శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్
సికింద్రాబాద్ మే 05 (ప్రజామంటలు) :
పుష్ప–2 సినిమా ప్రీమియర్ షో సందర్బంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం రిహాబిలిటేషన్ సెంటర్ లో ఫిజియో థెరపి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను సినీ నిర్మాత, హీరో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ పరామర్శించారు.
సోమవారం ఆయన బేగంపేట్ లోని అనంత రిహాబిలిటేషన్ సెంటర్ కు వెళ్లి శ్రీతేజ్ ను స్వయంగా కలిశారు. రిహాబిలిటేషన్ సెంటర్ లో చికిత్సపొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి , అతనికి అందుతున్న వైద్య సేవలపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ పూర్తి స్థాయిలో రికవరీఅయ్యేందుకు ఎంత సమయం పడుతుందనే విషయాలను సైతం అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పుష్స–2 సినిమా ప్రీవ్యూ షోకు వెళ్లిన శ్రీతేజ్ కుటుంబ సభ్యులు అక్కడ జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి ప్రాణాలు కోల్పోగా, తీవ్రగాయాలపాలైన శ్రీతేజ్ ను సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్సలు అందించారు.
దాదాపు 146 రోజుల పాటు చికిత్స పొందిన శ్రీతేజ్ ను వైద్యులు ఏప్రిల్ 30 న డిశ్చార్జ్ చేస్తూ శ్రీతేజ్ పూర్తి స్తాయిలో కోలుకున్నాడని,అయితే అతనికి పూర్తి స్థాయిలో మెమొరీ రికవరీకి , అవయవాల యాక్టివ్ గా పనిచేయడానికి ఫిజియోథెరపిఅవసరమని సూచించారు. వైద్యుల సలహా మేరకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి నేరుగా బేగంపేటలోని అనంత రీహాబ్ సెంటర్ లోని న్యూరో విభాగానికి తరలించారు. ప్రస్తుతం అనంత రిహాబ్ సెంటర్ లో శ్రీతేజ్ కు వైద్య చికిత్సలతో పాటు ఫిజియో థెరపీ చికిత్సలు అందిస్తున్నారు.
ఈ సందర్బంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ, శ్రీ తేజ్ కోలుకోవటం కోసం మా కుటుంబం అంతా ఎదురుచూస్తోందన్నారు. శ్రీతేజ్ రోజురోజుకు కోలుకుంటున్న విషయం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని, అతడు చికిత్సకు సహకరిస్తున్నారు అని చెప్పిన డాక్టర్లు చెప్పారని అల్లు అరవింద్ పేర్కొన్నారు. త్వరలోనే శ్రీ తేజ్ మనందరి మధ్య సాధారణ పిల్లల్లా ఉంటాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గుడుంబా తయారీదారులనుండి రక్షించండి - బాధితుల ఫిర్యాదు

దేశం పరువు తీయడం రాహుల్ కు అలవాటే... రాహుల్ ఓ రాజకీయ అజ్ఞాని

గ్రేటర్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరాలి... ప్రజలకు సేవ చేసేది కాంగ్రెస్పార్టీయే

శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్

ఇండ్లపై విద్యుత్ వైర్లతో పొంచి ఉన్న ప్రమాదం

భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

సీనియర్ సిటీజేన్లకు అండగా ఉంటా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ

సమకాలీన ప్రపంచంలో సాంకేతికతను ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాలి ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

భూ భారతి పైలెట్ మండలంగా బుగ్గారంను గుర్తించినందుకు హర్షం

భూ భారతి పైలెట్ ప్రాజెక్ట్ గా బుగ్గారం మండలం
