హిరోషిమా శాంతి స్మారకాన్ని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు
హిరోషిమా ఉప గవర్నర్ తో భేటీ
హిరోషిమా ఏప్రిల్ 22:
జాపాన్‌లోని హిరోషిమా రాష్ట్రం - తెలంగాణ రాష్ట్రాల మధ్య పలు రంగాల్లో భాగస్వామ్యం, సహకారం దిశగా కీలక చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం హిరోషిమా రాష్ట్ర ప్రభుత్వ (Hiroshima Prefecture) వైస్ గవర్నర్ మికా యొకోటా (Mika Yokota) తో సమావేశమై పలు అంశాలను చర్చించింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్‌లోని ప్రసిద్ధ హిరోషిమా శాంతి స్మారకాన్ని (Hiroshima Peace Memorial) సందర్శించారు. 1945 రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమాపై జరిగిన అణుబాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయినవారికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు.
నాటి అణుబాంబు విధ్వంసంలో నిలిచిన ఏకైక శిథిలం అటామిక్ బాంబ్ డోమ్ (Atomic Bomb Dome)ను కూడా సందర్శించారు. ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రి శ్రీధర్ బాబు గారు, అధికారులు నివాళర్పించిన వారిలో ఉన్నారు.
పర్యావరణ సాంకేతికత, వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి, చెత్త నిర్వహణ, మురుగునీటి శుద్ధి, పునరుత్పాదక శక్తి అభివృద్ధి వంటి అంశాలపై దృష్టి సారించారు. అలాగే పట్టణాభివృద్ధిలో భాగంగా విపత్తు నిరోధక నిర్మాణాలు, భూగర్భ మెట్రో ఇంజనీరింగ్, స్మార్ట్ సిటీ పరిష్కారాల్లో హిరోషిమా అనుసరిస్తున్న సాంకేతిక నైపుణ్యాన్ని హైదరాబాద్‌లో ఉపయోగించే అవకాశాలపై చర్చలు జరిగాయి.
తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్, అధునాతన తయారీ కేంద్రాల ఏర్పాటుతో పాటు పారిశ్రామిక రంగంలో సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో "హిరోషిమా-తెలంగాణ ఆటోమోటివ్ & మొబిలిటీ కారిడార్" ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు మరియు హిరోషిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మధ్య విద్య, విజ్ఞాన మార్పిడి, సంయుక్త పరిశోధనలకు సహకారం అందించేందుకు ప్రణాళికలు రూపొందించాలని అభిప్రాయపడ్డారు.
శాంతి ఉద్యానవన అభివృద్ధి, బౌద్ధ వారసత్వ సంపద పరిరక్షణ, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలపై ఇరు రాష్ట్రాల మధ్య సహకారం పెంపొందించుకోవాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, హిరోషిమా ప్రభుత్వం అందించిన ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపారు. శాంతి, స్థిరత్వం, సాంకేతిక పురోగతిలో హిరోషిమా సాధించిన విజయాలను ప్రశంసించారు. శాంతి, సుస్థిరత కోసం ప్రపంచంతో సహకారానికి తెలంగాణ కట్టుబడి ఉంటుందని ఉద్ఘాటించారు.
తెలంగాణ-హిరోషిమా మధ్య పలు రంగాల్లో సహకారానికి విస్తృత అవకాశాలున్నాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కార్మిక చట్టాలు ఉపయోగించుకుంటేనే ప్రయోజనాలు -సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు

ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
.jpg)
గ్రూప్-1,గ్రూప్-3 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి కృషి చేసిన అదనపు ఎస్పీ కి ప్రసంశ పత్రం

నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి : జిల్లా ఎస్పి అశోక్ కుమార్

భూ భారతి పై పోలీస్ అధికారులకు జగిత్యాల ఆర్ డి ఓ చే అవగాహన కార్యక్రమం

వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి..

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం - అదం సంతోష్

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్

పదవ తరగతి ఫలితాల్లో మల్లన్న పేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం
