ప్రతి ఒక్కరికీ "చుట్టంలా ఉండే చట్టం' భూ భారతి చట్టం*
గొల్లపల్లి మే 17 (ప్రజా మంటలు):
*రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి నూతన రెవెన్యూ చట్టం అమలులో బాగంగా ధర్మపురి నియోజకవర్గంలోని బుగ్గారం మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నేపథ్యంలో శనివారం రోజున బుగ్గారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన భూ భారతి సదస్సు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ తో కలిసి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ,జిల్లా కలెక్టర్,జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రైతులు నుండి ఇట్టి చట్టం పైన ఉన్న సందేహాలను,సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకొని అట్టి ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.అనంతరం ఇట్టి చట్టం కింద పరిష్కరించిన పలు సమస్యలకు సంబంధిచిన ప్రొసీడింగ్స్ కాపీలను దరఖాస్తుదారుల అందజేసారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూవిప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.ఖమ్మం గడ్డపైన అప్పటి ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శ్రీనివాస్ రెడ్డి నిర్వహించిన సభ తర్వాత కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం రావడం జరిగిందనీ,ఎన్నికల్లో గెలిచిన ఓడిన నిరంతరం ప్రజల మధ్య ఉండటం జరిగిందని,ఒక దళిత వర్గం నుండి జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా ఎస్సీ కార్పరేషన్ చైర్మన్గా ఎమ్మెల్యేగా,విప్ గా ఈ హోదాలో కొనసాగడం జరుగుతుందని,ఇటీవల గోదావరిలో నీటి మట్టం తక్కువ ఉన్నందున గోదావరిలో నీటిని విడుదల చేయాలని సీఎం దృష్టికి, మంత్రివర్యులు ఉత్తం కుమార్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే వారు స్పందించి ఇరిగేషన్ అధికారులతో కలిసి సమావేశం నిర్వహించి జీవన్ రెడ్డి తో కలిసి వెళ్ళి నీటిని విడుదల చేయించడం జరిగిందని తెలిపారు.
లిఫ్ట్ ల మీద అదరపడి సాగు చేసుకునే రైతాంగానికి మేలు జరిగే విధానంగా వాటిని మరమ్మతులు చేయించి వాటి నిర్వహణ కూడా ప్రభుత్వమే నిర్వహించే బాధ్యత తీసుకోవాలని ఉత్తం కుమార్ రెడ్డి ని కోరడం జరిగిందనీ,తలపున గోదావరి ఉన్న ధర్మపురి ప్రాంతానికి నీటిని అందించకుండా అదనపు టీఎంసీ పేరిట వెల్గటూర్ మండలానికి చెందిన ఎంతో విలువ గల రైతుల భూములను లాకున్న అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్ కనీసం పట్టించుకోలేదనీ,ధర్మపురి ప్రాంతానికి సంబంధించి 6 మండలాలు ఉంటాయని,ఇక్కడ రెవెన్యూ పరంగా కొంత ఇబ్బందులు ఉన్నాయని,కావున రెవెన్యూ డివిజన్ ఏర్పాటూ చేయాలని,అదే విధంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని కూడా ధర్మపురిలో ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు.
మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గమాట్లాడుతూ.
చాలా సుదీర్ఘమైన కష్ట నష్టలు ఎదుర్కొని ఎటువంటి ఇబ్బందులు ఉన్న కష్టాన్ని దిగమింగుకొని,మంత్రి హోదాలో కొప్పుల ఈశ్వర్ ఉన్న కూడా లక్ష్మణ్ కుమార్ ప్రజలు గెలిపించుకోవడం జరిగిందనీ,దొర మధ్య ఒక నలుగురు కలిసి రూపించింది ధరణి ఐతే ప్రజలతో,అధికారులతో చర్చించి అద్భుతంగా రూపించిందింది భూ భారతి చట్టం అని,ప్రతి ఒక్కరికీ చుట్టంల ఉండే చట్టం భూ భారతి చట్టమని,మొదటి సారిగా రెవెన్యూ అధికారులను ప్రజల వద్దకే పంపి భూ సమాస్యలను పరిష్కరించడం జరుగుతుందని,ఏ అధికారులైన ఉద్దేశ పూర్వకంగా తప్పు చేస్తే వారి పైన చట్ట పరంగా చర్యలు తీసుకునే విదంగా చట్టంలో పొందు పర్చడం జరిగిందని,గత ప్రభుత్వంలో సదా బైనామలు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రచారం చేశారు కానీ,అది ఆచరణలో అమలు కాలేదని,ధరణి కారణంగా జరిగిన పొరపాట్లను తిరిగి పరిష్కరించే విధంగా ఈ పోర్టల్ను ఏర్పాటు చేయడం జరిగిందనీ,మీకు సంబంధించి ఏటువంటి తప్పు జరిగిన దాన్ని మీ పై అధికారికి దరఖాస్తు చేసుకొనే అవకాశం ఇవ్వడం జరిగిందనీ,ఏ రైతు అన్న స్వచ్ఛందగా సర్వే చేయించుకున్న అట్టి మ్యాప్ ను కూడా పాస్ బుక్కులో నమోదు చేయడం జరుగుతుందనీ,దీని గురించి ప్రత్యేకంగా 6 వేల మంది సర్వేయర్లకు లైసెన్స్ ఇచ్చి నియమించడం జరుగుతుందనీ,గతంలో వంశ పరాపర్యంగా వచ్చిన భూమిని మ్యుటేషన్ చేసుకునేందుకు 30 రోజులు గడువును ఇచ్చి మ్యుటేషన్ ఇవ్వడం జరుగుతుందనీ,ప్రభుత్వ భూములను కబ్జాదారుల ఇవ్వకుండా అధికారులు పనిచేయాలని ఆదేశిస్తున్నామని,రైతులు ఏదైనా ఆవసరం కోసం వస్తే అధికారులు చిదరించుకోకుండా అట్టి సమస్యలను పరిష్కరించాలని,ఎండపెల్లి ఎమ్మార్వో ఆఫీస్ కు పక్క భవనం లేదని నా దృష్టికి తీసుకురావడం జరిగిందని దాని శాంక్షన్ చేస్తున్నామని,అందరి అభిప్రాయాలకు అనుగుణంగా ఒక్క రెవెన్యూ డివిజన్ ప్రభుత్వం నుండి మంజూరు చేస్తే అది ధర్మపురికి వచ్చే విధంగా నేను చూస్తాననీ,సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని కూడా ధర్మపురిలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.
రేవంత్ రెడ్డి సూచన మేరకు ఈ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లలని,పేదవారికి ఇచ్చిన హామీలను ముందు నెరవేర్చే విధంగా ముందుకు వెళ్లడం జరుగుతుందనీ,డబ్బులు ఉన్న లేకున్న తల తాకట్టు పెట్టీ అయినా ఇల్లు కట్టుకుందాం అనే వారికి ఇళ్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలిపారు
ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు వివిధ శాఖల అధికారులు వివిధ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్, ముస్కు నిశాంత్ రెడ్డి, శైలేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
త్వరలో కొత్త పార్టీ, తెలంగాణ హక్కుల కోసం పోరాటం : తిరుమలలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు –
అలిపిరి మార్చ్ 05 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. గురువారం సాయంత్రం అలిపిరి నుంచి కుటుంబ సభ్యులు, జాగృతి నాయకులతో కలిసి మెట్ల మార్గం ద్వారా బయలుదేరిన ఆమె రాత్రి సుమారు 10 గంటల సమయంలో తిరుమలకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం... జగిత్యాలలో నవోదయ విద్యాలయం ఏర్పాటులో ఎమ్మెల్యే నిర్లక్ష్యం – ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు
జగిత్యాల మార్చ్ 05, (ప్రజా మంటలు):
జగిత్యాల నియోజకవర్గ కార్యాలయం “కమల నిలయం”లో జరిగిన మీడియా సమావేశంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నాగ శ్రావణితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరవింద్ జగిత్యాలలో నవోదయ విద్యాలయం స్థాపనకు అవసరమైన భూమి కేటాయింపు అంశంపై రాష్ట్ర... జగిత్యాలలో బీజేపీ నేత బోగా శ్రావణి ఇంటిపై దాడి
జగిత్యాల, మార్చి 05 (ప్రజా మంటలు):
జగిత్యాలలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగా శ్రావణి ఇంటిపై కొందరు దాడి చేసి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. బీజేపీ నుండి సస్పెండ్ అయిన కొంతమంది నాయకులు ఆమె ఇంటి వద్దకు చేరుకుని హంగామా చేశారు.ఇంటి ముందు ఏర్పాటు చేసిన కుర్చీలు, టెంట్‌ను ధ్వంసం చేయడంతో పాటు... జగిత్యాల సూర్య గ్లోబల్ స్కూల్లో అట్టహాసంగా విద్యార్థుల స్పోర్ట్స్ మీట్
జగిత్యాల మార్చి 5 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని సూర్య గ్లోబల్ స్కూల్ లో “చాంపియన్స్ చాలెంజ్” పేరిట స్పోర్ట్స్ మీట్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
క్రీడలు శారీరక దృఢమే కాకుండా మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి
ఈ కార్యక్రమానికి ముఖ్య... సిలిగురి ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం (UT) ప్రతిపాదన?
