వాస్తవాలను తెలుసుకోకుండా సోషల్ మీడియా పోస్టులను ఫార్వర్డ్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం జగిత్యాల డీఎస్పీ రఘు చందర్
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల ఏప్రిల్ 26(ప్రజా మంటలు)
సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టే వారిపై, వాస్తవాలను తెలుసుకోకుండా అట్టి పోస్టులను ఫార్వర్డ్ చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని డిఎస్పీ రఘు చందర్ తెలిపారు.
సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజ నిజాలు తెలుసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో అట్టి మెసేజ్లను ఫార్వర్డ్ చేయకూడదని సోషల్ మీడియా పై జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సోషల్ మీడియా విభాగం ప్రతి పోస్టు ను నిశితంగా పరిశీలించడం జరుగుతుందని అన్నారు. కొందరు ఇతర దేశాలలో ఉంటూ సోషల్ మీడియాలో ఏం చేసినా తమకేం కాదన్న ధీమాతో సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులు పెడుతున్నారని.. అలాంటి వారిపైనా కేసులు నమోదు చేసి లుక్ అవుట్ నోటీసులు జారీ చేసి పాస్ పోర్టులు, వీసాలను కూడా రద్దు చేయించొచ్చని చెప్పారు. ఇప్పటికే ఇలాంటి పోస్టులను వాట్సాప్ మరియు ఫేస్బుక్ ల ద్వారా చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేయడం జరిగింది అని తెలిపారు. కావున సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టుల పై ఎలాంటి అనుమానలు , సందేహాలు ఉన్న జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని సంప్రదించాలని ప్రజా భద్రత ,లా & ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా ప్రజలు శాంతి యుత జీవనం గడిపేలా చూడడం జగిత్యాల జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీసాయి సప్తాహం ముగింపువేడుకలు

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి

నేడు అధికారభాష హిందీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు

కిమ్స్-సన్షైన్ హాస్పిటల్స్, బేగంపేటలో కేవలం 3 నెలల్లో 50 రోబోటిక్ సర్జరీలు

ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి

ఆరోగ్యవంతులైన బాలికలే దేశ భవిత

మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్

కొండగట్టు 30.వ.గిరిప్రదక్షిణ ఆదివారం మద్యం, మాంసం మానేద్దాం'

కేజీవీలతో ట్రాక్టర్లు తారు రోడ్డుపై తిరిగితే కేసులు నమోదు - ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

షిరిడి సాయి మందిరంలో ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు

జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘ్ అధ్యక్షునిగా చీటీ శ్రీనివాస్ రావు
