మాదకద్రవ్యాల వినియోగం ద్వారా హింస ,అనారోగ్యం, నైతిక విలువల పతనం
జిల్లా ఎస్పీ ఆశోక్ కుమార్
జగిత్యాల ఏప్రిల్ 24(ప్రజా మంటలు)
మాదకద్రవ్యాల వినియోగం సమాజాన్ని హింస, అనారోగ్యం, నైతిక విలువల పతనం వంటి అనేక దుష్ప్రభావాల వైపు నడిపిస్తోందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు.
జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే పరిణామాల పై అవగాహన చేయడంతో పాటు వినియోగించడం వల్ల కలిగే నష్టలపై యువతకు, పాఠశాల, కళాశాల విద్యార్థులకు దిశా నిర్దేశం చేసే కార్యక్రమం లో బాగంగా గురువారం పొలాస వ్యవసాయ కళాశాలలో జిల్లా పోలీసు శాఖ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.... సమాజం నుంచి యువత మంచిని మాత్రమే నేర్చుకోవాలని చెడు వ్యసనాలు, అలవాట్లపై, ఆకర్షితులై జీవితాలు నాశనం చేసుకోకూడదని విద్యార్థి దశ నుండే మన ఆలోచనలు ఉన్నత స్థాయిలో ఉండాలని అలాంటి ఆలోచన వల్లే మనం జీవితంలో అనుకున్నా స్థాయిలో రాణించగలుగుతామని అన్నారు. ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో యువత పోటీ తత్వంతో ఉండాలని నేటి యువత పైన దేశ అభివృద్ధి ఆధారపడి వుంటుందని అన్నారు. యువత విద్యార్థులు మాదకద్రవ్యాలకు పూర్తిస్థాయిలో దూరంగా ఉండాలని వాటికి బానిస కావడం ద్వారా అనుకోకుండా క్రైమ్ చేసే అవకాశం ఉందని అన్నారు. ఏదైనా క్రైం చేసినట్లయితే ఎలాంటి ఉద్యోగం కూడా రాదని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్ స్టాన్స్ యాక్ట్ ప్రకారం శిక్షార్హులు అవుతారని అన్నారు. డ్రగ్స్, మత్తు పదార్థాలు, గంజాయి గురించి న సమాచారం తెలిస్తే స్థానిక పోలీసులకు గాని, డయల్ -100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని అన్నారు.జిల్లాలో డ్రగ్స్ రహిత వాతావరణ నెలకొల్పేందుకు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందిని డ్రగ్స్, గంజాయి రహిత జిల్లాలుగా మార్చడం జరుగుతుందని అన్నారు.
అనంతరం తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో ముద్రించిన ప్రచారం పోస్టర్లను ఆవిష్కరించారు.
అవగాహన సమావేశం అనంతరం, డ్రగ్స్, మత్తు పదార్థాలకు ఆకర్షితులవుతున్న యువతను జాగృతం చేయడానికి గాను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన షార్ట్ ఫిల్మ్ ను ఎస్పి విద్యార్థులతో కలిసి తిలకించారు.
కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ సైదా నాయక్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ కార్యదర్శి మంచాల కృష్ణ, సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, కార్యక్రమ కో ఆర్డినేటర్, కళాశాల ఎన్ సి సి లెఫ్టినెంట్ అధికారి, డీ-అడిక్ట్ ట్రైనర్ పర్లపల్లి రాజు, సి సి ఎస్ సి.ఐ శ్రీనివాస్, రూరల్ సి.ఐ కృష్ణారెడ్డి, రూరల్ ఎస్ ఐ సదాకర్, కళాశాల ఎన్ఎస్ ఎస్ అధికారి ఎల్లాగౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల బ్రాహ్మణ సేవా సంఘం ఆత్మీయ సమ్మేళనం _తుంగూరు సర్పంచ్ కు సన్మానం
జగిత్యాల జనవరి 18 జగిత్యాల అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆత్మీయ సమ్మేళనం విద్యానగర్లోని ఎడ్ల అంగడి సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో తంగూరి గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన అర్షకోట రాజగోపాల్రావుకు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి శేష వస్త్రంతో సత్కరించారు.
ఈ సందర్భంగా... స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ...
