సంప్రదాయ రీతిలో సంకట హర చతుర్థి
ఈశాన్య గణపతికి ప్రత్యేక పూజలు
(రామకిష్టయ్య సంగనభట్ల...
9440595494)
కృష్ణ పక్ష చతుర్థిని సంకష్ట హర చతుర్థి అంటారు. వినాయకుని ఆరాధకులు సంకట వినాయక వ్రతం అనేది అత్యంత ప్రాముఖ్యమైన వ్రతంగా భావిస్తారు. ఆ రోజు అంతా ఉపవాసం వుండి సంకట గణేష పూజ సాయంకాలం జరిపి, చంద్రదర్శనం అయినాక వారి ఉపవాసంకు ముగింపు పలికి ఏదన్నా తింటారు. సంకట చతుర్థి ప్రాముఖ్యత భవిష్య పురాణంలోనూ నరసింహ పురాణంలోనూ చెప్పబడింది. సంకట చతుర్ధి మహత్యం శ్రీ కృష్ణుడు యుధిష్టరునికి వివరించాడు. సంకట అంటే కష్టములు, ఇబ్బందులు, సమస్యలను హర అంటే హరించేది అని అర్థం.
ఋగ్వేదంలో గణపతి వేదాలు, జ్ఞానములకు, కర్మిష్టులకు, సర్వవ్యాపక భక్తుల ప్రభువని సర్వగణాలకు అధిదేవతని, సర్వాహ్లాదకరుడని, సర్వులకు జ్యేష్టుడని, అధినాయకుడని, ఉత్తమ కీర్తి సంపన్నుడని కీర్తించబడ్డాడు. గణపత్యధర్వ శీర్షోపనిషత్తులో గణపతి సర్వవ్యాప్తమైన పరబ్రహ్మ స్వరూపమని సృష్టి స్థితి లయములకు కారకుడని, సర్వ కార్యములకు సృష్టికి కర్త హర్త అని ఆనందమయుడని చిన్మయుడని, లంబోదరుడని, శూర్ప కర్ణుడు రక్తం గుడిగా అభివర్ణించారు. అటువంటి గణపతి సంకటాలను దూరం చేసేవాడని సంకట హరుడుగా పూజించడం అనాదిగా వస్తున్నదే. సంకటహరుని పూజించడానికి కృష్ణ పక్ష చతుర్థి ప్రసిద్ధి. సంకట హర చతుర్థి గురించి శ్రీకృష్ణుడు, ధర్మ రాజుకు వివరించినట్లు పురాణ కథనం.
సంకట హర చతుర్థి ప్రత్యేకత
కృష్ణ పక్ష చతుర్థి సంకష్టహర, సంకటహర చతుర్థి అంటారు. ఈరోజు దినమంతా ఉపవాస ముండి, సాయంత్రం , నిశి పూజ, చంద్రదర్శనానంతరం భోజనాలు చేయడం, నిర్దేశిత ఆచారం. ఇలా చేస్తే సకల కష్టాలు, సంకటాలు తొలగి పోయి, సంకట నాశకుడైన విఘ్న నాయకుని కృపకు పాత్రులు, జన్మరాహిత్యం , మోక్షం సిద్ధించి, సప్త జన్మలు అవసరం లేకనే శాశ్వత గణేశ లోక ప్రాప్తి కలుగనున్నట్లు పురాణాలు వివరిస్తున్నాయి. తలపెట్టిన పనులకు విఘ్నాలు కలుగుతూ అశాంతి, మానసిక, శారీరిక రుగ్మతలు, రుణ బాధలు, అనేక కష్టాలు కలుగుతున్నప్పుడు దుష్టగ్రహ పీడన నివారణ కొరకై ప్రతి నెలా సంకష్టహర చవితి నాడు యథాశక్తి విఘ్నేశ్వరుని పూజలు జరపడం సంప్రదాయం.
సంకట హర చతుర్థి నాడు కలశ, గణపతి పూజ, పుణ్యాహవాచనం, మహా గణపతి అధర్వ శీర్ష పూజలు, అభిషేకం, అష్టోత్తర అర్చనలు, నివేదన, హారతి, మంత్రపుష్పం, నీరాజన, తీర్థ ప్రసాద వితరణాది సాంప్రదాయక క్రతువులను నిర్వహించడం, భక్తుల గోత్రనామాదులతో ప్రత్యేక అర్చనలు, గణపతి ఉపనిషత్ యుక్త అభిషేకా దులను నిర్వహించు కోవడం, భక్తులు తమ స్వగృహాల లోనూ గణపతి పూజ లొనరించి రాత్రి చంద్ర దర్శనానంతరం అరగించడం సనాతన సంప్రదాయం. సంకష్ట చతుర్థి నాడు వినాయక వ్రతాచరణ ద్వారా కుజ దోష సమస్యలు తొలగి పోగలవని, సంకటాలన్ని తొలిగి సఫలత లభించగలదని వరం ప్రసాదించారని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి.
ఈశాన్య గణపతికి ప్రత్యేక పూజలు
శుక్ర వారం కృష్ణ పక్ష చతుర్థి సందర్భంగా
ధర్మపురి క్షేత్రంలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన అనుబంధ దేవాలయమైన శ్రీరామ లింగేశ్వర ఆలయ సంబంధిత ఈశాన్య గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి ఉపనిషత్తులతో అబిషేకం హరతి మంత్రపుష్పం కార్యక్రమంలు నిర్వహించారు. స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, గారు, దేవస్థానం ట్రస్ట్ బోర్డు అద్యక్షులు జక్కు రవీందర్, సభ్యులు, మాజి దేవస్థానం అధ్యక్షులు సంగన భట్ల దినేష్, సూపరింటెండెంట్ కిరణ్, వేదపండితులు పాలెపు ప్రవీణ్ కుమార్ శర్మ , స్థానిక వేదపండితులు మధు రామ శర్మ , అర్చకులు విశ్వనాథ శర్మ బొజ్జ సంపత్ కుమార్ రాజగోపాల్, ద్యావళ్ల సాయికుమార్ అధిక సంఖ్యలో భక్తులు గ్రామస్థులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి. -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి

దశాబ్దం తర్వాత నెరవేరుతున్న పేదల సొంతింటి కల

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి..

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు

గల్ఫ్ అడ్వైజరి బొర్డ్ కు చాంద్ పాషా విజ్ఞప్తి
