ఘనంగా శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవ ముగింపు
గొల్లపల్లి ఎప్రిల్ 24 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలంలోని భీమ్రాజు పల్లి గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి ప్రధమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవములు బ్రహ్మశ్రీ అత్తులూరి బాల శంకర్ శాస్త్రి, నాగుల మల్యాల వీరాచార్యులు కరకముల చేతుల మీదుగా ఆలయ ధర్మకర్త చింతపండు తిరుపతిరెడ్డి, శశికళ దంపతులు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి గురువారం శ్రీ అభయాంజనేయ స్వామి వారికి అభిషేకం, బొడ్రాయికి గ్రామస్తులంతా జలాభిషేకం, మహా కలశం పూజ, పుణ్యాహవాచనం, సర్వదేవతావాహనం, అష్టోత్తర శతకలశ దేవతా ఆవాహనం, అగ్ని ప్రతిష్టాపన హోమాలు, పూజలు వైభవంగా జరిగాయి. వేద పండితులకు ఘనంగా సన్మానం చేశారు.

షీలా అశోకు కళావతి దంపతులు అన్నదానం చేశారు.సాయంత్రం శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఉత్సవ ఊరేగింపు కన్నుల పండువగా సాగింది ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జెసి కందుకూరి కృష్ణారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ బొమ్మెన కుమార్, వైస్ చైర్మన్ సింగారం మహేష్, సభ్యులు కంది స్వామి, సింగారపు లచ్చయ్య, రేవెల్ల సత్తయ్య, పొట్ట తిరుపతి, చింతల మల్లేష్,మాజీ ఉపసర్పంచ్ దూస రవి, సామల జనార్ధన్ , కిరణ్,రేవెల్ల గంగయ్య, బ్రాహ్మణులపల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
తెలుగు భాషా ఫోరం ఆధ్వర్యంలో పద్య పఠన పోటీలు
జగిత్యాల ఆగస్ట్ 29(ప్రజా మంటలు)జిల్లా భాషోపాధ్యాయులు మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాషకు ఆయుపట్టు పద్యం. తెలుగు భాషా సొగసుకు శిఖరాగ్రమైన ప్రక్రియ పద్య సాహిత్యం. పై అంశాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా డీఈవో కె.రాము అనుమతి తీసుకుని, తెలుగు భాషా ఫోరం లెటర్ ప్యాడ్... డ్యూటీలో ఉన్న తమ్ముడికి రాఖీ కట్టిన అక్క
కరీంనగర్, ఆగస్టు 28 (ప్రజా మంటలు):
రక్షాబంధన్ సందర్భంగా కరీంనగర్ జిల్లాలో అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే సంఘటన చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న తమ్ముడి వద్దకు వెళ్లిన అక్క రోడ్డుపైనే బస్సును ఆపించి రాఖీ కట్టింది.గోదావరిఖని నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు డ్రైవర్ మెండ రాజు తిమ్మాపూర్ మండలం రేణికుంట... వైకుంఠ ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ మంత్రి గోడిసెల రాజేశం గౌడ్
హైదరాబాద్, ఆగస్టు 28 (ప్రజా మంటలు):
నాంపల్లిలోని రామ్ ప్రతాప్ పిట్టి భవన్లో ఉన్న లక్ష్మీనారాయణ స్వామి బాలాజీ మందిరంలో ప్రముఖ వ్యాపారవేత్త ప్రమోద్ అగర్వాల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఉత్సవాల్లో మాజీ సీనియర్ మంత్రి, మాజీ తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గోడిసెల రాజేశం గౌడ్ పాల్గొన్నారు. ఆగస్టు 25 నుంచి 30వ... వేతన చెల్లింపులో జాప్యంపై మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం
ఫారమ్–16 జారీ, జాప్యానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సిఫార్సు
హైదరాబాద్ ఆగస్ట్ 28 (ప్రజా మంటలు):
ఉద్యోగికి సకాలంలో వేతనం చెల్లించకపోవడం, ఆదాయపు పన్నుకు సంబంధించిన పత్రాలు అందించడంలో జాప్యం చేయడం మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించిన అంశమేనని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పష్టం చేసింది.... అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉపాకర్మ
జగిత్యాల ఆగస్టు 28(ప్రజా మంటలు)శ్రావణ పౌర్ణమి పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి శ్రీరామ మందిరం ఆవరణలో గల తిరుమల తిరుపతి దేవస్థానం ధ్యాన మందిరంలో ఉపాకర్మ కార్యక్రమం నిర్వహించారు. దేవతర్పణము ఋషితర్పణము పితృతర్పణాల అనంతరం హోమము నిర్వహించారు. .
