న్యూ బోయిగూడలో ఉగ్రమూలాలు. - ఉలిక్కిపడ్డ రైల్ కళారంగ్ కాలనీ
సమీర్ అరెస్ట్ తో భయాందోళనలో స్థానికులు
సికింద్రాబాద్ మే 19 (ప్రజామంటలు) :
బాంబు పేలుళ్ల కుట్రతో సంబంధం కలిగిన సూత్రధారులు దొరకడంతో సికింద్రాబాద్ లోని న్యూ బోయిగూడ రైల్ కళారంగ్ కాలనీ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగం సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ లో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
వారిలో ఒకరు ఏపీలోని విజయనగరం జిల్లా చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్, మరొకరు సికింద్రాబాద్ లోని న్యూ బోయిగూడ కు చెందిన సమీర్ (25) ఉన్నాడు. ఈనెల 16న (నాలుగు రోజుల క్రితం) మఫ్టీలో వచ్చిన పదిమంది కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం పోలీసులు బోయిగూడ రైల్ కళారంగ్ కాలనీ లోని నివాసం వద్ద సమీర్ ను అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం సమీర్ ఇంట్లో సోదాలు జరిపారు. అయితే తమ ఇంటికి వచ్చింది మఫ్టీలో ఉన్న పోలీసులు అని తెలియక గోపాలపురం పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన సమీర్ తల్లి సాబేరా, అక్క అలియా లు తమ సమీర్ ను ఎవరో తీసుకెళ్లారని ఫిర్యాదుచేశారు. తరువాత అసలు విషయం తెలియడంతో వాళ్ళు అవాక్కయ్యారు. తండ్రి చాలా ఏళ్ల క్రితం చనిపోవడంతో సమీర్ తన సొంత ఇంట్లో తల్లి సాబేరా, అక్క అలియా తో కలిసి ఉంటున్నాడు, పదవతరగతి వరకు చదివి, లిఫ్ట్ రిపేరింగ్ పని నేర్చుకొని వర్కర్ గా పనిచేస్తూ కుటుంబానికి అండగా నిలబడ్డాడు. బస్తీలో ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడకుండా, తన పని తాను చేసుకుంటూ ఉండే సమీర్ ఇలాంటి దేశ విద్రోహ కార్యకలాపాలకు ఆకర్షితుడవుతాడని తాము ఊహించలేదని బస్తివాసులు అంటున్నారు.
ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగిన సమీర్ ఇలా చేస్తాడని ఉహించలేదని వారు పేర్కొన్నారు. ఎప్పుడు పాతబస్తీకి చెందిన పలు బ్యాచ్ లతో కలసి ఇంట్లో సమావేశం అయ్యే వారని వారు పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బాంబు పెట్టేందుకు సమీర్ కుట్రపన్నాడని పోలీసులు తమతో చెప్పారని స్థానికులు తెలిపారు.
ఎప్పుడు తమ కాలనీ వాళ్ళతో సమీర్ తల్లి, సోదరి గొడవపడుతుంటారని, వారిని కాలనీ నుంచి ఖాళీ చేయించాలని స్థానికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశానికి నష్టం కలిగించే విద్రోహ చర్యలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని బస్తివాసులు డిమాండ్ చేస్తున్నారు. కాగా సమీర్ తల్లి సాబేరా, సోదరి అలియా లు ఇంటికి తాళం వేసి ఎటో వెళ్ళిపోయారని స్థానికులు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి. -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి

దశాబ్దం తర్వాత నెరవేరుతున్న పేదల సొంతింటి కల

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి..

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు

గల్ఫ్ అడ్వైజరి బొర్డ్ కు చాంద్ పాషా విజ్ఞప్తి
