మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*
భీమదేవరపల్లి మే 9 (ప్రజామంటలు) :
హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు సందర్భంగా, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జక్కుల అనిల్ యాదవ్, ఉపాధ్యక్షులు చిట్కూరి అనిల్ రక్తదానము చేశారు. ఈ కార్యక్రమం ద్వారా సామాజిక సేవా దృక్పథాన్ని ప్రతిబింబిస్తూ, సమాజానికి సేవ చేయాలనే సంకల్పాన్ని యువతలో నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అనిల్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రక్తదానం యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం, మరియు అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి సహాయం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రక్తదాన శిబిరం ద్వారా మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజును సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవడం ద్వారా, యువతలో సామాజిక బాధ్యతను పెంపొందించడంలో ఈ కార్యక్రమం ముఖ్యపాత్ర పోషిస్తుందని చిట్కూరి అనిల్ అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మున్సిపాలిటీ – ప్రధాన పార్టీల అభ్యర్థుల జాబితా
జగిత్యాల ఫిబ్రవరి 03 (ప్రజా మంటలు):
ప్రధాన పార్టీలు – బీజేపీ (BJP), కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు.(వార్డు – రిజర్వేషన్ – అభ్యర్థి పేరు – పార్టీ)
🔹 వార్డు 1 (BC-G)
అనిల్ కుమార్ కుసారి – INC
నిమిషకవి వంశీకృష్ణ – BRS
పుప్పాల రాజేష్ – BJP
🔹... బి.ఎల్.ఓ లు తమ విధులను జాగ్రత్తగా నిర్వహించాలి జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్. లత
జగిత్యాల ఫిబ్రవరి 3 ( ప్రజా మంటలు)పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో బి.ఎల్.ఓ లు తమ విధులను జాగ్రత్తగా నిర్వహించాలనిఅదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్. లత పేర్కొన్నారు.
ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో బి.ఎల్.ఓల పాత్ర కీలకమని చెప్పారు. ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన 18 సంవత్సరాలు... క్రమశిక్షణతో ఉండడం తప్పా: జీవన్ రెడ్డి
జగిత్యాల, ఫిబ్రవరి 3 (ప్రజా మంటలు):
నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తూ, రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించడమే నా తప్పా? అని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ—కష్టకాలంలో పార్టీని నమ్ముకుని... జగిత్యాల మాల జంగం పురోహితులచే రాజరాజేశ్వర స్వామి పల్లకి సేవ
జగిత్యాల ఫిబ్రవరి 3 ( ప్రజా మంటలు) మాల జంగం కు చెందిన వేల్పుల వంశస్థులకు మంగళవారం రాజరాజేశ్వర స్వామి పల్లకి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా మంచినీళ్ల భావి వద్ద గల శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయంలో పురాని పేటకు చెందినమాల జంగం కుల మహేశ్వర పురోహితులు లక్కం శివనాథం, మురళీదాస్, మోహన్, కోదాది... జగిత్యాల పట్టణ బి ఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు కు శుభాకాంక్షలు తెలిపిన దావా వసంత
జగిత్యాల ఫిబ్రవరి 3 (ప్రజా మంటలు)జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆదేశాల మేరకు పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన వెంకటేశ్వరరావు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ని మర్యాదపూర్వకంగా కలవగా వారికి శాలువ కప్పి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
మున్సిపల్ ఎలక్షన్లో బిఆర్ఎస్ పార్టీ... రాయికల్ మున్సిపల్ బి ఆర్ఎస్ అభ్యర్థులకు బీఫాంలు అందజేసిన దావా వసంత
రాయికల్ ఫిబ్రవరి 3 ( ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు జగిత్యాల రాయికల్ పట్టణ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జ్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆదేశానుసారం రాయికల్ పట్టణ మున్సిపల్ ఎన్నికల అభ్యర్థులకు బిఆర్ఎస్ పార్టీ బీ ఫాములు... పంతం నెగ్గించుకొన్న MLA సంజయ్: 35 సీట్లతో పై చేయి.
జీవన్ రెడ్డి వర్గంలో తీవ్ర అసంతృప్తి – కార్యకర్తల ఆగ్రహం
జీవన్ రెడ్డి నిర్ణయం కొరకు ఎదిరి చూపు?
జగిత్యాల ఫిబ్రవరి 03 (ప్రజా మంటలు):
జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపు తీవ్ర వివాదానికి దారితీసింది. టికెట్ల పంపిణీలో అన్యాయం జరిగిందంటూ సీనియర్ నేత జీవన్ రెడ్డి వర్గం తీవ్ర అసంతృప్తిని... రావి నారాయణ రెడ్డికి తెలంగాణలో సముచిత స్థానం కల్పిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
భూమి–భుక్తి–వెట్టిచాకిరి విముక్తి పోరాట వీరుడికి ప్రభుత్వ గౌరవం
హైదరాబాద్ ఫిబ్రవరి 02 (ప్రజా మంటలు):
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన సమరయోధుడు రావి నారాయణ రెడ్డికి తెలంగాణ సమాజంలో ప్రభుత్వం సముచితమైన స్థానం కల్పిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రావి నారాయణ రెడ్డి చరిత్రను పాఠ్యాంశాల్లో... హుస్నాబాద్ పట్టణాన్ని రాష్ట్రంలో రోల్ మోడల్ చేస్తా - పొన్నం
హుస్నాబాద్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, ఫిబ్రవరి2,(ప్రజా మంటలు):
ఈనెల 11 వ తేదీన జరిగే ఎన్నికల్లో హుస్నాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని 20 లోస్థానాలు గెలిపించి తనకు మరింత బలాన్ని ఇవ్వాలని హుస్నాబాద్ పట్టణంను ప్రత్యేక ప్రణాళిక ద్వారా అభివృద్ధి చేస్తున్నామని ,గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో ఒక్క డబుల్... లయన్స్ క్లబ్, లీడ్ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస కార్యక్రమం
గొల్లపల్లి, ఫిబ్రవరి 02 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో సోమవారం లయన్స్ క్లబ్ గొల్లపల్లి, లీడ్ ఇండియా ఫౌండేషన్ సంయుక్తంగా విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మోటివేటివ్ స్పీకర్ కెప్టెన్ డా. లయన్ బుర్ర మధుసూదన్ రెడ్డి విద్యార్థుల్లో ఉత్సాహం, ఆత్మవిశ్వాసాన్ని నింపారు.... 