పహాల్గమ్ " ఉగ్రదాడి తీవ్ర విచారకరం *తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ అధ్యక్షులు డాక్టర్ భూపేందర్ రాథోడ్
సికింద్రాబాద్ ఏప్రిల్ 28 ( ప్రజామంటలు):
జమ్మూ కాశ్మీర్ లోని "పహాల్గం" లో జరిగిన ఉగ్రదాడిని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ విభాగం, జుడా, టి .యన్.జి .ఓ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించారు. దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ భూపేందర్ రాథోడ్ మాట్లాడుతూ అభం శుభం తెలియని, విదేశీయులు, పర్యాటకులు మరణించడం దురదృష్టకరమని,భారత ప్రభుత్వం తక్షణమే దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ అధ్యక్షులు డాక్టర్ భూపేందర్ రాథోడ్ భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్ కుమారి, ప్రిన్సిపాల్ కత్తుల ఇందిర , డాక్టర్ శేషాద్రి, డాక్టర్ సునీల్ తదితరులు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ ప్రతినిధులు డాక్టర్ అబ్బయ్య, డాక్టర్ మురళిధర్,డాక్టర్ రవి, డాక్టర్ కళ్యాణ్, డాక్టర్ మదన్, డాక్టర్ సుబోధ్, డాక్టర్ రాజేష్ , డాక్టర్ వెంకట మణి, డాక్టర్ ఉపేందర్, డాక్టర్ రజని వివిధ శాఖల అధికారులు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రవి శేఖర్, డాక్టర్ వసంత్, డాక్టర్ కృష్ణ నాయక్, డాక్టర్ మురళీ కృష్ణ, డాక్టర్ సుధీర్, డాక్టర్ సందీప్ కుమార్ , డాక్టర్ బ్రహ్మేశ్వర, డాక్టర్ అనిల్, డాక్టర్ నాజిం, డాక్టర్ మీనాక్షి, డాక్టర్ సరిత, డాక్టర్ నవీన్, జూడ ప్రతినిధులు డాక్టర్ అజయ్, నర్సింగ్ ఆఫీసర్ ల సంఘం వైద్యులు నాయకులు, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థి విభాగం,వైద్య విద్యార్ధులు , వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా

పదో తరగతి ఫలితాలలో మోడల్ స్కూల్ గొల్లపల్లి విద్యార్థుల ప్రభంజనం
.jpg)
జగిత్యాల జిల్లాలో మహాత్మా జ్యోతి పూలే పాఠశాల ఉత్తమ ఫలితాలు

నిరాశ్రయులకు అండగా పావని *గొడుగులు, చెప్పుల పంపిణీ
