బి.సి యువత కే గ్రంథాలయ చైర్మన్... !!!
హస్తం చూపు యువత వైపు... !!!
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల 05 మే (ప్రజా మంటలు) :
అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తీసుకుంటున్న వ్యవస్థాగత పరమైన మార్పులలో బాగంగా ఎన్నో విలువైన, గుణాత్మక విషయాలకు పట్టం కడుతుంది అందులో భాగంగానే జిల్లా స్థాయిలలో గ్రంథాలయ చైర్మన్ పదవులకు పెద్ద మొత్తంలో బి.సి లకు అందునా చదువుకున్న యువత కు, పార్టీకి కట్టుబడిన ఏకలవ్య శిష్యులకు పెద్ద పీట వేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించడం కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు దోహదం చేస్తుంది.
గ్రంథాలయాలకు నూతన జవ సత్వాలు నింపి సాంకేతిక పరిజ్ఞానం జోడించి నేటి సమాజానికి సరియైన సమాచార అవసరాన్ని ప్రజలకు అందించాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించడం ఒక కీలక అంశం..
అందులో జరుగుతున్న మేధోమథనం లో ఒక విలువైన అంశంగా కాంగ్రెస్ అనుబంధ ఎన్.ఎస్.యు.ఐ (నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా) లో చురుగ్గా పాల్గొని కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలలో క్రియాశీలక పాత్ర పోషించిన యువతే ఈ పదవులకు ఊతం అదే సరియైన ఆదర్శ వ్యవస్థాగత విధానం అని రాష్ట్ర పి.సి.సి అధ్యక్షులు పలుమార్లు తన అభిప్రాయాన్ని తెలియచేయడం రాష్ట్ర కాంగ్రెస్ యువతలో ఎంతో బాధ్యత పెంచే ఉత్సాహాన్ని నింపుతుంది.
అందులో బాగంగా జగిత్యాలలో ప్రముఖంగా యువనేత, మాజీ ఎన్.ఎస్.యూ.ఐ నాయకుడు, సైద్ధాంతికపరంగా కరడుగట్టిన కాంగ్రెస్ వాది, ప్రస్తుత పి.సి.సి సేవాదళ్ సెక్రటరీ భోగోజీ. ముఖేష్ ఖన్నా పేరు అధిష్ఠానం పరిశీలనకు తీసుకోవడం, పలు పత్రికా కథనాలు వెలువడడం, రచ్చ బండ దగ్గర చర్చలు జరగడం జిల్లా స్థాయిలో సర్వత్రా చర్చనీయాంశం గా మారింది.
జగిత్యాల వరకు కాంగ్రెస్ అంటే జీవనన్న, జీవనన్న అంటే కాంగ్రెస్ గా ఒక చరిష్మా ఉన్న టి. జీవన్ రెడ్డి కుడి భుజమైన మాజీ సర్పంచ్ పోలాస నందయ్య పేరును, ఎడమ భుజమైన బండ శంకర్ పేర్లను ప్రతిపాదించగా, కాంగ్రెస్ పార్టీ లో చేరిన జంపింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం పేరు ప్రతిపాదించినట్లు విశ్వసనీయ సమాచారం.
కుడి, ఎడమైతే పొరబాటు కాదోయ్ ఓడిపోకూడదు అని కాంగ్రెస్ జిల్లా స్థాయి నేతలు ఇరు వర్గాల పెద్దలకు సంకేతాలు ఇస్తూ బి.సి యువతకు పట్టం కట్టాలని అధిష్టానం కు తెలియజేయడం గమనార్హం.
కానీ జిల్లా స్థాయిలో ప్రస్తుతం పదవులు ఇచ్చే విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి.
ఒకవైపు పార్టీని పట్టుకుని నడుస్తూ, నడిపిస్తున్న నాటి తరం,మరో వైపు రేపు పార్టీ నీ నిలబెట్టే పట్టుగొమ్మలుగా యువతరం ఇద్దరూ కట్టర్ సేవకులే పార్టీకి.
జిల్లా స్థాయి పార్టీ పెద్దలలో, నాయకుల్లో ఎవరి ప్రయత్నంగా రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నప్పటికినీ చివరికి వారు కూడా పార్టీ అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం గా బావిస్తున్నారు.
ఈ పదవుల పంపిణీలో ఎవరు త్యాగి, ఎవరు భోగి అనేది త్వరలో తేలనున్నది..
More News...
<%- node_title %>
<%- node_title %>
ఏపీ బీజేపీ నేత సుజనా చౌదరికి శస్ర్త చికిత్స

బి.సి యువత కే గ్రంథాలయ చైర్మన్... !!!

రోడ్డు ప్రమాదాల నివారణకై ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్_ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 40 వాహనాల సీజ్

హైదరాబాద్ లో రేపు సా .4 గం .లాక్అuత్యవసర మాక్ డ్రిల్
.jpg)
అనాధ పిల్లలకు 10 వేలు అందించిన సామాజిక సేవకులు స సూరజ్ శివ శంకర్

కేసీఆర్ అప్పు..తెలంగాణ భవిష్యత్తుకు ముప్పుగా దాపురించింది –మంత్రి సీతక్క...

ఈనెల 7న హైదరాబాద్లో నిర్వహించే కుల గణన డాక్యుమెంట్ రూపకల్పన సమావేశానికి అధిక సంఖ్యలో బీసీలు కదిలి రావాలి_

విద్యుత్ ఘాతంతో నాలుగు గేదెలు మృతి

15 గంజాయి కేసుతో సహా, మరో 05 కేసులల్లో పరారీలో ఉన్న హమ్మద్ అనే నిందుతుడు అరెస్ట్

అభివృద్ధి కార్యక్గమాలు పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత శిక్షణ తరగతులు ముగింపు

జగిత్యాల జిల్లా లో డిగ్రీ అడ్మిషన్లకై దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు.
