్టర్ సురేందర్,డాక్టర్...
Read More...
Local News 

ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి, శాంతి, సమన్వయ భావాలను పెంపొందిస్తాయి - ఎమ్మెల్యే డా.సంజయ్ కుమా

ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి, శాంతి, సమన్వయ భావాలను పెంపొందిస్తాయి - ఎమ్మెల్యే డా.సంజయ్ కుమా ర్ జగిత్యాల జూలై 1 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలో ఇస్కాన్ మెట్పల్లి వారి ఆద్వర్యం లో జగన్నాధ రథ యాత్ర ప్రారంభం సందర్భంగా జగిత్యాల రోటరీ క్లబ్ వద్ద  పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    మాట్లాడుతూ సామాజిక సమగ్రతను పెంపొందించే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో ఈ...
Read More...