భూ భారతి పైలెట్ మండలంగా బుగ్గారంను గుర్తించినందుకు హర్షం
ప్రభుత్వ విప్, జిల్లా కలెక్టర్ లకు కృతజ్ఞతలు తెలిపిన విడిసి, ఎండిసి
రైతులు భూ భారతి సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి : చుక్క గంగారెడ్డి
బుగ్గారం ఏప్రిల్ 05 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లాలో బుగ్గారం మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్ మండలంగా గుర్తించి సోమవారం రెవెన్యూ సదస్సులు ప్రారంభించినందులకు ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు, జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ కు, ఇతర అధికారులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు బుగ్గారం విడిసి, ఎండిసి లు కృతజ్ఞతలు తెలిపాయి. గ్రామ అభివృద్ది కమిటీ అధ్యక్షులు నక్క చంద్రమౌళి అధ్యక్షతన
సోమవారం మండల కేంద్రంలో రైతులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మండల అభివృద్ధి కమిటి కన్వీనర్ చుక్క గంగారెడ్డి మాట్లాడుతూ రైతులు ఇట్టి గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ లు మండలాన్ని పైలెట్ మండలంగా గుర్తించడం హర్షణీయం అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వర్గం, ఎమ్మెల్యేలు ఏక తాటితో వ్యవహరించి రైతుల సమస్యలను, ప్రజల సమస్యలను అర్థం చేసుకొని ఎంతో ప్రతిష్టాత్మకంగా భూ భారతి చట్టాన్ని తెరపైకి తేవడం జరిగిందన్నారు. మండలంలోని అన్ని గ్రామాలలో షెడ్యూల్ ప్రకారం నేటి నుండి ఈ నెల 16 వరకు జరిగే రెవెన్యూ సదస్సులకు రైతులు, ప్రజలు తగిన ఆధారాలతో సహా హాజరై మీకున్న భూ సమస్యలపై విజ్ఞాపన పత్రాలు అందజేయాలన్నారు. నిరక్షరాస్యులైన రైతులకు ఆయా గ్రామాల్లోని యువత సహకరించి దరఖాస్తులు వ్రాసి ఇవ్వాలని కోరారు.
బుగ్గారం మండలంలో వందకు - వంద శాతం భూ సమస్యలు తొలగించే విధంగా అధికారులు కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎండిసి కో - కన్వీనర్ పెద్దనవేణి రాగన్న, విడిసి సభ్యులు, మాజీ ఎంపీటీసీ నగునూరి చిన్న రామాగౌడ్, మాజీ ఉప సర్పంచ్ పెద్ద రామ గౌడ్, కోడిమ్యాల రాజన్న, పెరంభూదూరి రామకృష్ణ స్వామి, పరమాల మల్లయ్య, సిరికొండ గంగన్న, ఆకుల రాజన్న, పచ్చిమట్ల సత్తన్న తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గుడుంబా తయారీదారులనుండి రక్షించండి - బాధితుల ఫిర్యాదు

దేశం పరువు తీయడం రాహుల్ కు అలవాటే... రాహుల్ ఓ రాజకీయ అజ్ఞాని

గ్రేటర్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరాలి... ప్రజలకు సేవ చేసేది కాంగ్రెస్పార్టీయే

శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్

ఇండ్లపై విద్యుత్ వైర్లతో పొంచి ఉన్న ప్రమాదం

భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

సీనియర్ సిటీజేన్లకు అండగా ఉంటా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ

సమకాలీన ప్రపంచంలో సాంకేతికతను ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాలి ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

భూ భారతి పైలెట్ మండలంగా బుగ్గారంను గుర్తించినందుకు హర్షం

భూ భారతి పైలెట్ ప్రాజెక్ట్ గా బుగ్గారం మండలం
