గుడుంబా తయారీదారులనుండి రక్షించండి - బాధితుల ఫిర్యాదు
ప్రజావాణిలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన
గుడుంబా బాధిత యువకులు
గొల్లపల్లి మే 05 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలో అక్రమంగా గుడుంబా బట్టీలు కాస్తున్న వారి వలన గొల్లపల్లి పట్టణంలో చాలామంది మధ్యతరగతి కుటుంబాలు గుడుంబా తాగి అనారోగ్యానికి గురి అయ్యి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని మరియు కొందరు దానికి బానిసగా అయి వారి కుటుంబాలను రోడ్డుపై పడే పరిస్థితిలు ఉన్నాయని, వీరి నుండి యువకులను కాపాడాలని ప్రజావాణిలో కలెక్టర్ కు గుడుంబా బాధిత యువకులు విజ్ఞప్తి చేశారు.
గుడుంబా వలన ప్రజలు దాన్ని సేవించి అనారోగ్యానికి గురవుతున్నారు వారిని వారి ప్రాణాలను కాపాడవలసిందిగా కోరుతూ,కొందరు అక్రమంగా గుడుంబా కాస్తూ విచ్చలవిడిగా పక్కన ఉన్న గ్రామాలకు సరఫరా చేస్తున్నారు దీనిపై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ఫలితం శూన్యం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు.
సోమవారం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబాల యువకులు ఎవరైతే అక్రమంగా గుడుంబా కాస్తున్నారు వారిపై తూతు మంత్రంగా కాకుండా కఠినంగా వ్యవహరించి గుడుంబా కాయకుండా చర్యలు తీసుకోవాలని గొల్లపెల్లి మండల కేంద్రానికి చెందిన బాధితులు కుటుంబాల యువకులు, కోరుతున్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
గుడుంబా తయారీదారులనుండి రక్షించండి - బాధితుల ఫిర్యాదు

దేశం పరువు తీయడం రాహుల్ కు అలవాటే... రాహుల్ ఓ రాజకీయ అజ్ఞాని

గ్రేటర్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరాలి... ప్రజలకు సేవ చేసేది కాంగ్రెస్పార్టీయే

శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్

ఇండ్లపై విద్యుత్ వైర్లతో పొంచి ఉన్న ప్రమాదం

భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

సీనియర్ సిటీజేన్లకు అండగా ఉంటా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ

సమకాలీన ప్రపంచంలో సాంకేతికతను ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాలి ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

భూ భారతి పైలెట్ మండలంగా బుగ్గారంను గుర్తించినందుకు హర్షం

భూ భారతి పైలెట్ ప్రాజెక్ట్ గా బుగ్గారం మండలం
