ఎవరిది గ్రంథాలయ చైర్మన్ పీఠం"?
"
జగిత్యాల జిల్లా గ్రంధాలయం చైర్మన్ పదవి ఎవరికో అని జగిత్యాల ప్రజలు గుస గుస లాడుతున్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి పీసీసీ కార్యదర్శి బండ శంకర్ పేరు సిపారసు చేయగా, ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సైతం తన వర్గం నుండి పీసీసీ సభ్యులు గిరి. నాగ భూషణం పేరు సిపారసు చేసినట్టు వినికిడి. ధర్మ పురి నుండి విప్ అడ్లూరి. లక్ష్మన్ కుమార్ అనుచరుడు సంగనబట్ల. దినేష్ సైతం చైర్మన్ పదవి కోసం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నట్లు కార్యకర్తలు, ప్రజలు బహిరంగమూగనే అనుకుంటున్నారు.
వీరందరి మధ్యలో మాజీ ఎన్ ఎస్ యు ఐ నాయకుడు, ప్రస్తుత పీసీసీ సేవాదళ్ కార్యదర్శి బీసీ సామాజిక వర్గానికి చెందిన
బోగోజీ. ముకేశ్ ఖన్నా సైతం గ్రంధాలయ చైర్మన్ పధవి కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ మధ్య నే సీఎం రేవంత్ రెడ్డి ని,పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,
మాజీ ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు బల్మూరి. వెంకట్ ని కలిసి అధిష్టానం దృష్టిలో తాను సైతం చైర్మన్ రేసు లో ఉన్నట్టు చెప్పకనే చెప్పినట్టు సమాచారం. 2007 నుండి ఎన్ ఎస్యూ ఐ లో జాతీయ, రాష్ట్ర స్థాయిలో విద్యార్థి ఉద్యమం లో పాల్గొని ఎన్నో కేసులు సైతం ఎదుర్కొని, అప్పటి టీ ఆర్ ఎస్ ప్రభుత్వం మీద పోరాటం చేసి జైలుకు వెళ్లి కొట్లాడిన నాయకుడి గా మంచి గుర్తింపు సైతం ఉండటంతో ముకేశ్ ఖన్నా పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.
ఏది ఏమైనా చివరకు జీవన్ రెడ్డి ఆశీస్సులు ఎవరికీ ఉంటాయో వారికా ?ప్రస్తుతం ఎమ్మెల్యే గా కాంగ్రెస్ లో కొనసాగుతున్న డా సంజయ్ కుమార్ వర్గీయునకా ? అన్న చర్చ కొనసాగుతున్నది. అంతే కాకుండా ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ కు అన్నిటాతానై ఉన్న సంగనభట్ల దినేష్ కు అవకాశం లేక పోలేదని చర్చలు కొనసాగుతున్నాయి.
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలోకి ప్రవేశించిన దరిమిలా ఆయనతోనే ఉంటూ పలు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న గిరినాగ భూషణంకు పార్టీలకు అతీతంగా గతంలో ఆయన మున్సిపల్ చైర్మన్గా వ్యవహరించిన తీరు అంతేగాక సౌమ్యుడుగా మంచి పేరు ఉన్న గిరి నాగభూషణం గ్రంథాలయ చైర్మన్ పదవికి ప్రత్యక్షంగా ఆయన ప్రయత్నాలు చేయనప్పటికీ ఎమ్మెల్యే సంజయ్ దృష్టిలో మొదటి నుండి గిరి నాగభూషణంకు అవకాశం కల్పించాలన్న ఆలోచన ఉన్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు.
ఇకపోతే యువజన కాంగ్రెస్ లో ఎన్నో సంవత్సరాలుగా జీవన్ రెడ్డికి నిరంతరం అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న బండ శంకర్ కు సైతం అవకాశాలు ఉంటాయని కాంగ్రెస్ శ్రేణుల్లోనే చర్చ కొనసాగుతుంది.
గ్రంథాలయ చైర్మన్ పదవి ఇప్పించుకొని తమ ఆధిపత్యం చూపించుకొని పై చేయి నిరూపించుకునే ప్రయత్నములో చైర్మెన్ పదవి నియామకం డోలాయ మానం లో పడింది. జగిత్యాల గ్రంధాలయ చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందని గాంధీ భవన్ వర్గాల మాటగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గుస గుస లాడుతున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా

పదో తరగతి ఫలితాలలో మోడల్ స్కూల్ గొల్లపల్లి విద్యార్థుల ప్రభంజనం
.jpg)
జగిత్యాల జిల్లాలో మహాత్మా జ్యోతి పూలే పాఠశాల ఉత్తమ ఫలితాలు

నిరాశ్రయులకు అండగా పావని *గొడుగులు, చెప్పుల పంపిణీ
