కేసీఆర్ అప్పు..తెలంగాణ భవిష్యత్తుకు ముప్పుగా దాపురించింది –మంత్రి సీతక్క...
*గత ప్రభుత్వం కొన్ని వర్గాలకే కొమ్ముకాసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది...
*సనత్ నగర్ లో లబ్దిదారుడి ఇంట్లో సన్నబియ్యం బువ్వ తిన్న మంత్రి సీతక్క....
సికింద్రాబాద్ మే 06 (ప్రజామంటలు) :
కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు తెలంగాణ భవిష్యత్తుకు ముప్పుగా దాపురించిందని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు.కేసీఆర్ నిర్వాకం వల్ల నెలకు 6 వేల కోట్ల ప్రజాధనాన్ని అప్పుల చెల్లింపుల కోసం మళ్లించాల్సి వస్తుందని మంత్రి పేర్కొన్నారు.
అప్పులు, అమ్మకాలు తప్ప కేసీఆర్ ప్రభుత్వం చేసినఅభివృద్ది శూన్యమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ది ఒక గాలి బుడగ అని ఎన్నికల్లో ప్రజలే తేల్చారు. మీ అప్పుల మూలంగా ఎన్నో ఆర్దిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. సనత్ నగర్ నియోజవర్గ పరిధిలోని బేగంపేట పాటిగడ్డ ఎన్ బి టి నగర్ ఓ ఇంట్లో రేషన్ షాపులో ఇచ్చిన సన్న బియ్యంతో వండిన బోజనం ను ఏఐసీసీ మెంబర్ డాక్టర్ కోట నీలిమా, ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి మంత్రి సీతక్క తిన్నారు.
ఈ సందర్బగా మంత్రి మాట్లాడుతూ గతంలో పుడ్ సేఫ్టీ కార్డు ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వమని,ఇప్పుడు పేదవారు కూడా దనికులతో సమానంగా సన్న బియ్యం తిని ఆరోగ్యంగా ఉండాలని ఎన్నికల్లో లేని హామీని కూడా తమ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సన్న బియ్యం కార్యక్రమం పేదల ఆకలి తీరుస్తుందని అన్నారు. కేవలం సంపన్న వర్గాలు మాత్రమే తినే సన్న బియ్యాన్ని ఉచితంగా పేద ప్రజలకు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పేదవాడు సన్న బియ్యం అన్నం తినాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం లబ్ధిదారులకు రేషన్ షాపులో సన్న బియ్యం ఇస్తున్నట్లు మంత్ర చెప్పారు. పేదలు సన్న బియ్యం తింటుంటే బీఆర్ఎస్, బీజేపీ పార్టీ నాయకుల కడుపు మండుతుందని సీతక్క ఎద్దేవాచేశారు. సీఎం రేవంత్ రెడ్డి పై అనవసర వ్యాఖ్యలతో కేటీఆర్ తన అసహనాన్ని ప్రదర్శిస్తున్నారన్ మంత్రి సీతక్క గత ప్రభుత్వ వైఫల్యాలను దుయ్యబట్టారు. సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ అంటూ బీఆర్ఎస్ నాయకులు ప్రగల్బాలు పలుకుతున్నారని, సత్తా ఉన్న నాయకుడు పత్తా లేకుండా ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. సత్తా ఉంటే అసెంబ్లీకి వచ్చి సత్తా నిరూపించుకోవాలి కానీ, కనిపించకుండా పోతే ఎలా అన్నారు.
ఉద్యోగుల పోరాటాన్ని వాడుకున్న చరిత్ర బీఆర్ఎస్ దని,40 మంది ఆర్టీసీ కార్మికుల ఉసురు తీసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఉపాద్యాయ, ఉద్యోగ నాయకుల ఇంటి తలుపులు పగుల గొట్టిన ఘనుడు కేటీఆర్ కాదా...? అని ప్రశ్నించారు. ఎందరో ఉద్యమకారులను అవమాన పరిచి బయటకు పంపిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉందని, మీ అప్పుల మూలంగా ఎన్నో ఆర్దిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి...అయినా ఎక్కడా సంక్షేమానికి లోటు లేకుండా చూస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమా , ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఏపీ బీజేపీ నేత సుజనా చౌదరికి శస్ర్త చికిత్స

బి.సి యువత కే గ్రంథాలయ చైర్మన్... !!!

రోడ్డు ప్రమాదాల నివారణకై ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్_ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 40 వాహనాల సీజ్

హైదరాబాద్ లో రేపు సా .4 గం .లాక్అuత్యవసర మాక్ డ్రిల్
.jpg)
అనాధ పిల్లలకు 10 వేలు అందించిన సామాజిక సేవకులు స సూరజ్ శివ శంకర్

కేసీఆర్ అప్పు..తెలంగాణ భవిష్యత్తుకు ముప్పుగా దాపురించింది –మంత్రి సీతక్క...

ఈనెల 7న హైదరాబాద్‌లో నిర్వహించే కుల గణన డాక్యుమెంట్ రూపకల్పన సమావేశానికి అధిక సంఖ్యలో బీసీలు కదిలి రావాలి_

విద్యుత్ ఘాతంతో నాలుగు గేదెలు మృతి

15 గంజాయి కేసుతో సహా, మరో 05 కేసులల్లో పరారీలో ఉన్న హమ్మద్ అనే నిందుతుడు అరెస్ట్

అభివృద్ధి కార్యక్గమాలు పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత శిక్షణ తరగతులు ముగింపు

జగిత్యాల జిల్లా లో డిగ్రీ అడ్మిషన్లకై దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు.
