మావోయిస్టు ఉద్యమంలో ఒక కీలక అధ్యాయం - నంబాల
నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ... ఉద్యమ కెరటం
(రామ కిష్టయ్య సంగన భట్ల, సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్, కాలమిస్ట్...9440595494)
నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు భారతీయ విప్లవ రాజకీయ చరిత్రలో ఒక కీలక నేతగా గుర్తింపు పొందిన వ్యక్తి. జీవితాన్ని అజ్ఞాత రాజకీయాలకు అంకితం చేసిన ఆయన, అర్ధ శతాబ్దానికి పైగా మావోయిస్టు ఉద్యమానికి వ్యూహాత్మక నేతగా నిలిచాడు. ఆయన మరణం, మావోయిస్టు ఉద్యమానికి ఒక తలకిందుల మలుపుగా భావించ బడుతోంది.
ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేట గ్రామంలో జన్మించిన కేశవరావు, తన తండ్రి బడిపంతులు కావడంతో చిన్నతనంలోనే చదువుపట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. విద్యార్థి దశ నుంచే విప్లవ భావజాలాన్ని ఆకర్షణగా భావించిన ఆయన, వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్, ఎంసీఈలో ఎంటెక్ పూర్తిచేశాడు.1984లో విద్యార్థి జీవితంలోనే పీపుల్స్ వార్ గ్రూప్ సిద్ధాంతాలతో మమేకమై ఉద్యమంలోకి అడుగు పెట్టాడు.
ప్రారంభ దశలోనే నక్సలైట్ ఉద్యమ స్ఫూర్తి నాయకుడు కొండపల్లి సీతారామయ్య ప్రభావం అతనిపై గాఢంగా పనిచేసింది. పీపుల్స్ వార్ వ్యవస్థాపకుడిగా పేరొందిన కొండపల్లి సిద్ధాంతాలతో కేశవరావు దీర్ఘకాలం సహకారం కలిగి పనిచేశాడు. ఈ సమయంలోనే ఆయన మావోయిస్టు ఉద్యమంలో తానేర్పరచుకున్న స్థానం బలపడింది.
ఉద్యమ జీవితం ప్రారంభంలోనే ప్రజాసేవ, భూసంస్కరణ, సమానత్వం వంటి అభ్యుదయ లక్ష్యాల కోసం పోరాడే నేతగా గుర్తింపు పొందిన ఆయన, పీపుల్స్ వార్ గ్రూప్‌లో కీలక పాత్ర పోషించాడు. కాలక్రమేణ ఆ సంస్థలోని సెంట్రల్ మిలిటరీ కమిషన్‌లో చేరి, భద్రతా వ్యూహాల రూపకర్తగా ఎదిగాడు. గెరిల్లా యుద్ధ వ్యూహాలు, మొబైల్ వార్ ఫేర్ పద్ధతులు, అడవుల్లో రహస్యంగా శిక్షణా శిబిరాల ఏర్పాటు వంటి వ్యవస్థలను రూపొందించి ఉద్యమాన్ని మిలిటరీంగా శక్తిమంతం చేశాడు.
1990లో మావోయిస్టు మిలిటరీ కమిషన్‌లో చేరిన కేశవరావు, సెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యుడిగా ఆర్మ్‌డ్ స్ట్రగుల్ వ్యూహాలకు రూపకర్తగా నిలిచాడు. అడవుల్లో గెరిల్లా యుద్ధ పద్ధతులు, ఐఈడీల వినియోగం, ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ నిర్మాణం వంటి అంశాల్లో ప్రత్యేకమైన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అడవుల్లో మావోయిస్టు శక్తుల పునర్వ్యవస్థీకరణలో కీలక పాత్ర పోషించాడు.
2004లో మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిశన్‌జీ నేతృత్వంలోని మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ (ఎంసీసీ)తో పీపుల్స్ వార్ విలీనం అయ్యింది. దీంతో సీపీఐ (మావోయిస్టు) పార్టీ ఏర్పడింది. ఈ విలీనంలో బసవరాజు కీలక పాత్ర పోషించాడు. తదనంతరం కేశవరావు పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్‌లో కొనసాగుతూ రాజకీయ, సైనిక వ్యూహాల రూపకర్తగా ప్రసిద్ధి పొందాడు.
ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి విరమించిన అనంతరం, బసవరాజు ఆ పదవిని చేపట్టి, మావోయిస్టు ఉద్యమానికి అత్యున్నత నేతగా బాధ్యతలు నిర్వహించాడు.
భారత ప్రభుత్వం, కేంద్ర హోం శాఖ, ఎన్ఐఏ లకు బసవరాజు చాలా కాలంగా మోస్ట్ వాంటెడ్ నేత. అతని అరెస్ట్‌కు లేదా సమాచారం కోసం కోటి రూపాయలకు పైగా బహుమతి ప్రకటించ బడింది. చత్తీస్‌గఢ్‌లో 2010లో జరిగిన 76 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్ల హత్య కేసు, 2018లో విశాఖపట్నం జిల్లా అరకులో జరిగిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమా హత్య కేసుల వెనుక బసవరాజు కీలక మేథస్సుగా ఆరోపణలు వచ్చాయి. చెలామణి క్షేత్రాల్లో పేలుళ్లకు అవసరమైన ఐఈడీల తయారీ, ఆయుధాల సమీకరణ, విదేశీ సంబంధాల సృష్టి వంటి అంశాల్లోనూ బసవరాజు పాత్ర ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొంటాయి.
చాలా సంవత్సరాలుగా బసవరాజు అజ్ఞాత జీవితం గడుపుతూ, ప్రభుత్వ వ్యవస్థకు సవాలుగా మారాడు. ఎక్కడ ఉన్నాడు? బ్రతికే ఉన్నాడా? అనే ప్రశ్నలు గత పదేళ్లుగా మావోయిస్టు వర్గాలు, ప్రభుత్వ వర్గాలలోనూ విస్తృతంగా చర్చకు వచ్చాయి. కానీ, ఛత్తీస్‌గఢ్‌లో నారాయణపూర్ అడవుల్లో భద్రతా దళాల నిర్వహించిన భారీ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్‌లో బసవరాజు మరణించినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. ఆయనతోపాటు మరో 27 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు తెలిపింది. ఈ ఘటన మావోయిస్టు ఉద్యమానికి వ్యూహాత్మకంగా తీవ్రమైన దెబ్బగా భావించ బడుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ‘ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్’ ఎన్‌కౌంటర్‌లో నంబాల కేశవరావు మృతి చెందినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధృవీకరించి ట్వీట్ చేశారు.
ఈ ఘటన మావోయిస్టు ఉద్యమానికి తీవ్రమైన లోటుగా భావించ బడుతోంది. బసవరాజు మృతి, మావోయిస్టు పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపనున్నదన్నది విశ్లేషకుల అభిప్రాయం.
నంబాల కేశవరావు జీవితం విప్లవ రాజకీయాల పట్ల నిబద్ధత, ఉద్యమ పట్ల త్యాగబుద్ధి, వ్యూహాత్మక మేధస్సు కలగలిపిన ప్రత్యేక చరిత్ర. ఆయన మృతి మావోయిస్టు ఉద్యమంలో శక్తి నష్టం కలిగించినా, ఉద్యమాన్ని ఆవిర్భవింపజేసిన అసమానతలు, ఆదివాసీల దుస్థితి, సామాజిక అన్యాయ వ్యవస్థ వంటి కారణాలు మాత్రం ఇంకా సజీవంగానే ఉన్నాయి. మావోయిస్టు ఉద్యమాన్ని సమూలంగా నిర్మూలించే చర్యలు చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం పై అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి, తగు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం అనివార్యంగా ఉంది.
More News...
<%- node_title %>
<%- node_title %>
టెక్నాలజీ రంగంలో రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం

