ఇల్లు లేని నిరుపేదల దరఖాస్తులు పకడ్బందీగా వెరిఫికేషన్ చేయాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
సిరిసిల్ల రాజేంద్ర శర్మ
జగిత్యాల ఏప్రిల్ 23 ( ప్రజా మంటలు)
ఇల్లు లేని నిరుపేదల దరఖాస్తులు పకడ్బందీగా వెరిఫికేషన్ చేయాలి అన్నారు జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్.
ఇందిరమ్మ ఇండ్లు మంజూరి కొరకై లబ్ధిదారులు అర్హత పరిశీలించుట శిక్షణ కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ .
బుధవారం రోజున జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమం లో అడిషనల్ కలెక్టర్ బిఎస్ లతా తో కలిసి పాల్గొ న్నారు . రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టబడిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకం ద్వారా ఇందిరమ్మ ఇల్లు మంజూరు కొరకై సొంత స్థలం కలిగి ఇండ్లు లేని నిరుపేదలను గుర్తించుట కొరకై జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో నలుగురిని గెజిటెడ్ స్పెషల్ ఆఫీసర్ లను మండలాల వారిగా కమిటీలు ఏర్పాట్లు చేసి పకడ్బందీ గా అవకతవకలు తావు లేకుండా కలెక్టర్ అధికారులకు సూచించారు.
ఇల్లు లేని నిరుపేదలు దరఖాస్తులు చేసుకున్న వారికి పకడ్బందీగా వెరిఫికేషన్ చేయాలని అధికారులకు సూచించారు.
జిల్లా కలెక్టర్ మరియు అదనపు కలెక్టర్ ప్రొజెక్టర్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నది
ఈ శిక్షణ కార్యక్రమంలో వచ్చిన అధికారులను ఉద్దేశించి రాష్ట్ర అధికారాలకు ఆదేశాల మరియు సూచనలు పాటిస్తూ ఆయా గ్రామంలోని ఇందిరమ్మ కమిటీల ద్వారా దరఖాస్తుల జాబితా లను పరిశీలిస్తూ ఇల్లు లేని నిరుపేదలకు గుర్తించ వలసిందిగా అధికారులను ఆదేశించారు .
ఇందిరమ్మ ఇండ్లకు అర్హులను గుర్తించుటకు ఈ క్రింది విషయాలను గమనించవలసిందిగా అధికారులను సూచించారు .
సొంత ఆర్ సి సి ఇండ్లు కలిగి ఉండరాదు.
2.5 ఎకరాల పైన వ్యవసాయ భూమి కలిగి ఉండరాదు,
సొంత కారు ఉండరాదు ,
కుటుంబ సభ్యుల కు ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉండరాదు.
వలస వెళ్లిన వారై ఉండరాదు ,
ఆదాయపు పన్ను చెల్లించిన వారై ఉండరాదు.
ఇందిరమ్మ ఇండ్లకు లబ్ధిదారులు తప్పనిసరిగా (బి పిఎల్ ) దరిద్ర దిగువ రేఖ అయి ఉండాలి .
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి ఎస్ లత హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు రెవెన్యూ డివిజనల్ అధికారులు ఎంపీడీవో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ ఆస్పత్రి ఆవరణలో గుర్తుతెలిసిన డెడ్ బాడీ

బన్సీలాల్ పేట టిడిపి డివిజన్ అధ్యక్షుడిగా సందీప్

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా రాణి అహల్యాబాయ్ జయంతి వేడుకలు

కలెక్టర్లు మానవీయకోణంలో భూసమస్యలు పరిష్కరించాలి.. క్షేత్రస్థాయిలో పర్యటన చేయండి ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలి
.jpg)
సంప్రదాయ రీతిలో సంకట హర చతుర్థి

తెలంగాణ విప్లవోద్యమ చరిత్రలో ఒక వెలుగురేఖ పల్లెమీది నారాయణ.

మహిళా సంఘాల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన ఏకరూప దుస్తులు*

సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా మా భాగవతి 21వ విశాల్ జాగరన్ వేడుకలు

జాతీయ డెంగ్యూ దినోత్సవం...న్యూ బోయిగూడ లో డెంగ్యూ అవెర్ నెస్ ర్యాలీ

ఆరోగ్యం పట్ల ఆశ్రద్ద చూపొద్దు - మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు

గాంధీ ఆస్పత్రిని సందర్శించిన జాతీయ వైద్య బృందం

2024 25 విద్యా సంవత్సరం ఎస్సీ ఎస్టీ, బిసి ఓసి మైనారిటీ కళాశాలల స్కాలర్షిప్లకు దరఖాస్తుల ఆహ్వానం
