ధర్మపురిలో హనుమాన్ జయంతికి ఏర్పాట్లు ముమ్మరం
(రామ కిష్టయ్య సంగన భట్ల 9440595494).
ధర్మపురి క్షేత్రంలో హన్మాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిం చేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. వైశాఖ బహుళ దశమి హన్మాన్ జయంతిగా భావించ బడుతున్న ఆ సందర్భాన్ని పుర స్కరించుకుని ఏటా ధర్మపురి క్షేత్రస్థ దేవస్థానంలో సాంప్రదాయ రీతిలో స్వామి జయంతి వేడుకలను వైభ వంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో, మే 22
వ తేదీన గురు వారం దేవస్థానంలోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో, అలాగే గోదావరీ తీరస్థ గడ్డ హన్మాండ్ల ఆలయంలో జన్మదిన కార్యక్ర మాలను నిర్వహించడానికి
విస్తృత ఏర్పాట్లు గావిస్తున్నారు.
జయంతికి ఏర్పాట్లు ముమ్మరం
మే 22న ఆంజనేయ జయంతిని పురస్కరించుకుని, ఆంజనేయ ఆలయంలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమాలలో భాగస్వాము లయ్యేందుకు సుదూర ప్రాంత హన్మాన్ దీక్షాపరులు సాంప్రదాయా చరణలో భాగంగా విచ్చేయ నున్నారు. దేవస్థానం ఏసీ ఈఓ శ్రీనివాస్, చైర్మన్ జక్కు రవీందర్ నేతృత్వం లోని ధర్మ కర్తల మండలి సభ్యుల మార్గ దర్శకత్వంలో, దేవస్థాన సిబ్బంది పర్యవేక్షణలో, ఆలయ అర్చకులు వొద్దిపర్తి నర్సింహమూర్తి, కళ్యాణ్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలలో భాగంగా మూడు రోజుల పాటు పంచోపనిషత్ యుక్త ప్రత్యేక పూజలు, నీరాజన, మంత్రపుష్ప, తీర్ధ ప్రసాద వితరణాది కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వేలాది మంది హన్మాన్ భక్తులు మే 21నుండి 23 తేదీలలో హన్మాన్ దీక్షా విరమణలు చేయనున్నందున భక్తుల సౌకర్యార్ధం త్రాగు నీటి ఏర్పాట్లు, దేవస్థానం లోనా, బయటా చలువ పందిళ్ళు, విద్యుత్ దీపాలంకరణలు, తాత్కాలిక టెంట్లు, ప్రత్యేక క్యూలైన్ల లాంటి వసతుల మెరుగుదల చర్యలు గైకొంటున్నారు. అసంఖ్యాకులైన దీక్షాపరులు గత వారం రోజులుగా ఉదయం నుండే సుదూర ప్రాంతాల నుండి క్షేత్రానికి ఏతెంచి, పవిత్ర నదీ స్నానాలు ఆచరించి, దైవదర్శనార్ధం బారులుతీరి ప్రధానాలయం ముందు వేచి ఉంటున్నారు.
అలాగే క్షేత్రంలోని గోదావరీ తీరస్థ, భద్రా మరియు గోదావరీ నదుల సంగమ స్థానమైన ప్రదేశంలో, గోదావరి తీరాన్ని ఆనుకుని వెలసిన, హన్మాన్ గడ్డ పేరుతో సుపరిచిత మైన భక్తాంజనేయ దేవాలయంలో వంశపారంపర్య అర్చకులు మధ్వాచారి రాంకీషన్, పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఆంజనేయ జయంతి వేడుకలను ఏటా ఘనంగా నిర్వహించే క్రమంలో విస్తృత ఏర్పాట్లు గావిస్తున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి. -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి

దశాబ్దం తర్వాత నెరవేరుతున్న పేదల సొంతింటి కల

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి..

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు

గల్ఫ్ అడ్వైజరి బొర్డ్ కు చాంద్ పాషా విజ్ఞప్తి
