మేడిపల్లి మండల కేంద్రంలో 2025 26 సం" నుండి నూతనంగా ఇంటర్ జూనియర్ కళాశాల ప్రారంభం
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
మేడిపల్లి మే 21 (ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో 2025 -26 సంవత్సరం నుండి నూతనంగా జూనియర్ కళాశాల ప్రారంభోత్సవం నకు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్
బుధవారం రోజున జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో 2025-26 సంవత్సరమునకు నూతన జూనియర్ కళాశాల ప్రారంభించడం జరిగింది.
ప్రారంభ కార్యక్రమం లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శాసనసభ్యులు వేములవాడ నియోజకవర్గం పాల్గొన్నారు. .జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ మారుమూల ప్రాంతంలో మేడిపల్లి, భీమారం మండలంలో ని విద్యార్థులకు అన్ని సౌకర్యాలుగా ఉండేందుకు ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని మండల కేంద్రంలో కళాశాలలో వచ్చిన గ్రూపుల్లో అడ్మిషన్ తీసుకోవాలని అధ్యాపకులకు సూచించారు.
కళాశాలకు అవసరమైన కార్పస్ పండుకు గాను ఎమ్మెల్యే ఒక లక్ష రూపాయలు అందిస్తానని అన్నారు. ఒక ఎకరం భూమి కళాశాల నిర్మాణానికి రెవెన్యూ అధికారులు కేటాయించారని త్వరలోనే భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని అన్నారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కళాశాల భవనం నిర్మాణం అయ్యేంతవరకు స్థానిక జెడ్పిఎస్ఎస్ హైస్కూల్ తరగతుల నిర్వహణకు ఏర్పాటు చేస్తామన్నారు. అసంపూర్తి హై స్కూల్ నూతన భవనం వచ్చే మూడు నెలల్లో పూర్తి చేసేలా చూస్తామన్నారు. స్థానిక కళాశాలలో తమ పిల్లలను చేర్పించి కళాశాల విజయవంతంగా నడిచేటట్లు చూడాలని జిల్లా కలెక్టర్ అన్నారు .ఈ కళాశాలలో ఎంపీసీ, బైపిసి, సీఈసీ హెచ్ ఈ సి కోర్సులకు ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం లలో అప్లికేషన్లు చేసుకోగలరని సూచించారు
జిల్లా ఇంటర్మీడియట్ అధికారి. కళాశాల నిర్వాహకులు ప్రస్తుతం ప్రిన్సిపాల్ తో ఐదుగురు అధ్యాపకులు నియమించబడ్డారనీ మిగతా వారిని ఈ నెల ఆఖరి వరకు ఏర్పాటు చేస్తామని జిల్లా ఇంటర్ విద్యాధికారి బి నారాయణ తెలిపారు . నూతన కళాశాల. భవనముకు 4,70,000 రూపాయలు కార్పస్ ఫండ్ సమకూర్చారని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి తెలిపారు.
ఈ కార్యక్రమంలో కోరుట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి జివాకర్ రెడ్డి మేడిపల్లి మండల తహసిల్దార్ వసంత ఎంపీడీవో ఎంపీవో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి. -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి

దశాబ్దం తర్వాత నెరవేరుతున్న పేదల సొంతింటి కల

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి..

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు

గల్ఫ్ అడ్వైజరి బొర్డ్ కు చాంద్ పాషా విజ్ఞప్తి