క్యూఆర్ కోడ్ & సిటీజన్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు రెండవ స్థానం, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు ఆరవ స్థానం.

మావోయిస్టు ఉద్యమంలో ఒక కీలక అధ్యాయం - నంబాల

మేడిపల్లి మండల కేంద్రంలో 2025 26 సం" నుండి నూతనంగా ఇంటర్ జూనియర్ కళాశాల ప్రారంభం

క్రికెట్ సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా చూడాలి.

కాంగ్రెస్ పార్టీలో ఇన్నిసార్లు ఓడిపోయిన వ్యక్తి ఒక్క జీవన్ రెడ్డి మాత్రమే ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

కాళేశ్వరం కమిషన్ నోటీసులు కాదు, కాంగ్రెస్ రాజకీయ కమీషన్ నోటీసులు - దావ వసంత సురేష్, జగిత్యాల జిల్లా తొలి ప్రజా పరిషత్ ఛైర్పర్సన్.

జగిత్యాలలో వయోవృద్ధులకు డే కేర్ కేంద్రం మంజూరు .

సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో తూనికలు,కొలతల దినోత్సవం.

ధనికుల దానం - సామాన్యులపై పెను భారం? ఫ్రీజర్ బాక్స్‌లపై ₹1000 వసూలు – ప్రజల్లో ఆగ్రహావేశాలు

ధర్మపురిలో హనుమాన్ జయంతికి ఏర్పాట్లు ముమ్మరం
