వేసవి సెలవుల దృష్ట్యా సహ పాఠ్యప్రణాళికలపై చిన్నారుల దృష్టి
జగిత్యాల మే 18 (ప్రజా మంటలు)
విద్యార్థులకు వేసవి సెలవులు రావడంతో పుస్తకాలకు స్వస్తి చెప్పి ఆటలకు శ్రీకారం చుడుతారు అయితే వేసవి సెలవుల దృష్ట్యా చాలావరకు తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువుకు సంబంధించిన విషయమే కాకుండా సహ పాఠ్యప్రణాళికలుగా స్విమ్మింగ్ లేదా డాన్సింగ్ కరాటే ,కంప్యూటర్ క్లాస్సెస్ తదితర విషయాలపై విద్యార్థులకు జ్ఞానం సమపార్జనకై తల్లిదండ్రులు మొగ్గుచూపుతున్నారు.
దీనిలో భాగంగా అమ్మాయిలు. అబ్బాయిలు అనే తేడా లేకుండా తమ పిల్లలకు ఆత్మస్థైర్యం రావడానికి పలువురు తల్లిదండ్రులు కరాటే తరగతులకు పంపుతున్నారు. దీంతో తమ పిల్లల్లో క్రమశిక్షణ పెరగడమే కాకుండా ఎండ వేడికి ఆరుబయట తిరగకుండా ఒక నిర్దిష్టమైన పనిలో ఉన్నట్లయితే ఆరోగ్య దృష్ట్యా కూడా ఉపయోగం ఉంటుందని భావనతో తమ చిన్నారులను కరాటే స్విమ్మింగ్ డాన్సింగ్ కంప్యూటర్ క్లాసెస్ పేరిట వారిలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపగలుగుతున్నారు.
సెలవులు తక్కువ సమయం ఉన్నప్పటికీ ఉన్న సమయాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసి తమ తమ పిల్లలను ఆయా శిక్షణ కేంద్రాలకు తీసుకువెళ్లి తిరిగి ఇంటికి తీసుకొస్తున్నారు.
నిత్యం పుస్తకాలతో కుస్తీ పడుతూ హోంవర్క్ లతో శారీరకంగా అలిసిపోయిన చిన్నారులకు ఈ కొత్త రంగాలు వారిలో ఒక నూతన ఉత్తేజం కలుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అంతేకాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలు పిల్లల్లో పెంచడానికి పురాణ, ఇతిహాస, కథలు ,పద్యాలు శ్లోకాలు, సంస్కృతిక రంగాల వైపు పిల్లలను దృష్టి మరల్చడానికి ఆయా సంస్థలు నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రాలకు తల్లిదండ్రులు తమ పిల్లలను పంపడానికి సుముకత చూపుతున్నారు. దీంతో నానాటికి అంతరించిపోతున్న మన సంస్కృతీ సాంప్రదాయాలు తిరిగి పునర్వైభవం రావడానికి ఎంతగానో దోహదపడతాయని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి. -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి

దశాబ్దం తర్వాత నెరవేరుతున్న పేదల సొంతింటి కల

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి..

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు

గల్ఫ్ అడ్వైజరి బొర్డ్ కు చాంద్ పాషా విజ్ఞప్తి
