కొండగట్టు జేఎన్టీయూహెచ్ లో నాలుగవ రోజు కొనసాగుతున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల నిరవధిక సమ్మె – ఉద్యోగాల క్రమబద్ధీకరణ కోరుతూ ఆందోళన
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
కొండగట్టు, ఏప్రిల్ 22(ప్రజా మంటలు)
జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూహెచ్) కొండగట్టు క్యాంపస్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు తమ సేవలను క్రమబద్ధీకరించాలనే ప్రధాన డిమాండ్‌తో చేపట్టిన నిరవధిక సమ్మె నాలుగవ రోజుకు చేరుకుంది.
దీక్షా శిబిరంలో కూర్చొని, నినాదాలు చేస్తూ ప్రభుత్వం తమ బాధలు పట్టించుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు.
ఇంతలో ఇటీవల ఓయూలో (ఉస్మానియా విశ్వవిద్యాలయం) శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను అక్రమంగా అరెస్ట్ చేసిన ఘటనను వారు తీవ్రంగా ఖండించారు. ‘‘ఇది ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసే చర్య. మేము న్యాయం కోరుతూ శాంతియుతంగా పోరాటం చేస్తే ప్రభుత్వం ఈ రీతిలో అణిచివేయడమా?’’ అంటూ వారు ప్రశ్నించారు.
ఓయూ వీసీ నియంతలా వ్యవహరిస్తున్నారని, శాంతియుతంగా గా నిరసన వ్యక్తం చేస్తున్న అధ్యాపకులను అరెస్టు చేయడం చాలా దురదృష్టకరమని వారు అభిప్రాయపడ్డారు. ‘‘ఇలాగే ప్రభుత్వం గానీ, ఉన్నత అధికారులు గానీ మా నిరసనను అణచివేయాలనే ప్రయత్నిస్తే, మేము చూస్తూ ఊరుకోము,’’ అంటూ హెచ్చరించారు.
‘‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా పట్ల సానుకూలంగా ఉందన్న మేము నమ్ముతున్నా, కొన్ని విశ్వవిద్యాలయాల ఉన్నతాధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే నివేదికలు సమర్పిస్తూ మా ఉద్యోగాల క్రమబద్ధీకరణకు ఆటంకం కలిగిస్తున్నారు,’’ అని వారు ఆరోపించారు.
‘‘మేము ఎలాంటి అదనపు కోరికలు పెట్టడం లేదు. మా సేవలను గుర్తించి, న్యాయంగా క్రమబద్ధీకరించాలని మాత్రమే ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము,’’ అని వారు స్పష్టంచేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో డాక్టర్ వినోద్ కుమార్, రాకేష్, వెంకటేష్, రాజేష్, దిలీప్, రాజేందర్, సమ్రన్ సుల్తానా తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సరస్వతి ఘాట్ లో సరస్వతీ నవ రత్నమాల హారతి దర్శనం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

సరస్వతి పుష్కరాలు సీఎం రేవంత్ రెడ్డి

చేసిన సేవలే నాయకులకు గుర్తింపునిస్తాయి

తెలంగాణ ఆడపడుచులతో అందగత్తెల కాళ్ళు కడిగిస్తారా...?

భూమాతకు బూరెలు నైవేద్యం సమర్పించిన చిన్నారులు

యావర్ రోడ్డు విస్తరించాలని కేంద్ర మంత్రిని కోరిన జగిత్యాల బీజేపీ నేతలు.

ఖేలో ఇండియా వెయిట్ లిఫ్టింగ్ విజేతకు సన్మానం

నాణ్యతే మా నిష్ఠ — భద్రతే ప్రాధాన్యం

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు. ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

సహస్ర లింగాల దేవాలయంలో పుష్కరాల సందర్భంగా శ్రీ సరస్వతి అమ్మవారికి పంచామృతాభిషేకాలు ప్రత్యేక పూజలు

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్

తమ జీతం యధావిధిగా ఇవ్వాలని స్వచ్ఛభారత్ ఔట్సోర్సింగ్ డ్రైవర్లచే ఎమ్మెల్యేకు వినతి
