బాసర ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ సంజీవ్ శర్మ పై దాడి బాధ్యులపై చర్యలకై
బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య డిమాండ్
• బాసర ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ సంజీవ్ శర్మ పై దాడినీ తీవ్రంగా ఖండిస్తున్నాం
• దాడి చేసిన వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలి
- టిబిఎస్ఎస్ఎస్ రాష్ట్ర కోశాధికారి డాక్టర్ సముద్రాల డిమాండ్
జగిత్యాల మే 18 (ప్రజా మంటలు)
నిర్మల్ జిల్లాలోని పవిత్ర బాసర ఆలయ ప్రధానఅర్చకులు బ్రహ్మశ్రీ సంజీవ్ శర్మ పై జరిగిన దాడిని తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య (టిబిఎస్ఎస్ఎస్) పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ సంఘ రాష్ట్ర కోశాధికారి డాక్టర్ సముద్రాల విజయసారధి తెలిపారు.
ఆదివారం జగిత్యాల జిల్లా పర్యటనకు విచ్చేసిన సందర్భంగా స్థానిక బ్రాహ్మణ సంఘ బాధ్యులతో కలిసి ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు మీడియాతో మాట్లాడారు. దైవసేవలో నిమగ్నమైన బ్రాహ్మణ పూజారి సంజీవ్ పై దాడి చేయడం అమానుషమని, మరొక మారు ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని కోరారు. ఈ దాడికి సంబంధించిన పూర్వపరాలు పరిశీలించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని అర్చకులపై దాడి చేసిన వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని డాక్టర్ సముద్రాల విజయసారథి కోరారు.
ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు .అంతే కాకుండా బ్రాహ్మణులను అవహేళన పరిచే విధంగా వ్యవహరిస్తున్న వారిపై శిక్షించడానికి ప్రత్యేక చట్టం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
మీడియా సమావేశంలో టీబీఎస్ఎస్ యువ నాయకులు గోవర్ధనగిరి ధీరజ్ కృష్ణమాచారి, నమిలకొండ యశస్వి భరద్వాజ్, జగిత్యాల బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు చాకుంట వేణు మాధవరావు సిరిసిల్ల రాజేంద్ర శర్మ తదితరులు ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి. -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి

దశాబ్దం తర్వాత నెరవేరుతున్న పేదల సొంతింటి కల

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి..

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు

గల్ఫ్ అడ్వైజరి బొర్డ్ కు చాంద్ పాషా విజ్ఞప్తి
