గాంధీ ఆస్పత్రిలో పెయిన్ క్లినిక్ ప్రారంభం
సికింద్రాబాద్ ఏప్రిల్ 12 (ప్రజామంటలు):
గాంధీ ఆస్పత్రిలోని ఓపి బ్లాక్ లో అనస్థీషియా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పెయిన్ క్లినిక్ ను శనివారం డీఎంఈ డాక్టర్ ఏ.నరేంద్ర కుమార్, గాంధీ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి, ఆర్ ఎం ఓ డా.శేషాద్రి,విభాగం హెచ్ ఓ డి డాక్టర్ ఆవుల మురళీధర్ లతో కలసి ప్రారంభించారు. పెయిన్ క్లినిక్ సోమవారుం నుంచి శనివారం వరకు అందుబాటులో ఉంటుందన్నారు. గాంధీ మెడికల్ కాలేజ్ గ్లోబల్ అలయన్స్, జనహిత సేవా ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో సమకూర్చిన అల్ట్రా సౌండ్ స్కానింగ్ యంత్రాన్ని వారు ప్రారంభించారు. అనస్థీషియా వైద్య విద్యార్థులకు తమ పరిశోధనలకు ఉపయోగపడే ఈ-–లైబ్రరీని ప్రారంభించారు.అనస్థీషియా విభాగం ప్రొఫెసర్ల చాంబర్లను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇటీవల జరిగిన పరీక్షలలో అనస్థిషియా విభాగంలో 1, 3, 6 వ స్థానాలలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించిన యువ డాక్టర్లను అభినందించారు. గాంధీ ఆస్పత్రి అనస్థీషియా విభాగంలో సేవలందించిన ఎనిమిది మంది పూర్వ హెచ్ ఓ డి లను ఆహ్వానించి సన్మానించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వాసవి మాత ఆలయంలో ఘనంగా గురువారాల ఏకాదశి ఉద్యాపన ఉత్సవము

సీఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం 8లక్షల ఎల్ ఓ సి అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

శ్రీ సూర్య ధనవంతరి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా కుంకుమార్చనలు పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి

ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని, సైనికులకు మనోధైర్యం కల్పించాలని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు

జగిత్యాల ప్రధాన కూడల్లో ఉన్నటువంటి అక్రమ షెడ్లను తొలగించాలి. -విశ్వహిందూ పరిషత్ నాయకులు

సూర్య ధన్వంతరి సప్తమ బ్రహ్మోత్సవాలు

భారత సైన్యానికి మద్దతుగా శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..
