భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
బుగ్గారం మండలం యశ్వంతరావు పేటలో భూభారతి రెవెన్యూ సదస్సుకు కలెక్టర్ తో కలిసి హాజరు
బుగ్గారం, మే 05 (ప్రజా మంటలు)
భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు.
భూ భారతీ పైలట్ ప్రాజెక్ట్ రెవెన్యూ సదస్సులో భాగంగా సోమవారం జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం యశ్వంత రావు పేట గ్రామంలో రెవెన్యూ సదస్సుకు విప్ లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ రైతులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలిస్తూ, సత్వర పరిష్కారానికి అనువుగా ఉన్న వాటిని తహసీల్దార్ దృష్టికి తెచ్చి అప్పటికప్పుడే పరిష్కారం జరిగేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు. పైలెట్ ప్రాజెక్టు కింద నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను మండల రైతులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని లక్ష్మణ్ కుమార్ కోరారు.. పైలెట్ మండలంలో సదస్సులు పూర్తయ్యాక, జిల్లాలోని అన్ని మండలాల్లో రెవెన్యూ గ్రామాల వారీగా అధికారులు సదస్సులు నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ భూ భారతి చట్టంపై రైతులు అవగాహన కల్పించారు., రైతుల రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, హెల్ప్ డెస్క్, జనరల్ డెస్క్ ల వద్ద సదుపాయాలు, సిబ్బంది పనితీరును కలెక్టర్ పరిశీలించారు.
అధికారులకు పలు సూచనలు చేశారు. అర్జీలు సమర్పించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. భూ సంబంధిత సమస్యలు ఉన్న వారు నిర్ణీత ప్రొఫార్మా లో దరఖాస్తు చేసుకునేలా సహకారం అందించాలని హెల్ప్ డెస్క్ సిబ్బందిని ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు పెండింగ్లో ఉన్న భూ సంబంధిత సమస్యలకు సంబంధించిన అర్జీలను ఈరోజు కాకుండా రేపు కూడా అధికారులకు అందించవచ్చని పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సులను రైతులు ప్రజలు వినియోగించుకొని భూ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.
ఈ సదస్సులో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, తహసిల్దార్ మజీద్, రెవిన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఏఐసీసీ జిల్లా ఇన్చార్జ్ జయ కుమార్ ను కలిసిన షేక్ చాంద్ పాషా

జ్యోతి సురేఖ వెన్నం – భారతీయ ఆర్చరీలోతెలుగు గర్వం
.jpg)
జ్యోతి సురేఖ వెన్నం చరిత్ర సృష్టించింది – వరల్డ్ కప్ ఫైనల్లో కాంస్య పతకం!

జిల్లా సమాచార మరియు పౌరసంబంధాల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జెడ్పి డిప్యూటీ సిఈవో పి.నరేష్

42 శాతం బీసీ బిల్లుకు టిపిసిసి లీగల్ సెల్ మద్దతు

42 శాతం రిజర్వేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

తెలంగాణ మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ జనరల్ మీటింగుకు ఎమ్మెల్యే డా సంజయ్ కు ఆహ్వానం అందజేత

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ 15వ సామాజిక తనిఖీ.

పాకిస్తాన్ వైమానిక దాడిలో ముగ్గురు యువ ఆఫ్ఘన్ క్రికెటర్లు మృతి — ACB తీవ్ర ఖండన

మహిళల గౌరవం చర్చకు కాదు – ఉత్తరాఖండ్ హైకోర్టు హెచ్చరిక

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై జీవన్ రెడ్డి హామీ

ఇబ్రహీంపట్నం మండలంలో బీసీ బందు ప్రశాంతము.
