డాక్టర్ ప్రతాప్‌రెడ్డి పార్థీవదేహం గాంధీ మెడికల్‌కాలేజీకే
ఆయనకు నివాళులు అర్పించిన వైద్యాధికారులు, సిబ్బంది.
రెండు రూపాయలకే వైద్యం అందించిన ప్రతాప్ రెడ్డి :
సికింద్రాబాద్ మే 19 (ప్రజామంటలు):
ఆదివారం కన్నుమూసిన గాంధీ వైద్య కళాశాల అలుమ్నీ అసోషియేషన్‌మాజీ అధ్యక్షుడు, స్టేట్ ఐఎంఏ మాజీ ప్రెసిడెంట్ డాక్టర్‌ప్రతాప్‌రెడ్డి (75) పార్థివదేహాన్ని వైద్య విద్యార్థుల పరిశోధనాల కోసం సోమవారం గాంధీ మెడికల్ కాలేజీ కి డోనేట్ చేశారు. అంతకు ముందు అలుమ్ని సెంటర్ హాలులో డాక్టర్ ప్రతాప్ రెడ్డి భౌతిక కాయం ప్రజల సందర్శనార్థం పెట్టారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుభాష్ రెడ్డి, కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ నందకుమార్ రెడ్డి, గాంధీ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే. ఇందిర, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రవి శేఖర్ రావు,ఫోరెన్సిక్ హెచ్ఓడీ ప్రొ.కృపాల్ సింగ్, గాంధీ అలుమ్ని అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జిఆర్. లింగ మూర్తి, కార్యదర్శి ఏవీ.రత్నం, జుడా అధ్యక్షుడు డాక్టర్ ఉదయ్ కుమార్ గౌడ్, అజయ్ తదితరులు ప్రతాప్ రెడ్డి భౌతిక కాయానికి నివాళిలర్పించారు.
అనంతరం గాంధీ వైద్య కళాశాల అనాటమీ విభాగం హెచ్ఓడీ, ప్రొఫెసర్ సుధారాణి, ప్రొఫెసర్ సుధాకర్ బాబు, ఎంపీహెచ్ఈవో వేణుగోపాల్ గౌడ్ లకు డాక్టర్ ప్రతాప్ రెడ్డి పార్థీవ దేహాన్ని అప్పగించారు.
రెండు రూపాయలకే వైద్యం అందించిన ప్రతాప్ రెడ్డి :
తన తండ్రి దివంగత డాక్టర్ ప్రతాప్ రెడ్డి మానవతా వాది అని, నిరంతరం పేదలకు వైద్య సేవ చేయడానికే విశేషంగా కృషి చేశారని ఆయన కుమారుడు శరత్ రెడ్డి అన్నారు. తన తల్లి, గైనకాలజిస్ట్ దివంగత డాక్టర్ శోభా రెడ్డితో కలిసి 1975లో కూకట్ పల్లిలో పీపుల్స్ హాస్పిటల్ ప్రారంభించి, కేవలం రెండు రూపాయలకే వైద్యం అందించారని తెలిపారు. 2017లో తన తల్లి మరణించారని, 2021 వరకు పీపుల్స్ హాస్పిటల్ కొనసాగిందని ఆయన చెప్పారు. ఆయన కోరిక మేరకు మరణాంతరం పార్థీవ దేహాన్ని గాంధీ వైద్య కళాశాలకు అప్పగించామని తెలిపారు.
––
–ఫొటో
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి. -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి

దశాబ్దం తర్వాత నెరవేరుతున్న పేదల సొంతింటి కల

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి..

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు

గల్ఫ్ అడ్వైజరి బొర్డ్ కు చాంద్ పాషా విజ్ఞప్తి