సికింద్రాబాద్, జనవరి 18( ప్రజామంటలు):
హైదరాబాద్ నగరంలో ఫుట్‌పాత్‌లపై జీవనం సాగిస్తున్న అబాగ్యులు, నిరాశ్రయులు, సంచారజాతులను గుర్తించి స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజంలోని అత్యంత పేద వర్గాల జీవన పరిస్థితులకు కొంతైనా ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా స్కై ఫౌండేషన్ ప్రెసిడెంట్... అన్నపూర్ణ సేవా సమితి వారి అన్న ప్రసాదం ప్రారంభించిన ఎమ్మెల్సీ ఎల్ రమణ
జగిత్యాల జనవరి 18 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రం విద్యా నగర్ ఎడ్లంగడి సమీపంలో ని, శ్రీ సీతా రామాంజనేయ దేవాలయం లో, అన్నపూర్ణ సేవాసమితి, వారు అన్న ప్రసాద వితరణ ఈ ఆలయ ఆవరణంలో ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎల్ రమణ హాజరై అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయ కమిటీ... తప్పిపోయిన యువకుడు ఆత్మహత్య – బట్టపల్లి శివారులో మృతదేహం లభ్యం
గొల్లపల్లి, జనవరి 18 (ప్రజా మంటలు):
ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన మంద నరేష్ (35) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం భార్యతో కిరాణా షాపుకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన నరేష్ తిరిగి ఇంటికి రాలేదు.
కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంత వెతికినా... డ్రంక్ అండ్ డ్రైవ్ నివారణ పై జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు
జగిత్యాల జనవరి 18 ( ప్రజా మంటలు)జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో *“Arrive Alive”* రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు (6వ రోజు) *“Drunk and Drive – Zero Tolerance Day”* పై అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా... ఖమ్మం ఏదులాపురంలో రూ.362 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
రూ.362 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో దాదాపు రూ.362 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మున్నేరు నుంచి పాలేరు లింక్ కెనాల్, ఏదులాపురంలోని జేఎన్టీయూ కళాశాలకు శంకుస్థాపన చేశారు.
ఆసుపత్రి, మార్కెట్ యార్డు, నర్సింగ్ కాలేజీ
కూసుమంచిలో ... తెలంగాణ సబ్ జూనియర్ అథ్లెటిక్స్‌లో జగిత్యాల విద్యార్థుల సత్తా
మెటుపల్లి, జనవరి 18 (ప్రజా మంటలు):
11వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు అదిలాబాద్‌లో శనివారం ఘనంగా జరిగాయి. ఈ పోటీల్లో జగిత్యాల జిల్లా విద్యార్థులు అద్భుత ప్రదర్శనతో రెండు బంగారు పథకాలు సాధించి జిల్లా ఖ్యాతిని రాష్ట్ర స్థాయిలో చాటారు.
8 సంవత్సరాల విభాగంలో నిర్వహించిన 60 మీటర్ల... ధర్మారం ఆదర్శ పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
గొల్లపల్లి, జనవరి 18 (ప్రజా మంటలు):
ధర్మారం మండల ఆదర్శ పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను ఆరవ తరగతి ప్రవేశాలతో పాటు ఏడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు మిగిలి ఉన్న సీట్ల భర్తీ కోసం తెలంగాణ మోడల్ స్కూల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్ ఈరవేణి... సీనియర్ నాయకులకే మున్సిపల్ టికెట్ల ఇవ్వాలి: మైనార్టీ నాయకుల డిమాండ్:
కరీంనగర్, జనవరి 18 (ప్రజా మంటలు):
రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముస్లిం మెజారిటీ ఓట్లు ఉన్న డివిజన్లలో, అలాగే ముస్లింల జనాభా 30 శాతం కంటే ఎక్కువగా ఉన్న డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయించేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ మొహమ్మద్ తాజోద్దిన్ డిమాండ్ చేశారు.
గతంలో కాంగ్రెస్... బీఆర్ఎస్ను బొందపెట్టాలి.. కేసీఆర్‌ను తరిమికొట్టాలి
ఖమ్మం, జనవరి 18 (ప్రజా మంటలు):
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తానని కంకణం కట్టుకున్న కేసీఆర్‌ను రాజకీయంగా తరిమికొట్టాలని హెచ్చరించారు. బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వకుండా పేదలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. పేదలను మోసం... ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య మండలికి అడుగు – ఈయూ, దక్షిణ అమెరికా దేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందం
బ్రస్సెల్స్ జనవరి 18:
యూరోపియన్ యూనియన్ (ఈయూ) నేతలు దక్షిణ అమెరికా దేశాలతో చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ఒప్పందం అమలులోకి వస్తే, ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రీ-ట్రేడ్ జోన్‌గా ఇది నిలవనుంది అని ఈయూ నేతలు ప్రకటిస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన కాలంలో యూరోప్ భద్రతపై బాధ్యత... సికింద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ను ఏర్పాటు చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదు - సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీమంత్రి,
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
సికింద్రాబాద్ 18 జనవరి (ప్రజా మంటలు) :
సికింద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ను ఏర్పాటు చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.
ఆదివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయంలో బి ఆర్... 