వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల మే 7 (ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలోని రామ్ బజార్ లో గల వాసవి మాత
ఆలయంలో వాసవి మాత జయంతి సందర్భంగా ఉదయం సుప్రభాత సేవ, ఉత్సవమూర్తికి పల్లకి సేవ, ఫల పంచామృత అభిషేకం, వసంత రుతువులో లభ్యమయ్యే, ఆమ్ర, పలరసాభిషేకం నిర్వహించారు. మాతలు విశేష సంఖ్యలో సామూహిక కుంకుమార్చన లో పాల్గొన్నారు. సభాపతి బ్రహ్మశ్రీ తిగుల్ల విషు శర్మ, ఆలయ అర్చకులు సిరిసిల్ల భాస్కర్ శర్మ కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు .
అనంతరం మహా అన్నప్రసాదం అందించారు. సామూహిక కుంకుమ పూజలో పాల్గొన్న సువాసినీ లకు లక్కీ డ్రా ద్వారా 11 మందిని ఎంపిక చేసి బహుమతులు ప్రధానం చేశారు. రాత్రి 7 గంటలకు పట్టణంలో అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రత్యేక వాహనంపై ఏర్పాటు చేసి మంగళవాద్యాలతో శోభ యాత్ర నిర్వహించారు. శోభాయాత్రలో మాతలు కోలాటాలు నిర్వహిస్తూ శో భయాత్రను కొనసాగించారు.ఈ నాటి కార్యక్రమంలో ఆలయ కార్యవర్గం, మాతలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీసాయి సప్తాహం ముగింపువేడుకలు

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి

నేడు అధికారభాష హిందీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు

కిమ్స్-సన్షైన్ హాస్పిటల్స్, బేగంపేటలో కేవలం 3 నెలల్లో 50 రోబోటిక్ సర్జరీలు

ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి

ఆరోగ్యవంతులైన బాలికలే దేశ భవిత

మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్

కొండగట్టు 30.వ.గిరిప్రదక్షిణ ఆదివారం మద్యం, మాంసం మానేద్దాం'

కేజీవీలతో ట్రాక్టర్లు తారు రోడ్డుపై తిరిగితే కేసులు నమోదు - ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

షిరిడి సాయి మందిరంలో ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు

జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘ్ అధ్యక్షునిగా చీటీ శ్రీనివాస్ రావు