న్యూఢిల్లీ మార్చ్ 05:
భారతదేశానికి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్ ప్రాంతాన్ని ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా (Union Territory) మార్చే ప్రతిపాదనపై రాజకీయ, వ్యూహాత్మక వర్గాల్లో మళ్లీ చర్చ మొదలైంది. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా బిహార్ సరిహద్దు ప్రాంతాల్లో మూడు రోజుల పర్యటన నిర్వహించడం ఈ చర్చలకు మరింత... సైకత వెంకటేశ్వర స్వామి సన్నిధిలో హోలీ వేడుకలు
జగిత్యాల మార్చి 4 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రం కరీంనగర్ రోడ్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ స్థలంలో, గత నెల 5వ తేదీన స్థాపించిన 21 అడుగుల ఎత్తైన సైకత శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, నిర్వాహకులు వేముల ఉమారాణి, కొండ్ర రమాదేవి,గార్లు బుధవారం హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఒకరికొకరు రంగులు పులుము మల్యాల మండలంలో పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత
మల్యాల మార్చి 4 ( ప్రజా మంటలు)ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా బుధవారం మల్యాల మండలంలో పరీక్ష కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత పరిశీలించారు.
పరీక్షా కేంద్రంలో నిర్వహణ విధానం, ప్రశ్నపత్రాల భద్రత, హాల్ టికెట్ల పరిశీలన ప్రక్రియలను ప్రత్యేకంగా పరిశీలించారు.
ఈ సందర్బంగా జిల్లా అదనపు కలెక్టర్... కల్వకుంట్ల కవిత అరెస్ట్ : నర్సింగిలో అక్రమ కట్టడాలకు వ్యతిరేక ఆందోళన
హైదరాబాద్ మార్చ్ 03 (ప్రజా మంటలు):నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించి అక్రమంగా నిర్మిస్తున్న భవనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్థానికులతో కలిసి ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి ధర్నాకు దిగారు.
హైడ్రా బుల్డోజర్లు అక్కడికి వచ్చే వరకు ఆందోళన విరమించబోమని కవిత బైఠాయించారు.... నర్సింగిలో మూసీ ఆక్రమణపై కవిత ఆందోళన – అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై చర్యలు డిమాండ్
హైదరాబాద్, మార్చ్ 03 (ప్రజా మంటలు):
హైదరాబాద్ పరిధిలోని నర్సింగిలో మూసీ నదిని ఆక్రమించి నిర్మిస్తున్న భారీ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కల్వకుంట్ల కవిత స్థానికులతో కలిసి ఆందోళన చేపట్టారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా ఆమె ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో పేదల... ధరూర్ క్యాంపు వాకర్స్ అసోసియేషన్ హోలీ సంబరాల్లో పాల్గొన్న తొలి జెడ్పి చైర్ పర్సన్ వసంత
జగిత్యాల మార్చి 3(ప్రజా మంటలు) పట్టణ ధరూర్ క్యాంప్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఐల్నేని వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ సంబరాల కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా తొలి జడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్ .
శాంతికి, సౌభ్రాతృత్వానికి ప్రతీక హోలీ అని,అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసే వేడుక,ఈ రంగుల పండుగ... జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు
జగిత్యాల మార్చి 3 (ప్రజా మంటలు)జిల్లా ప్రజలకు ,పోలీసు అధికారులకు, సిబ్బందికి హోలీ పండుగ శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జిల్లా పోలీస్ కార్యాలయంలో హోళీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పోలీస్ అధికారులు మరియు సిబ్బంది తో ఉత్సహంగా, సంతోషంగా హోళీ వేడుకలు నిర్వహించడం జరిగింది.
హోళీ సందర్భంగా... దుబాయ్ నుంచి తొలి ప్రత్యేక విమానం – 149 మంది ఢిల్లీకి చేరిక
న్యూ ఢిల్లీ మార్చి 03 (ప్రజా మంటలు):
పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో Air India దుబాయ్ నుంచి ఢిల్లీకి తొలి ప్రత్యేక విమానాన్ని నడిపింది. ఇందులో షేటిల్ బాడ్మెంటను క్రీడాకారిణి పీవీ సింధు తో పాటు ప్రముఖులు ఉన్నారు.
AI916D ఫ్లైట్ ద్వారా 149 మంది భారతీయులు సురక్షితంగా ఢిల్లీ Indira Gandhi International... 