భరోసా సెంటర్ ద్వారా బాధిత మహిళలకు రక్షణ, భరోసా
మంద. శ్రవణ్ కుమార్ గౌడ్
9391526141
జగిత్యాల మే 7(ప్రజా మంటలు)
జిల్లా కేంద్రం లో బాధిత మహిళలు లేదా బాలికలకు వైద్యం,కౌన్సిలింగ్,అన్ని రకాల సేవలు అందించడంతో పాటు వారికీ పోలీస్ అండగా ఉంటుందనే మనోదైర్యం కల్పించడం కోసం ఏర్పాటు చేసిన భరోసా సెంటర్ ప్రారంభించి సంవత్సర కాలం అవుతున్న సందర్బంగా వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
భరోసా కేంద్రం ద్వారా బాధిత మహిళలకు,బాలికలకు న్యాయం జరిగేలా కృషి చేస్తునయె. భరోసా కేంద్రం ద్వారా సమగ్రమైన సహాయాన్ని అందించడానికి మరియు ఆపదకు లోనైన వారికి పోలీస్ స్టేషన్లకు,ఆసుపత్రులకు దూరంగా సురక్షితమైన వాతావరణంలో చేయూత అందించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. హింస మరియు లైంగిక వేధింపులకు గురైన పిల్లలు, స్త్రీలు మరల ఇటువంటి వాటి బారిన పడకుండా చూడడమే భరోసా సెంటర్ యొక్క ముఖ్య లక్ష్యం.
లైంగిక వేధింపులకు గురైన బాధిత మహిళాలకు లేదా బాలికలకు సంబందించిన కేసు పోలీస్ స్టేషన్ లో నమోదు కాబడిన సమయం నుండి బాధితులకు అండగా ఉంటూ వారి మానసిక పరిస్థితి గురించి తెలుసుకుంటూ వారికి భరోసా కల్పిస్తూ మరియు భరోసా సెంటర్ల గురించి అందరికీ అవగాహన కల్పిస్తున్న భరోసా సెంటర్ సిబ్బందిని ఈ సందర్భంగా ఎస్పి అభినందించారు.
ఈ కార్యక్రమంలో సి సి ఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్.ఐ గీత, భరోసా సెంటర్ కోఆర్డినేటర్ అనూష , సపోర్ట్ అధికారి లు సుజాత ,ప్రతిబా , రిసెప్షనిస్ట్ సునీతా, ఏ ఎన్ఎం లక్ష్మీ, మహిళా కానిస్టేబుల్ గౌతమి పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)
మాక్ డ్రిల్ విజయవంతం - అత్యవసర పరిస్థితుల్లో ఎస్కేప్ కావడంపై అవెర్నెస్

సోలార్ పవర్ స్కీం ను వినియోగించుకోండి.. - జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ భరత్ గౌడ్

పేకాట స్థావరంపై సిసి ఎస్ పోలీసుల దాడి *పోలీసుల అదుపులో 6 గురు, 26060/- రూపాయలు స్వాదీనం

భరోసా సెంటర్ ద్వారా బాధిత మహిళలకు రక్షణ, భరోసా

పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి

చలిగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద రైతులు ఆందోళన మద్దతు పలికిన మాజీ జెడ్పి చైర్ పర్సన్ వసంత

అక్రమ కేసులను వెంటనే మన ప్రభుత్వం ఎత్తి వేయాలి

ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై కొండగట్టులో ప్రత్యేక పూజలు

ఏపీ బీజేపీ నేత సుజనా చౌదరికి శస్ర్త చికిత్స

బి.సి యువత కే గ్రంథాలయ చైర్మన్... !!!