నూతన యజ్ఞోపవీత ధారణ అనంతరం సభాపతి తిగుళ్ళ విశ్వనాథ శర్మ ఉపాకర్మ ప్రత్యేకత... గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉపాకర్మ వేడుకలు
జగిత్యాల ఆగస్టు 28 (ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో గల శ్రీ రామాలయంలో విద్యానగర్ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉపాకర్మ ఘనంగా నిర్వహించారు. హోమము తర్పణాలు నిర్వహించి నూతన యజ్ఞోపవీత ధారణ చేశారు.
కార్యక్రమంలో గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు కొలిచాల రవీందర్ వైదిక క్రతువు అన్యారంభట్ల నారాయణ... సోదర సోదరి అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్
జగిత్యాల ఆగస్టు 27 (ప్రజా మంటలు) రక్షాబంధన్ పండుగ శ్రావణమాసం పౌర్ణమిలో జరుపుకుంటాము. వైదికంగా జంధ్యాల పౌర్ణమిగా దీనినే రాఖీ పౌర్ణమి గా భావిస్తారు. రాఖీ పౌర్ణమి కి ప్రత్యేక విశిష్టత ఉంది. సోదరీలు తమ సోదరులకు రక్షాబంధనం చేసి తమ ఆత్మీయతను ఆవిష్కరిస్తారు.
పౌర్ణమి శుక్రవారం ఉన్నప్పటికీ తక్కువ సమయం ఉండడం అదేవిధంగా... ఉచిత పోలీస్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి.. జగిత్యాల రూరల్ సిఐ దామెర సుధాకర్.
జగిత్యాల, ఆగస్టు 27( ప్రజా మంటలు) ఉచిత పోలీస్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
కృషి పట్టుదల ఉంటే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతామని జగిత్యాల రూరల్ సిఐ దామెర సుధాకర్ అన్నారు.వాల్మీకి ఆవాసం సేవా భారతి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత పోలీసు శిక్షణ శిబిరాన్ని రూరల్ సీఐ సుధాకర్ సందర్శించి అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. ... మౌంట్ కార్మెల్ హైస్కూల్ లో ఘనంగా రక్ష బంధన్ వేడుకలు
జగిత్యాల ఆగస్ట్ 27(ప్రజా మంటలు)
ధరూర్ లోని *మౌంట్ కార్మెల్ హైస్కూల్* లో రక్ష బంధన్ వేడుకలు అత్యంత ఘనంగా సాంప్రదాయ పద్ధతిలో పాఠశాల యాజమాన్యం నిర్వహించారుఈ సందర్భంగా పాఠశాల బాలికలు పాఠశాలలోని బాలురకి రాఖీలు కట్టి *నువ్వు నాకూ రక్ష నేను నీకు రక్ష మనం దేశానికి రక్ష* అని నినదించారు.
పాఠశాల... ఘనంగా శ్రీదేవి భూదేవి సహిత శ్రీనివాసునీ కళ్యాణం జగిత్యాల ఆగస్టు 26 (ప్రజా మంటలు)
జిల్లా కేంద్రం కూరగాయల మార్కెట్ లోని శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో శ్రీదేవి భూదేవి సహిత శ్రీనివాసుని కళ్యాణం వైభవో పెతంగా ఘనంగా జరిగింది .ఉదయం నుండి భక్తులు తండోపతండాలుగా ఆలయానికి చేరుకొని స్వాములను దర్శించుకున్నారు. కళ్యాణానికి వందలాది మంది భక్తులు హాజరైనారు. అనంతరం వచ్చిన భక్తులందరికీ, నిర్వాహకులు అన్న ప్రసాదం అందించారు.... మా స్పోర్ట్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ (ఎంఎస్ ఆర్ డి ఎఫ్) ఆధ్వర్యంలో 200 మొక్కలు నాటే కార్యక్రమం
సారంగాపూర్ 26(ప్రజా మంటలు)పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా సారంగాపూర్ రంగపేట గ్రామంలో మా స్పోర్ట్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ (ఎం ఆర్ ఎస్ డి ఎఫ్) ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన 200 మొక్కలు నాటే కార్యక్రమం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో, విజయవంతంగా ముగిసింది. ఈ హరిత యజ్ఞంలో ఫారెస్ట్ అధికారులు, గ్రామ ప్రజలు, యువకులు... జగిత్యాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డిని కోరిన ఎమ్మెల్యే సంజయ్
హైదరాబాద్, ఆగస్టు 26 (ప్రజా మంటలు):
విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డిని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్‌కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
అర్బన్ హౌసింగ్ కాలనీలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన... 